BREAKING NEWS

జనసేన వైపు మొగ్గు చూపుతున్న వైసీపీ, బీజేపీ నాయకులు


రాజకీయాలలో జంపింగులు కొత్తేమి కాదు, ఒక పార్టీ కండువా పుచ్చుకున్న కొద్ది నెలలకే ఇంకో పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంఘటనలు ఎన్నో చూసాం. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు ఇంకా 150 రోజులే ఉండటంతో , ఇప్పుడున్న పార్టీ లో ప్రాధాన్యత దక్కని వాళ్లు వేరే పార్టీ లోకి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. రానున్న ఎన్నికలలో బలమైన ప్రభావం చూపే నాయకుల దగ్గర పని చెయ్యడం ఉత్తమం అని, ఆ పార్టీ లో చేరడం తమకి మేలు చేస్తుందని అసంతృప్తి నాయకులు ఆలోచనలో పడ్డారు.

తెలంగాణ ఎన్నికలలో ఏ మాత్రం ప్రభావం చూపలేని బీజేపీ పార్టీ, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇస్తామని నమ్మబలికి ఏపీ ప్రజలను మోసం చేసిన బీజేపీ అండ్ కో పైన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు. ఏపీ లో బీజేపీ కి ప్రజల నుండి అంత ఆదరణ లభించడం లేదు అని గ్రహించిన కొంతమంది బీజేపీ నాయకులు పార్టీ మారాలన్న ఆలోచనలో పడ్డారు. అయితే బీజేపీ లోని కొంతమంది నాయకులు ఇప్పటికి పవన్ కళ్యాణ్ తో సత్సంబాలు ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ కండువా పుచ్చుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. బీజేపీ పార్టీ లో ఉంటె తమకి భవిష్యత్తు ఉండదని ముందే గ్రహించిన అసమ్మతి నాయకులు ఇప్పటి నుండే రాజకీయ భవిష్యత్తుని  సరి చేసుకునే పనిలో పడ్డారు. పార్టీ మారడానికి ఇంతకంటే మంచి సమయం ఉండదన్న రీతిలో ఆలోచిస్తున్నారు. గుంటూరు, విజయనగరం, రాజమహేంద్రవరం కి చెందిన కొంతమంది బీజేపీ ప్రజాప్రతినిధిలు ఇంకొక కొద్ది రోజులో జనసేన పార్టీ లో చేరుతున్నట్టు సమాచారం. జనసేన పార్టీ నుండి టికెట్ ఖచ్చితంగా ఇవ్వాలని ఇప్పటికే ఆ పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. అలాగే గన్నవరం, త్రెలప్రోలు, పెదపురం నియోజకవర్గాలు నుండి బీజేపీకి చెందిన నాయకులు ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో మంతనాలు జరిపినట్టు, జనసేన పార్టీ వారికి టికెట్ ఇవ్వడానికి సుమఖంగానే ఉన్నట్టు సమాచారం. 

వైస్సార్సీపీ లో పార్టీ టికెట్ కోసం ఎంతగానో ఎదురు చూసి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి చివరికి టిక్కెటు దక్కకపోగా జగన్ ద్వారా తీవ్ర అవమానాలు ఎదురుకొని చివరికి జనసేన పార్టీ లో మొట్టమొదట బీఫామ్ అందుకోబోతున్న నాయకుడు పితాని బాలకృష్ణ గురించి అందరికి తెలిసిన విషయమే, పితాని లాగానే కొంతమంది వైసీపీ నాయకులు జగన్ పై తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొంతమంది వైసీపీ నాయకులు ఆ నియోజకవర్గాల్లో వైసిపి కి అంత ప్రాధన్యత లేకపోయేసరికి జనసేన పార్టీ లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే  శెట్టిబత్తుల రాజబాబు, మండపేట కోఆర్డినేటర్‌ పదవి నిర్వహించిన వేగుళ్ల లీలాకృష్ణ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్‌., మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ,  ఇలా కొంత మంది నేతలు వైస్సార్సీపీని వీడి జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు పై తీవ్రమైన విమర్శలు చేసిన జగన్ పై ఆ నియోజకవర్గాలలో కార్యకర్తలు ఎక్కువశాతం పవన్ కళ్యాణ్ అభిమానాలు అయ్యి ఉండటం తో జగన్ పై తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు. పార్టీలను వీడి వస్తున్న నాయకులపై జనసేన పార్టీ సానుకూలంగా స్పందిస్తూ పార్టీలో చేర్చుకుంటూ పార్టీ ని బలోపేతం చేసే పని లో ఉంది.