BREAKING NEWS

బీజేపీ - లక్ష్మీస్ ఎన్టీఆర్ - చంద్రబాబు  - ఎన్నికల  కమిషన్

వివాదాలతో ఎప్పుడు సహవాసం చేసే దర్శకుడు రాంగోపాల్ వర్మ  "లక్ష్మీస్ ఎన్టీఆర్ " చిత్రం లోని "వెన్నుపోటు" పాటను విడుదల చేసి పెద్ద దూమారం లేపుతున్నాడు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వర్మ మీద మూకు ముడి దాడి చేస్తున్నారు. కొంతమంది పోలీస్ స్టేషన్ లో వర్మ మీద కంప్లైంట్ లు ఇస్తుంటే, ఇంకొంతమంది వర్మకి టీవీ ఇంటర్వ్యూలో వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఇవ్వన్ని వర్మ ఖాతరు చేయన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వర్మ "లక్ష్మీస్ ఎన్టీఆర్" ని ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తుంది.

ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో రిలీజ్ సందర్భంగా వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక వీడియో ని విడుదల చేసి అది నేను చేసింది కాదని ఇంకెవరో చేసారని చెప్పాడు. ఆ వీడియో సారాంశం ఏంటంటే, " ఒరేయ్ వర్మ నా సినిమా లో విద్య బాలన్ ఉంది, రకుల్ ప్రీత్, హన్సిక, పాయల్ రాజపుట్ ఉంది మరి నీ సినిమా లో ఎవరు ఉన్నారా అని బాలకృష్ణ మిమిక్ గొంతు తో ఒక బైట్ ని విడుదల చేసిన సంగతి విదితమే. నా సినిమా లో నిజం ఉందని బాలకృష్ణ సినిమా లో ఏమి లేదని వర్మ తెలిపారు. ఇదిలా ఉండగా వర్మ పై బాలకృష్ణ చట్టపరమైన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు అయితే  చంద్రబాబు బాలకృష్ణ ని సహనం వహించవలసిందిగా  కోరారు అని సమాచారం. ఇదిలా ఉండగా ప్రముఖ దర్శక, నిర్మాత కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు వర్మ బీజేపీ, వైస్సార్సీపీ అండ చూసుకొనే రెచ్చిపోతున్నారని, రానున్న ఎన్నికలలో చంద్రబాబు నాయుడిని ఓడించేందుకే బీజేపీ దగ్గర ఉండి సినిమా తీయిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రం తెలుగు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉందని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తలుచుకుంటే లా అండ్ ఆర్డర్ దృష్ట్యా ఈ చిత్రం యొక్క విడుదలను రద్దు చేయచ్చు అని, గతం లో కూడా తమిళనాడు లో విశ్వాసరూపం చిత్రం మాత కల్లోలాని రెచ్చకొట్టేవిధంగా ఉందని ఆ నాటి ముఖ్యమంత్రి జయలలిత చిత్ర విడుదలని అడ్డుకున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి "లక్ష్మీస్ ఎన్టీఆర్" కు ఎదురవ్వచ్చు అని తెలిపారు. 

ఎన్టీఆర్ బయోపిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్ కే ఎన్నికల కోడ్ గండం 

జయలలిత రద్దు చేసిన విధంగానే చంద్రబాబు కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలను రద్దు చేసే అధికారం ఉంది. అయితే ఒక వేళా ఎన్నికల కోడ్ ముందుగా వస్తే చంద్రబాబు కి ఆ అధికారం ఉండదు. ఎన్నికల కోడ్ రాకముందు వరకు చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నంత వరకు "లక్ష్మీస్ ఎన్టీఆర్" చిత్రాన్ని విడుదల చెయ్యడానికి ససేమిరా ఒప్పుకోడు. ఇప్పటికే "వెన్నుపోటు" పాట ద్వారా చంద్రబాబు కి అటు సోషల్ మీడియా లోను ఇటు ప్రజలలోను తీవ్రత వ్యతిరేకత ఎదురవుతుంది. ఇది పాత గాయమే అయినప్పటికీ వర్మ దాని మీద కారం జల్లి మరి ఆ గాయాన్ని అందరికి గుర్తు చేస్తున్నాడు. ఎన్నికల కోడ్ రాకముందు "లక్ష్మీస్ ఎన్టీఆర్" విడుదల అయ్యే అవాకాశం లేదు. ఒక వేళ ఎన్నికల కోడ్ అమలు లోకి వస్తే "లక్ష్మిస్ ఎన్టీఆర్" తో పాటు  నటిస్తున్న "మహానాయకుడు" చిత్రం కూడా విడుదలకు నోచుకోకపోవచ్చు. ఎందుకంటే ఈ రొండు చిత్రాలలలోను తెలుగు దేశం పార్టీ జండాలు, నాయకులు పేరులు వాడుతున్నందుకు వీటికి ఎన్నికల కమిషన్ కోడ్ ని దృష్టిలో ఉంచుకొని  అనుమతిని ఇవ్వడానికి నిరాకరిస్తుంది. 

టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త ఏంటంటే ఇంకా "లక్ష్మీస్ ఎన్టీఆర్" చిత్రం షూటింగ్  మొదలే కాలేదని, ఇది కేవలం బీజేపీ, వైస్సార్సీపీ దగ్గర ఉండి చంద్రబాబు ప్రతిష్టని దెబ్బతీసేందుకు వర్మ చేత ఆడిస్తున్న నాటకం అని చెవులు కోరుకుంటున్నారు. సాధారణంగా వర్మ సినిమా షూటింగ్ ఎప్పుడు తీస్తాడు, ఎక్కడ తీస్తాడో, ఎలా తీస్తాడో ఎవరికి తెలియనివ్వడు. సడన్ గా ఇదిగో నా తరువాత సినిమా టీజర్ అంటూ ఒక వీడియో ఒదులుతాడు. అయితే ఈ సారి "వెన్నుపోటు" ని కేవలం చంద్రబాబు ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫోటో లోతో సరిపెట్టడం చూస్తే వర్మ అసలు చిత్రం షూటింగ్ మొదలు పెట్టాడా అన్న అనుమానం రాక మానదు. తన సినిమాకి ఎలా పబ్లిసిటీ తెచ్చుకోవాలి బాగా తెలిసిన వర్మ తాను అనుకున్నది ఇప్పటికే సాధించాడు "ఎన్టీఆర్ బయోపిక్" మీద కంటే "లక్ష్మీస్ ఎన్టీఆర్" వైపే అందరూ మొగ్గు చూపుతున్నారు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ఆంధ్ర ప్రదేశ్ లో విడుదల చెయ్యినివ్వం అనే విషయానికి రియాక్ట్ అవుతూ, " ఒక వేళ ఏపీ లో విడుదల చెయ్యనివ్వకపోతే ఆన్లైన్ లో రిలీజ్ చేస్తా" అని అందరిని ఆశ్యర్యపరిచాడు. ఏది ఏమైనా "లక్ష్మీస్ ఎన్టీఆర్" చూట్టు బీజేపీ, వైస్సార్సీపీ పార్టీ లు ఉన్నాయని సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం జరుగుతుంది.