BREAKING NEWS

వారిని కాల్చి పారేయండి: సీఎం

కొన్ని కొన్ని సార్లు రాజకీయం నాయకులు ఆవేశపూరితమైన వాక్యాలు చేసి వివాదాలలో చిక్కుకుంటారు. ఇప్పుడు అదే పరిస్థితి కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి కి ఎదురైంది. వివరాల్లోకి వెళితే, జేడీఎస్ కు చెందిన ఒక నేతను కొంతమంది వ్యక్తులు చాలా దారుణంగా కత్తులతో హతమార్చారు, ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కుమార స్వామి ఫోన్ లో ఒక పోలీస్ అధికారితో మాట్లాడుతూ, "వారిని కనికరం లేకుండా కాల్చి పారేయండి" అంటూ వివాదాస్పద వాక్యాలు చేశారు. దానికి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియా లో విస్తృతంగా వైరల్ అవుతుంది.

మాండ్య ప్రాంతానికి చెందిన జేడీఎస్ నేతను కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా చంపారు. సోమవారం నాడు ప్రకాష్ గౌడ్ కార్ లో ప్రయాణిస్తుండగా దానిని అడ్డుకొని కత్తులతో నరికి చంపారు. ఈ విషయం తెలుసుకున్న కుమారాస్వామి " అతడు చాలా మంచి వ్యక్తి, అతనిని ఎందుకు చంపారో కారణాలు తెలియదు, చంపినవారు ఎవరైనా సరే జాలి, దయ లేకుండా  నిర్దాక్షణంగా కాల్చి పారేయండి, ఎలాంటి సమస్య ఉండదు" అని కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి ఫోన్ లు మాట్లాడుతూ ఎవరో అధికారికి ఆదేశాలు జారీ చేశారు. అయితే అదే సమయం లో అక్కడే ఉన్న కొంతమంది జర్నలిస్టులు వాటిని రికార్డు చెయ్యడం ద్వారా కుమార స్వామి చిక్కులో పడ్డారు.

కొన్ని స్థానికి మీడియా సంస్థలు కుమార స్వామి సంభాషణలను హైలైట్ చేస్తూ టీవీ లో ప్రసారం చేసింది. దీంతో విషయం అందరికి తెలిసి, వివాదాస్పదంగా మారింది. దీంతో ప్రతిపక్ష పార్టీ లు కుమార స్వామి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒక సీఎం స్థానం లో ఉంది హింసని ప్రేరిపిస్తున్నారని, మనం ప్రజాస్వామ్యం లో ఉన్నామా ఎక్కడ ఉన్నాం అని కుమార స్వామి ని ప్రశ్నించాయి. ఈ వివాదం పై బీజేపీ నేత యడ్యూరప్ప కుమార స్వామి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. అయితే దీనికి కుమార స్వామి స్పందిస్తూ, " తాను హత్య చెయ్యమని ఎవ్వరికీ ఆదేశాలు ఇవ్వలేదని, కేవలం ఆవేశం లో నోరు జారిన మాటలు అని, చంపెయ్యాలన్నది తన ఉద్దేశం కాదని వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన వారు గతం లో కొన్ని హత్యలు చేసి జైలుకు వెళ్లి కొద్ది రోజుల క్రితమే బెయిల్ పై విడుదల అయ్యారని, ఇప్పుడు ఇంకొక వ్యక్తిని చంపేశారని. బెయిల్ ని దుర్వినియోగం చేస్తూ  శాంతి భద్రతలకు వారు భంగం కలిగిస్తున్నారని, అందుకే ఆవేశం లో ఆలా మాట్లాడానని వివరణ ఇచ్చారు.