BREAKING NEWS

ఎన్టీఆర్ ట్రైలర్, ఆడియో తేదీలు ఖరారు

నటసింహ నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తూన్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్, ఒక పక్క ప్రజకూటమి ఓటమితో నిరాశగా ఉన్న టిడిపి శ్రేణులకు, నందమూరి అభిమానులకు ఇది కొంచెం ఊరట కలిగించే విషయం. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో ఈ చిత్రం యెక్క అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ లు ద్వారా, సింగిల్స్ ద్వారా ప్రేక్షకులలో అంచనాలు రేటింపు చేసాయి. విడుదుల చేసిన వివిధ పోస్టర్లు లో బాలకృష్ణ ఎన్టీఆర్ ని తలపించే లాగ ఉండటంతో నందమూరి అభిమానులు ఈ చిత్ర విడుదల కోసం వేచిచూస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం ప్యాచ్ వర్క్ మినహాయిస్తే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా విడుదల అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇప్పటికే రొండు పాటలను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా ఆడియో లాంచ్ ట్రైలర్ రిలీజ్ తేదీలను ప్రకటించింది. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ని డిసెంబర్ 16 హైదరాబాద్ లో, ఆడియో లాంచ్ ఈవెంట్ డిసెంబర్ 21 న నందమూరి తారకరామారావు జన్మస్థలమైన నిమ్మకూరులో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎక్కడ నిర్వహించబోతున్నారు, తదితర విషయాలు గురించి చిత్ర బృందం త్వరలో తెలియజేయనుంది.

ఈ చిత్రాన్ని రొండు విభాగాలుగు విడుదల చేయబోతున్నారు, మొదటి భాగానికి "ఎన్టీఆర్ కథానాయకుడు" అని రొండో భాగానికి "ఎన్టీఆర్ మహానాయకుడు" అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ చిత్రం కోసం బాలకృష్ణ ఆహార్యాన్ని మలిచిన తీరు అందరి చేత ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం లో కళ్యాణ్ రామ్, విద్యాబాలన్, రకుల్ ప్రీత్, రానా దగ్గుబాటి, సుమంత్, కైకాల సత్యనారాయణ కీలక  పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏం ఏం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తుండగా, జ్ఞాన శేఖర్ ఛాయా గ్రాహకుడిగా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలకృష్ణ, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.   

Photo Gallery