BREAKING NEWS

చలికాలంలో సులువుగా ఈ సూప్స్ చేసేసుకోండి.!

మామూలు సీజన్ లో కంటే చలి కాలంలో సూప్ ని  చేసుకుని తాగితే చాలా బాగుంటుంది. అంతే కాదు మంచి రిలీఫ్ గా కూడా ఉంటుంది. అలానే జలుబు, దగ్గు వంటి వాటిని ఎదుర్కోవడానికి సూప్  చాలా మంచి ఆప్షన్ అని మనం చెప్పవచ్చు. కేవలం రుచి మాత్రమే కాదు అందులో  న్యూట్రిఎంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ చలి కాలంలో అన్నం తినకపోయినా వేడి వేడి సూప్ ఉంటే చాలు అనిపిస్తుంది. దీని వల్ల ఏమీ తినాలని కూడా అనిపించదు.

కానీ చలి కాలంలో వేడివేడిగా సూప్ ని కనుక  చూసుకుంటే ఆ ఆనందమే వేరు అని మనము చెప్పొచ్చు. అలాగే రాత్రి డిన్నర్ కి ముందు సూప్ తీసుకోవడం వల్ల పొట్ట కూడా క్లీన్ అవుతుంది. కాబట్టి సూప్ ని చేసుకోవడం మంచిది. అంతే కాదు సూప్ ని చెయ్యడం కూడా పెద్ద కష్టం ఏమి కాదు. చాల సులువుగా, తక్కువ టైం లోనే మనం సూప్ ని యిట్టె చేసేసుకోవచ్చు. ఒక వేళ ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మనం వాళ్లకి ఇచ్చేయచ్చు. 
 
మామూలుగా సూప్ లో కాయగూరలు నుండి ఏమైనా వేసుకోవచ్చు. అలానే నచ్చిన స్పైసెస్ తో కూడా చేసుకోవచ్చు. టమాటా, సొరకాయ, కొత్తిమీర, క్యారట్ ఇలా వేటితో అయినా సూప్ ని చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా సొరకాయ సూప్ చేయడం ఎలానో ఇప్పుడే చూసేయండి. సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. నిజానికి సొరకాయ హెల్తీ వెజిటేబుల్స్ లో ఒకటి అని మనం చెప్పవచ్చు. ఇందులో సుమారు 92 శాతం నీరే ఉంటుంది. ఇందులో ఇంకా విటమిన్స్, మినరల్స్ మరియు ఫైబర్ కూడా ఉంటాయి.
 
 
ఆరోగ్యానికి  సొరకాయ నంబర్ వన్. అంతేకాదు చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించే గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుతుంది. అలానే బరువు తగ్గాలనుకునే వారు సొరకాయ తీసుకోవచ్చు. దీని వల్ల చాలా మేలు కలుగుతుంది. నిజానికి 100 గ్రాములు సొరకాయలో కేవలం 15 కేలరీలు మాత్రమే ఉంటాయి. అలానే ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. కనుక వెయిట్ లాస్ డైట్ గురించి న్యూట్రీషన్లు సొరకాయ తీసుకోమంటారు.
 
టమాటోలో కూడా క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి. వంద గ్రాముల టమాటా లో కేవలం 18 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అరుగుదలకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. కొవ్వును కరిగించడంలో కూడా సహాయ పడుతుంది. టమాటా లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కె, బీటా కెరోటిన్, పొటాషియం ఉండడం వల్ల సూపర్ ఫుడ్ కేటగిరి లో చేర్చారు. కాబట్టి సులువుగా తయారు చేసిన సూప్ ని చూసి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. దీనికంటే ముందు సూప్స్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి.
 
సూప్ తో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ మనం చేయవచ్చు. కాబట్టి నచ్చిన కూరగాయలు వాటిలో వేసుకుంటే ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. కూరగాయలు, మీట్, స్పైస్ ఇలా అన్నీ కలిపి కూడా ఒక మంచి హెల్త్ రెసిపీని  తీసుకుని తయారు చేసుకోవచ్చు. అలానే సూప్ లో ఉన్న లిక్విడ్ వల్ల చాలా సేపు హైడ్రేటెడ్ గా ఉండడమే కాకుండా కడుపు నిండుగా కూడా అనిపిస్తుంది. అంతే కాదు క్యాలరీలు కూడా ఎక్కువ ఉండవు. సూప్ లో  మీకు నచ్చిన స్పైస్ హ్యాపీ గా వేసుకోవచ్చు. మిరియాలు, దాల్చిన చెక్క వంటివి వేసుకుని సూప్ తయారు చేయడం వల్ల మెటబాలిజం నీ బూస్ట్ చేసి బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. 
 
సొరకాయ సూప్ :
 
సొరకాయ సూప్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు :
 
5 కప్పులు సొరకాయ ముక్కలు 
సగం చేసిన టమాటాలు 
రెండు ఉల్లిపాయలు 
రెండు క్యాప్సికమ్ 
ఆలివ్ ఆయిల్ టేబుల్ స్పూన్ 
జీలకర్ర
పింక్ సాల్ట్ తగినంత 
మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ 
 
తయారు చేసుకునే విధానం:
 
ముందుగా సొరకాయ, టమాటో, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ప్రెషర్ కుక్కర్ లో  వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆ తర్వాత ఆ ముక్కలను తీసి బ్లెండర్ లో వేసి స్మూత్ క్రీమ్ పేస్ట్ లా తయారు చేయండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిలో ఆలివ్ ఆయిల్ లేదా వెజిటేబుల్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి వేయించాలి. బటర్ ఇష్టపడే వాళ్ళు ఆయిల్ కి బదులుగా బటర్ ని కూడా వేసుకోవచ్చు. ఇందులో సొరకాయ పేస్ట్ వేసి రెండు నిముషాలు ఉంచాలి. తరువాత ఉప్పు, మిరియాల పొడి వేసి వేడిగా తీసుకోండి. రుచి తో పాటు ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే చలి కాలం లో  చేసుకుని తీసుకునే మంచి రెసిపీ ఇది. మరి ఆలస్యం ఎందుకు ఈ రెసిపీ ఇంట్లోనే చేసేయండి.