BREAKING NEWS

రాజకీయాలలోకి డబ్బు సంపాదించడానికే పవన్ కళ్యాణ్ : కత్తి మహేష్



ఆ మధ్య కాలం లో రాముడు పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మహేష్ కత్తి నగర బహిష్కారణకు గురి అయినా విషయం అందరికి తెలిసిందే. గత కొద్ది కలం మౌనం వహించిన మహేష్ కత్తి తన ఉనికిని కోల్పోతున్నాడు అనుకున్నాడో ఏమో మళ్ళి తన విమర్శణాస్త్రాలని ఒదిలాడు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ తనని వేదిస్తారని టీవీ ఛానల్ లో చర్చలుకు పాల్గొని తీవ్ర ఆరోపణలు చేస్తూ నిరంతరం వార్తలలో ఉండటానికి ప్రయత్నించే కత్తి మహేష్ మరోసారి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డాడు. 

ఇటీవల జరిగిన బహిరంగ సభలలో  పవన్ కళ్యాణ్ చంద్రబాబు, జగన్ సంపాదనలు గురించి ప్రస్తావిస్తూ, " చంద్రబాబు కి హెరిటేజ్ ఉందని, దాని ద్వారా కోట్లు సంపాదించుకుంటున్నారని, జగన్ కి భారతి సిమెంట్స్ ద్వారా కోట్లు వెనకేసుకుంటున్నారని, తన దగ్గర ఏ వ్యాపారాలు లేవు కనుకే నేను ప్రొడక్షన్ హౌస్ స్థాపించానని నాకు తెలిసిన వ్యాపారం సినిమానే అని వాళ్ళ లాగ అక్రమంగా సంపాదించడం తనకి తెలియదని వ్యాఖ్యానించారు 

అయితే ఈ మాటలకు కత్తి మహేష్ తన పేస్బుక్ అకౌంట్ ద్వారా  స్పందిస్తూ, "  అసలు ఒక సినిమా ద్వారా నీకు 100 కోట్లు ఎలా వస్తాయి..? నీకు కేవలం అజ్ఞాతవాసి ద్వారానే అత్యంత పారితోషకం 25 కోట్లు వొచ్చింది..అది అనధికారంగా,  ఆఫీషియల్ గా నీకు వొచ్చింది 10 కోట్లే, ఈ లెక్కన నువ్వు సంవత్సరానికి 4 సినిమాలు చేస్తే 100 కోట్లు వస్తాయి. జనాలు వింటున్నారు కదా అని లేని లెక్కల్ని ఉన్నట్టు చూపించకు. 2014 టిడిపి బీజేపీ కి మద్దతుగా 4 నెలల ఆర్భాటానికి నీకు ఎంత గిట్టుబాటు అయ్యిందో తెలియదు కానీ, ఒక 100 కోట్లు పైనే అని అంచనా.

కాబట్టి సినిమా లో ఆదాయాన్ని వొదులుకోవడానికి నువ్వు రాలేదు కేవలం డబ్బు సంపాదించడానికి నువ్వు రాజకీయాల్లోకి వోచ్చావ్, మీ అన్న పార్టీ పెట్టి టికెట్లు అమ్ముకొని , దానికి నువ్వు కొనసాగింపు ..! త్యాగాలు, ఆదాయాలు గురించి నువ్వు మాట్లాడకుండా ఉంటే బెటర్ అని కత్తి మహేష్ వ్యాఖ్యానించాడు. అయితే యధావిధంగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ కత్తి మహేష్ పై ఫేస్బుక్ లో విరుచుకు పడుతున్నారు.