BREAKING NEWS

ఇలా అయితే కష్టం "అఖిల్"


అఖిల్ అక్కినేని, సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ అక్కినేని హీరో ఇప్పుడు తన ఆశలు అన్ని "మిస్టర్ మజ్ను" పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అయితేనే అఖిల్ కెరీర్ కి కొంచెం హెల్ప్  అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర గనుక అటు ఇటు అయ్యిందంటే అఖిల్ కెరీర్ అంతే అంటున్నారు విశ్లేషకులు. 

అక్కినేని నాగార్జున ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కథలు ఎంపికల విషయంలోనే, ఎగ్జిక్యూషన్ విషయంలోనో ఎక్కడో తేడా కొడ్తూనే ఉంది, వినాయక్, విక్రమ్ కుమార్ వంటి స్టార్ డైరెక్టర్ లు చేతిలో పెట్టినప్పటికీ వారు కూడా అఖిల్ కి విజయాన్ని ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ప్రస్తుతం తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం లో "మిస్టర్ మజ్ను" సినిమా చేస్తున్నాడు.

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నా ఈ చిత్రం భారీగానే అంచనాలు ఉన్నాయి, ప్రస్తుతానికి ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీ గా ఉంది.  నిర్మాతలు ఈ చిత్రాన్ని డిసెంబర్ చివరి వారం లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలయింది. ఇందులో భాగంగానే శాటిలైట్ హక్కులు అమ్ముడు పోయినట్లు సమాచారం, అయితే అఖిల్ చివరి సినిమాలు ఎఫెక్ట్ ఈ చిత్రం బిజినెస్ పై తీవ్రంగా పడినట్టు కనిపిస్తుంది. 

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రొండు సినిమా లు అంతంతమాత్రం ఆడిన సంగతి అందరికి తెలిసిందే. అఖిల్ మార్కెట్ కూడా అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటికీ  దాని ఎఫెక్ట్  "మిస్టర్ మజ్ను" మీద పడింది అని శాటిలైట్ ధరలు చూస్తే అర్ధం అయిపోతుంది.

సాధారణంగా పెద్ద హీరో సినిమా అంటే ఎంత మొత్తం అయినా ఇచ్చి శాటిలైట్ హక్కులని చేజికించుకోవాలని ఛానల్ ఎదురు చూస్తూ ఉంటాయి. అయితే అఖిల్ విషయం లో ఆలా జరగలేదు, "మజ్ను" చిత్రాన్ని జీ తెలుగు ఛానల్ వారు 5 కోట్లు కి దక్కించుకున్నారు, అఖిల్ చివరి చిత్రం "హలో" శాటిలైట్ హక్కులని కూడా అదే ధరకి దక్కించుకోవడం గమనార్హం.  ఈ చిత్ర హక్కులు కోసం పలు చానెల్స్ పోటీ పడినప్పటికీ చివరికి అది జీ తెలుగు చేతిలో పడింది. 

"తొలిప్రేమ" చిత్రం ద్వారా హిట్ ఇచ్చిన వెంకీ ఇప్పుడు అఖిల్ కూడా హిట్ ఇస్తాడా లేక ప్లాప్ ఇస్తాడో చూడాలి. ఇది ఇలాగే కొనసాగితే అఖిల్ కెరీర్ చాలా కష్టం అని అంటున్నారు. 

Photo Gallery