BREAKING NEWS

నిద్రపట్టడం లేదని సతమతమయ్యేవారు ఈ ఆహార పదార్ధాల్ని తీసుకోండి

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర ఉండాలి. చాలా మందికి రాత్రి నిద్ర పట్టదు. నిద్ర పోవడానికి ఎన్నో చిట్కాలు పాటించినా ఫలించక పోవచ్చు. అయితే నిద్ర లేకపోవడం వల్ల కొన్ని అనారోగ్యాలు సంభవిస్తాయి. మరి చక్కగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి..?  అని ఆలోచిస్తున్నారా..? అటువంటి వాళ్ళు ఈ పద్ధతులని అనుసరించారంటే నిద్ర ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఇక పై ఆ ఆలోచన మీకు ఉండదు. ఎందుకంటే చక్కగా నిద్ర పట్టడానికి ఈ ఆహార పదార్థాలు మీకు సహాయ పడతాయి. మరి వాటి కోసం క్లుప్తంగా ఇక్కడ చూసేయండి. ఆ సమస్యను సులువుగా బయటపడిపోండి.
 
ప్రతిరోజు కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్రపోవాలి. అయితే నిద్ర పట్టని వాళ్ళు ఈ ఆహార పదార్థాలు తీసుకోండి. కొన్ని ఆహార పదార్థాలు మరియు పానీయాలు తీసుకోవడం వల్ల నిద్ర పూర్తిగా పడుతుంది. ఈ ఆహారాన్ని రాత్రిపూట తీసుకోవడం వల్ల మీకు నిద్ర బాగా పడుతుంది. అలానే నిద్ర నాణ్యత కూడా బాగా మెరుగు పడుతుంది. ఇక ఆ ఆహార విషయాల్లోకి వచ్చే సరికి... బాదం, కివి, చేప, చెర్రీ జ్యూస్, వాల్ నాట్ వంటి కొన్ని ఆహార పదార్థాలు నాణ్యమైన నిద్రని అందిస్తాయి. వాటి గురించి ఇప్పుడే పూర్తిగా చూడండి.
 
 బాదం:
 
బాదం  తినడం ఆరోగ్యమని డాక్టర్లు చెబుతారు. బాదం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల తో కూడిన డ్రై ఫ్రూట్ అని మనకి తెలిసినదే. రోజూ బాదం పప్పు తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. బాదం నిద్ర నాణ్యతను మెరుగు పరచడం లో సహాయ పడుతుంది. ఎందుకంటే బాదం కూడా మెలటోనిన్ యొక్క మూలం కనుక. దీని వల్ల నిద్ర పట్టేలా మిమ్మల్ని బాదం సిద్ధం చేస్తుంది.  బాదం జలుబు, జ్వరాలకు ఔషధంగా కూడా పని చేస్తుంది. బాదం పై ఉండే పొట్టు కనుక తింటే రోగ నిరోధక శక్త కూడా మీరు పెంచుకోవచ్చు. 
 
అలానే రోజు బాదం కనుక తింటే వైరల్ ఇన్ఫెక్షన్ల పై పోరాడే శక్తి బాగా పెరుగుతుంది. అంతే కాదండి  బాగా అలసటగా కనుక మీకు అనిపించినప్పుడు 4 బాదం పప్పుల్ని  తీసుకుంటే తక్షణ శక్తి మీ సొంతం అవుతుంది. మధుమేహం తో బాధపడే వారు భోజనం తర్వాత తీసుకుంటే మంచి  ఫలితం ఉంటుంది.  వీటిలో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది.
 
కివి :
 
కివి కూడా నిద్ర పట్టడానికి సహాయ పడుతుంది. కివి పండ్ల లో తక్కువ కేలరీలు మరియు ఎక్కువ పోషకాలు ఉంటాయి. దీనిలో ఫోలేట్ మరియు పొటాషియం తో పాటు ఖనిజాలు కూడా ఉంటాయి. అలానే ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కనుక కివి పండ్లని తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అంతే కాదు నిద్ర నాణ్యతను మెరుగు పరిచే సామర్థ్యం పై అధ్యయనాలు చేసిన ప్రకారం నిద్ర వేళకు ముందు ఈ కివి  పండ్లను తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. నిద్ర సామర్థ్యం బాగా  శాతం మెరుగు పడుతుంది.. అలానే కివి రాత్రి వేళ తీసుకునే వాళ్లలో  నిద్ర సమయం 13 శాతం పెరిగింది. రాత్రి పడుకునే ముందు ఒకటి, రెండు కివి పండ్లు తినడం వల్ల వేగంగా నిద్రపోవడానికి సహాయ పడుతుంది.
 
చెర్రీ జ్యూస్:
 
తియ్యగా ఉండే చెర్రీ పండ్లని సులువుగా తినేయొచ్చు.  చెర్రీ పండ్ల రసం లో కూడా ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. నిద్ర ప్రభావాలకు చెర్రీ జ్యూస్ లో  ఉండే మెలటోనిన్ మంచి పరిష్కారం చూపిస్తుంది. అధ్యయనం ప్రకారం నిద్రలేమి ఉన్నవారు చెర్రీ రసం తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత పెరిగింది. ఈ ఫలితాల ఆధారంగా నిద్రను మెరుగు పరచడం లో, నిద్రలేమి నివారించడం లో ఎంతో మంచి ఫలితాన్ని చూపించింది. కనుక నిద్ర పట్టడం లేదు అని సతమతమయ్యేవారు చెర్రీస్ ని జ్యూస్ చేసుకుని కనుక తాగితే  మంచి ఫలితం కచ్చితం.
 
వాల్ నట్: 
 
వాల్ నట్ వల్ల  కూడా నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. నిద్ర పట్ట లేని వారికి కూడా మంచి ఫలితాన్ని చూపిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వు లకు మంచి మూలం వాల్ నాట్. వీటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మరియు లినోలిక్ ఆమ్లం ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడం లో వాల్నట్ బాగా  సహాయ పడుతుంది.
 
అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే సామర్థ్యం ఈ వాల్ నట్ లో ఉంది. ఇది ఇలా ఉండగా పరిశోధకులు ఈ  వాల్ నట్ ని  తినడం వల్ల నిద్ర నాణ్యత మెరుగు పడుతుందని చెప్పారు.  నిద్రపోయే ముందు కొన్ని వాల్నట్లు తినడం వల్ల నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళకి మంచి ఫలితం చూపిస్తుంది అని చెప్పడం జరిగింది. మరి ఇక ఈ సమస్యల నుండి దూరం అవ్వండి. ఆరోగ్యంగా ఉండండి.