BREAKING NEWS

తెలివిగా తప్పించుకున్న పవన్ కళ్యాణ్..?


జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ ని రొండు తెలుగు రాష్ట్రాలలో బలోపేతం చేసేందుకు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. క్రింద స్థాయి కార్యకర్తలు నుండి పార్టీ లో ప్రముఖ నాయకులు వరుకు ప్రతి ఒక్కరి తో కులంకుషంగా చర్చించి ఆయా నియోజకవర్గాలలో ఉన్న లోపాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తూ ప్రజలలో పార్టీ ని చాలా బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ అంటే ప్రజలలో తమ సమస్యలు తీర్చే పార్టీ గా వర్ణిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చెప్పుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వరకు పరిస్థితి బాగానే ఉన్న, తెలంగాణ లో జనసేన పరిస్థితి ఏంటా అన్నది ప్రస్నార్ధకరంగా మారింది. 

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజా పోరాట యాత్ర అని పెట్టి ప్రతి ఊరిలో సమస్యలు తెలుసుకుంటున్న పవన్ కళ్యాణ్, తెలంగాణలో మాత్రం ఇంతవరకు అలంటి కార్యాచరణ చేప్పట్టకపోవడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు కెసిఆర్. తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు రావడం లో జనసేన పార్టీ ఈ ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని చెప్పి ఇంకో షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. వాస్తవానికి చాలా మంది రాజకీయ విశ్లేషకులు, నిపుణులు, ప్రత్యర్ధ పార్టీ లో అందరూ జనసేన పార్టీ  తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తారని ఆశించింది అయితే జనసేన పోటీ చెయ్యకపోవడం తో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ స్థాపించి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరుకు పోటీ చెయ్యకపోవడం పవన్ కళ్యాణ్ అసమర్ధతకు నిలువెత్తు నిదర్శనం అని ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కెసిఆర్ ని కేటిర్ ని ప్రశంసలుతో ముంచెత్తారు తెలంగాణ అభివృద్ధి కి మీరు ఎంతో కృషి చేస్తున్నారని మరి ముఖ్యంగా రైతులుకి 24 గంటలు విద్యుత్ ఇవ్వడం ఎంతో ప్రశంసనీయం అని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ప్రత్యర్థులు పవన్ రహస్యంగా తెరాస పార్టీ తో కెసిఆర్ తో కుమ్మక్కు అయ్యారని, అందుకే పిరికి వ్యక్తిలా పోటీ చెయ్యకుండా పారిపోయారు అని విమర్శించారు. 

ఎన్నికలు ముందు పరిస్థితులు ఎలా ఉన్న, తరువాత మాత్రం సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ నేతృత్వం లో ఏర్పాటు అయినా ప్రజకూటమి కూకటి వేళ్ళ తో సహా పెకలించుకుపోయింది. ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ హేమాహేమాలు అతి గోరంగా ఓడిపోయారు. నాలుగు పార్టీ లు కలిసి కెసిఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అనే ప్రయత్నం బెడిసికొట్టింది. కాంగ్రెస్ లీడర్లు రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి, విహెచ్ ఇలాంటి ప్రముఖ నాయకులు ఓడిపోవడం ఎవ్వరికీ మింగుడు పడటం లేదు అయితే తెలంగాణ నాయకులూ మాత్రం ఇది కాంగ్రెస్, టీడీపీ నాయకులుకు ఒక మంచి గుణపాఠం అని తెలంగాణ ప్రజలలో తెలంగాణ నాయకులు మీద ఎంత విశ్వాసం ఉందొ ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. 30 నుండి 40 సంవత్సరాలు రాజకీయ అనుభవమున్న నాయకులు కూడా చిత్తుగా ఓడిపోయిన పరిస్థితుల్లో ఒక వేళా జనసేన పోటీ చేసి ఉంటె పరిస్థితి ఏంటా అని ఇప్పడు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక వేళా జనసేన పోటీ చేసి ఉంటె దాని అంత పెద్ద తప్పిదం ఇంకొకటి ఉండేది కాదని కొంతమంది అంటుంటే, ఇంకొంతమంది కెసిఆర్ తో ఉన్న స్నేహం వల్లే పవన్ కళ్యాణ్ పోటీ చెయ్యలేదని, ఏదో అప్పన్నహస్తం పవన్ కళ్యాణ్ ని పోటీ చెయ్యకుండా చేసి చాలా మంచి పని చేసిందని లేదంటే పవన్ కళ్యాణ్ కి ఘోర పరాభవం ఎదురయ్యేదని అని అంటున్నారు. తెలంగాణ ఎన్నికలలో పోటీ చెయ్యకుండా పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా తప్పించుకొని చాలా మంచి పని చేసారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.