BREAKING NEWS

కళ్యాణ్ రామ్ "118" టీజర్ విడుదల తేదీ ఖరారు


కళ్యాణ్ రామ్,  బాక్స్ - ఆఫీస్ వద్ద సరైన హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. కళ్యాణ్ గత చిత్రాలు ఇజం, నా నువ్వే బాక్స్-ఆఫీస్ వద్ద ఘోరంగా విఫలం అయ్యాయి. అప్పుడెప్పుడో పటాస్ చిత్రం ద్వారా విజయాన్ని కైవసం చేసుకున్న కళ్యాణ్ ఇప్పటి దాకా మళ్ళి సరైన విజయాన్ని చేజిక్కిన్చుకోలేకపొయ్యాడు. తాను ఎప్పుడు చేసే మాస్ కథలను సైతం పక్కన పెట్టి, తన పంధా మార్చుకొని "నా నువ్వే" అనే ప్రేమకథ చిత్రం చేసిన లాభం లేకపోయింది.

ఎన్ని అపజయాలు ఎదురైనా పట్టు వొదలని విక్రమార్కుడిలా కళ్యాణ్ రామ్ సినిమాలు చేస్తున్న ఉన్నాడు. తాను కాజోల్ తో కలిసి నటించిన  చివరి చిత్రం "ఎమ్మెల్యే"(మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి) పర్వాలేదు అనిపించినా ప్రేక్షకులును అక్కట్టుకోవడం లో విఫలం అయ్యింది. కెరీర్ ఆరంభం నుంచి విభిన్న పాత్రలు, కథలు ఎంపిక చేసుకుంటాడు అన్న పేరున్న కళ్యాణ్ రామ్ మరొక్కసారి ఒక సస్పెన్సు ప్రధానాంశంగా సాగే కథాంశం తో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ప్రముఖ ఛాయాగ్రాహ నిపుణుడు కెవి గుహన్ దర్శకత్వ సారధ్యం లో "118" అనే చిత్రం లో నాట్టిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ భాగం పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ చిత్రం లో హీరోయిన్ లు గా అర్జున్ రెడ్డి ఫేమ్ "షాలిని పాండే" మరియు నివేదిత థామస్ లు నట్టించారు. 

విడుదల అయినా పోస్టర్లను బట్టి చూస్తే, ఈ చిత్రం రిచ్ విషుయల్స్ తో తెరక్కేకించినట్టు అర్ధం అవుతుంది. ఈ చిత్రం లో కళ్యాణ్ రామ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. మహేష్ కోనేరు ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఈ చిత్రం యొక్క టీజర్ ని డిసెంబర్ 18వ తారీకు ఉదయం 10:30 నిముషాలకు విడుదల చేయనున్నట్టు ఈ చిత్ర బృందం ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర బాణీలను అందిస్తుండాగా, జనవరి 2019 చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.