BREAKING NEWS

అందరి చూపు బాలకృష్ణ వైపే


తెలంగాణ రాష్ట్రం లో  టీడీపీ తరుపున ఎన్నికల ప్రచారానికి అన్ని విధాలుగా నటసింహ బాలకృష్ణ అన్ని విధాలుగా సందిగ్ధమయ్యారు. ఒక వైపు తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తూనే వీలు చిక్కినప్పుడు తన సమయాన్ని రాజకీయాలకు వెచ్చిస్తున్నారు. ఇటీవల టీడీపీ సభ్యుల తరుపున ఖమ్మం జిల్లాలో ప్రచారం చేసారు. ప్రజల నుండి మంచి స్పందన వస్తుండటం తో తెలుగు దేశం పెద్దలు బాలకృష్ణ చేత మరికొన్ని ప్రాంతాలలో ప్రచారం చెయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇందులో భాగంగానే తెలంగాణ లో టీడీపీ సభ్యులు పోటీ చేసే నియోజక వర్గం లో ప్రచారం చేయాలనీ ఇప్పటికే నివేదికను సమర్పించారని తెలిసిందే. అయితే ఇప్పడు దానికి సంబంధించి షెడ్యూల్ ని కూడ ఖరారు చేసారు. తెలంగాణ ప్రాంతం లో ఎన్నికలు ప్రచారానికి ఐదు రోజులు పర్యటన చేయబోతున్నారు. మరి ముఖ్యంగా తన అన్న కూతురు సుహాసిని కూకట్‌పల్లి నియోజకవర్గం లో ఎక్కువ ద్రుష్టి పెట్టినట్టు తెల్సింది, శుక్రవారం నాడు జరగబోయే పర్యటన లో బాలకృష్ణ ఏం మాట్లాడతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. 

ఇదిలా ఉండగా తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిర్ ఎన్నికలు ప్రచారం లో భాగంగా  ఈ రోజు కూకట్‌పల్లి నియోజకవర్గం లో పర్యటించారు, ఈ సందర్భంగా కేటిర్ మాట్లాడుతూ, " నందమూరి కుటుంబం పై చంద్రబాబుకు ఉన్నది కపట ప్రేమని, బాబుకి రాజ్యాంగం పై కానీ రాజకీయాలు పై విలువ లేదని, ఎన్నికలో పోటీచేయకుండానే తన కొడుకుని పంచాయితీ రాజ్ మంత్రిని చేసాడని, ఇప్పుడు అదే విధంగా సెంటిమెంట్ ని వాడుకొని సుహాసిని మంత్రిని చెయ్యాలని చూస్తున్నారని అని ఆరోపించారు. తన రాజకీయ లబ్ది కోసం సుహాసినిని బలి పశువుని చేస్తున్నారని అని చంద్రబాబు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కూకట్ పల్లి నియోజక అభ్యర్థి మాధవరావు తరుపున ప్రచారం లో పాల్గొన్నారు.

మరి కేటిర్ అన్న మాటలకు బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. శుక్రవారం నాడు ప్రచారం ముగియగానే బాలకృష్ణ డిసెంబర్ 1వ శేరిలింగంపల్లి, 2వ తేదీన ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట, 3వ తేదీన మహబూబ్‌నగర్, మక్తల్, 4వ తేదీన రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, సనత్‌నగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. 

Photo Gallery