భారతీయ అంతరీక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరోసారి చరిత్ర సృష్టించింది. ఇప్పటికే నెల వ్యవధిలో మూడు ప్రయోగాలు చేసిన ఇస్రో, మూడింటిని విజయవంతంగా నింగిలోకి పంపి వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో, ఈ రోజు మరోసారి విజయవంతంగా జీఎస్ఎల్వీ ఎఫ్11.. జీశాట్ 7A నింగిలోకి దూసుకువెళ్ళింది.
కౌంట్ డౌన్ సమయం లో తుఫాన్ ప్రతికూల పరిస్థితులు ఏర్పడచ్చు అని ఆందోళన పడిన ఇస్రో బృందం, లాంచ్ చేసే సమయానికి వాతావరణం అనుకూలించడం తో ఊపిరి పీల్చుకుంది. దీనితో ఎటువంటి ఇబ్బంది లేకుండా జీఎస్ఎల్వీ ఎఫ్11 ద్వారా 2,250 కిలోల జీశాట్ 7ఏ ఉప గ్రహాన్ని సక్సెస్ ఫుల్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే జీశాట్ 7ఏ ఉప గ్రహాన్ని మిలటరీ సేవలు కోసం రూపొందించామని. ఈ ప్రయోగం ద్వారా సమాచార వ్యవస్థ మరింత బలపడుతుందని వెల్లడించారు. అయితే ఇది సుమారు 2250 కిలోలు బరువు ఉన్న ఈ జీశాట్ 7Aను పూర్తి స్వదేశీ పరిజ్ఞానం తో ప్రయోగించబడింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం తో ఇస్రో బృందం సంబరాలు చేసుకుంటుంది. శాటిలైట్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశించింది అనే విషయం తెలియగానే ఇస్రో సెంటర్ హర్ష ద్వానాలతో మారుమోగిపోయింది. సమాచార ఉపగ్రహంలో జీశాట్-7ఏ ముప్పై ఐదవది అవ్వడం విశేషం. 2013లో జీశాట్-7 ప్రయోగించిన విషయం తెలిసిందే అయితే అది ఉపగ్రహం కాలపరిమితి దాటిపోవడంతో దాని స్థానంలో ఈ ఉపగ్రహాన్ని కక్ష్య లోకి ప్రవేశపెట్టార. కొత్తగా ప్రయోగించిన ఈ ఉపగ్రహం 8 సంవత్సరాలు పాటు సేవలను అందించనుంది.
బుధవారం ప్రయోగించిన జీశాట్ 7ఏ ఆధునిక సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేసింది. కేయూ బ్యాండ్ ఫ్రీక్వెన్సీలో భారత భూభాగం పై ఇది పని చేస్తుందని ఇస్రో బృందం తెలిపింది. భూభాగంపై ఉన్న రాడార్లను,ఎయిర్ బేస్‌లను, ఇతర ఇంటెలిజెన్స్ సమాచారం, ఎయిర్ క్రాఫ్ట్‌లను పసిగట్టడంలో జీశాట్ సహాయపడుతుంది. ఈ ఉపగ్రహం ఎయిర్ బేస్ లతో పాటు గ్రౌండ్ రాడార్ వ్యవస్థ, యుద్ధ విమానాల అనుసంధానానికి తోడ్పడుతుంది.
జీశాట్ 7A ఉపగ్రహ ప్రత్యేకతలు
సుదూరా ప్రాంతాలలో ఉన్న ఎయిర్ క్రాఫ్టులు ను పసిగట్టడం లో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది.
జీశాట్ 7A ఎయిర్ ఫోర్స్ సమాచార వ్యవస్థకు ఎంతగానో సహాయపడుతుంది.
ఈ ప్రయోగం ద్వారా భారత సమాచార వ్యవస్థ ఇంకో మెట్టు ఎక్కిందని చెప్పొచ్చు
నింగిలో విమానాల మధ్య సమాచార మార్పిడిని ఇది సులభతరం చేయనుంది.
జీశాట్ 7A 7వ క్రయోజెనిక్ ఇంజిన్ శాస్త్రవేత్తలు ఉపయోగించారు