BREAKING NEWS

తుంగభద్ర నది పుష్కరాలకు వెళ్లాలనుకునే వారు వీటిని తప్పక తెలుసుకోండి..!

పుష్కరాలు వస్తే దూర దూర ప్రాంతాల నుంచి భక్తులు వెళ్లి ఈ పుష్కరాలలో పాల్గొంటారు. మొత్తం అన్ని ఘాట్లలో కూడా జనం రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో కూడా  ఈ పుష్కరాలకి వస్తూ ఉంటారు. అయితే పుష్కరాలు అంటే ఏమిటి..?,  ఎప్పుడు వస్తాయి?,  ఎందుకొస్తాయి..?  ఇలా అనేక విషయాలు ఇప్పుడు మీరు తెలుసుకోండి. ఇప్పుడు తుంగభద్ర నది పుష్కరాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసినదే. తుంగభద్ర పుష్కరిణి విశిష్టత ఏమిటి..?  ఎప్పుడు జరుగుతాయి..? ఎందుకు జరుగుతాయి..?  ఇలా ప్రతిదీ ఇక్కడ తెలుసుకోండి.
 
తుంగభద్ర పుష్కరాలు మన తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నాయి. పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు నవంబర్ 20 మధ్యాహ్నం 1:25 నిమిషాలకు పుష్కరుడు నదిలో ప్రవేశించిన పిదప పుణ్య గడియలు మొదలయ్యాయని పండితులు చెప్పారు.
 
పుష్కరం అంటే ఏమిటి..? 
 
పన్నెండేళ్లకి ఒకసారి వచ్చేదే పుష్కరం. పవిత్ర తుంగభద్రా నదికి పుష్కరాలు శ్రీ శార్వరి నామ సంవత్సరంలో జరగనున్నాయి. 2008వ సంవత్సరంలో ఈ నది పుష్కరాలు జరిగాయి. మళ్లీ 12 సంవత్సరాల తర్వాత అంటే.. 2020లో ఇప్పుడు జరుగుతున్నాయి. నవంబర్ 20 నుండి డిసెంబర్ 1 వరకు ఈ తుంగభద్ర పుష్కరాలు జరుగుతాయి.
 
 పుష్కరాలు ఎప్పుడు వస్తాయి..? 
 
పుష్కరాలు ఎప్పుడు వస్తాయి అనే విషయానికి వస్తే ఒక్కొక్క రాశిలో గురువు ప్రవేశించినప్పుడు ప్రతి నదికి  పుష్కరాలు జరుగుతాయి. అందుకే 12 నదులను పుష్కర నదులని, 12 రోజుల పాటు జరిగే ప్రక్రియను పుష్కరాలని జరుపుకుంటారు. నవగ్రహాలలో ఒకటైన గురుగ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో తిరుగుతూ ఉంటుంది. అయితే చాంద్రమానం ప్రకారం ఏమిటంటే నక్షత్రాలు ఇరవై ఏడు అన్న సంగతి మనకు తెలుసు. తొమ్మిది పాదాలు కలిసి ఒక రాశి ఏర్పడతాయి. గురువు మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి పుష్కరాలు వస్తాయి. అయితే ఈ పుష్కరాల సమయంలో ఏం జరుగుతుందంటే..?  బ్రహ్మ బృహస్పతి పుష్కరుడు నది  దేవతలతో పాటు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి. ఇందు మూలంగా ఇక్కడ శాస్త్రీయంగా కూడా పుష్కర జలానికి శక్తి ఉంటుంది అని భక్తుల నమ్మకం.
  
పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు:
 
పుష్కరాల కోసం శుక్రవారం ఉదయం సీఎం జగన్ గన్నవరం నుంచి విమానాశ్రయం నుంచి ఓర్వకల్ కి చేరుకున్నారు. అక్కడ నుంచి కర్నూల్ ఏపీ ఎస్సీ గ్రౌండ్ కు హెలికాప్టర్లో వెళ్లారు. ఆ తరువాత అక్కడ నుంచి కారు లో  తుంగభద్ర నది కి వెళ్లారు. పుష్కరాలు ప్రారంభించిన తర్వాత తిరిగి తాడేపల్లి బయలుదేరారు. 12 ఏళ్లకు ఒకసారి 12 రోజుల పాటు జరిగే పుష్కరాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది.
 
అవి ఏమిటి అనే విషయానికి వస్తే... ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పుష్కర స్నానం కి అనుమతి ఇచ్చారు. ఆ సమయం దాటితే పుష్కర ఘాట్ లోకి అడుగు పెట్టడానికి వీలు లేదు. పదేళ్ల లోపు పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు పుష్కరాలకు రావద్దని ప్రభుత్వం సూచించింది. 5 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. అలానే  గజ ఈతగాళ్లు కూడా పుష్కర ఘాట్ వద్ద అందుబాటులో ఉంచారు. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.
  
ఆంధ్రప్రదేశ్ లో  తుంగభద్ర పుష్కరాలు:
 
తుంగభద్రా నది ఆంధ్రప్రదేశ్ లో రెండే జిల్లాల గుండా ప్రవహిస్తుంది. కనుక ఈ రెండు జిల్లాల్లోనే తుంగభద్ర తీరాలని ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో 17 ఘాట్లని, మహబూబ్ నగర్  జిల్లాలో ఐదు ఘ్ట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పుష్కర సమయంలో వచ్చే భక్తులకు, యాత్రికులకు సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది. తుంగభద్ర పుష్కరాలు సందర్భంగా కర్నూలు జిల్లా లో లక్షలాది యాత్రికులు వచ్చారు. జిల్లా కేంద్రం లోనే 5 పుష్కర స్నాన ఘాట్లని ఏర్పాటు చేయగా.. తుంగభద్ర హౌస్, సంకల్‌బాగ్‌లలో  5 లక్షల వరకు భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. ఇది ఇలా ఉండగా ప్రముఖ తుంగభద్ర పుష్కర ఘాట్లు విషయానికి వస్తే..  కర్నూలు,  మంత్రాలయం, అలంపూర్, వేణి సోంపూర్,  సంగమేశ్వరం,  కౌతాలం, గురజాల, పుల్లికల్, రాజోలి, నాగలదిన్నె ప్రముఖ తుంగభద్ర పుష్కర ఘాట్లు. 
 
 
వేణిసోంపురం ఘాట్‌,రాజోళి ఘాట్‌,పుల్లూరు ఘాట్‌,అలంపూర్‌ ఘాట్‌లను భక్తులను సందర్శించవచ్చు. ఇక్కడ కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే భక్తులను అనుమతిస్తారు. కరోనా నెగటి‌వ్‌ రిపోర్టు తో వచ్చిన వారికే పుష్కర ఘాట్‌ లోకి అనుమతి ఉంటుంది. టెస్టు రిపోర్టు లేకుండా వచ్చే వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ అనంతరం అనుమతి ఇవ్వనున్నారు. అలానే నదీ స్నానానికి అనుమతి ఇచ్చినా కోవిడ్ 19 రీత్యా అందుకు దూరంగా ఉండటమే శ్రేయస్కరమని అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి వీటిని తప్పక పాటించడం ఎంతో ముఖ్యం.