BREAKING NEWS

రాహుల్ గాంధీ మోడీ ని ఆత్మ రక్షణలో పడేశారా?


గడిచిన నాలుగు సంవత్సరాలలో రాహుల్ గాంధీ హవా ఎక్కడ కనపడలేదు, మోడీ అమిత్ షా దాటికి రాహుల్, కాంగ్రెస్ పార్టీ విలవిలాడిపోయింది, మళ్ళి  పుంజుకునే పరిస్థితి కనపడలేదు, రాహుల్ కి నాయకత్వ లక్షణాలు లేవు అని అన్ని వైపుల నుండి చాలా విమర్శలు వొచ్చాయి, అతను రాజకీయాలలో ఒక పప్పు అని ప్రత్యర్థులు దుమ్మెత్తి పోసిన వాటిన్నిటిని దాటుకొని  మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పుంజుకోవడం మాములు విషయం కాదు.

మరి లోకసభ ఎన్నికలలో రాహుల్ ఎలాంటి పరిణతి చూపిస్తారో వేచి చూడాల్సి ఉంది. మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధించడం వల్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో ఆత్మ విశ్వాసం నెలకొనింది. ఇదే ఆత్మవిశ్వాసం తో వొచ్చే ఎన్నికలలో కూడా గెలవాలని కాంగ్రెస్ తాపత్రేయ పడుతుంది. అయితే పైకి గంభీరంగా కన్పిస్తున్న దెబ్బ తిన పులిలో మోడీ అండ్ కో కాంగ్రెస్ మీద దాడికి కి సిద్ధంగా ఉన్నాయి. అయితే రాజకీయ అరణ్య యుద్ధం లోకి ఒకసారి దిగిన తరువాత వెన్నక్కి తిరిగే పరిస్థితి ఉండదు కాబట్టి మిత్రపక్షాలతో కలిసి బీజేపీ మీద దాడి చెయ్యాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తుంది.

ఇది మోడీకి, భారతీయ జనతా పార్టీ కి ప్రజలు ఇచ్చిని ముందస్తు హెచ్చరిక  ఇప్పటి నుండి అయినా ప్రజలకు మేలు చేసే సంస్కరణలు చేసి, చేసిన తప్పిదాలను సరిద్దిదుకుంటే మోడీ అండ్ కో మిగిలిన రాష్ట్రాల విశ్వాసం నెలకొలిపితే వొచ్చే ఎన్నికలలో గెలిచే అవకాశాలు ఉంటాయి ఆలా కాకుండా అవే తప్పులు పునరావృతం అయితే ప్రజలు బిజెపి ఓడించడం తథ్యం.