BREAKING NEWS

మహేష్ బాబు "మహర్షి" కథ ఏంటి..?

మహేష్ బాబు చిత్రం "మహర్షి" ఎప్పుడు విడుదల అవుతుందా అని మహేష్ బాబు అభిమానులు చాలా ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం యొక్క షూటింగ్ 60 శాతం పూర్తి అయ్యిందని, చిత్ర బృందం ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరణలో నిమగ్నం అయ్యి ఉంది. అయితే ఇప్పుడు అటు  సోషల్ మీడియా లోను ఇటు అభిమానులు లోను మహర్షి కథ గురించి చర్చలు జరుగుతున్నాయి. 

ఇప్పటికే ఈ చిత్ర బృందం ఫస్ట్ లుక్ ని టీజర్ ని విడుదల  చేసింది, ఆ ఫస్ట్ లుక్ ని ఆధారం చేసుకొని ఈ చిత్రం యొక్క కథ ఇలా ఉండబోతుంది అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని లీకులు చిత్రబృందాన్ని తీవ్ర కలవరపెడుతున్నాయి. ఇంతకీ ఆ ప్రచారం ఏంటంటే.. అమెరికాలో ఉంది అక్కడే చదువుకొని, పెద్ద బిసినెస్ మ్యాన్ గా ఎదుగుతాడు, తరువాత తన తండ్రితో మనస్పర్థలు ఒచ్చి.. ఒక రోజు తన స్నేహితులతో కలిసి ఇండియా కి వాస్తాడు. ఇండియా కి ఒచ్చిన తరువాత అక్కడ రైతులు పడే కష్టాలను చూసి మహేష్ చలించి, రైతులకు ఆధునిక పద్ధతులు ద్వారా ఎలా ఉపయోగించాలో, వాటి ప్రయోజనాలు ఏంటో వివరించి, యంత్రాలను ఎలా వాడాలో చూపిస్తాడు. పంటలలో నష్టపోయిన రైతులకు అవగాహనా కల్పించి అభివృద్ధి దిశగా నడిపిస్తాడు. 

అయితే మహర్షి కథ ముఖ్యంగా ఇదు అంశాలు చుట్టూ తిరుగుతుందని అవి ప్రేక్షకులని ఆకట్టుకునేవిధంగా దర్శకుడు వంశి పైడిపల్లి రూపొందించారని ప్రచారం జారుగుతుంది. ఆ ఐదు అంశాలే రైతుల సమస్యలు, ప్రేమ, స్నేహం, సహాయం, త్యాగం అనే అంశాలు చూట్టు కథ తిరుగుతుందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో మనసుకు హత్తుకునే ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయని అవి ప్రేక్షకులని కదిలించే విధంగా ఉంటాయని చెప్తున్నారు. 

ఇప్పటికే రైతులు మీద వారి కష్టాలు మీద, గ్రామాల దత్తలు మీద "శ్రీ మంతుడు" లో టచ్ చేసినప్పటికీ, ఈ సారి మహర్షి సినిమాలో కొత్తగా ఏమి చూపిస్తారా..? అన్న సందేహం రాక మానదు. ఎవ్వరికీ తెలియని సమాజం లో కొన్ని అంశాలు లోపాలను ఎత్తి చూపి, వాటికి పరిష్కారం చూపిస్తే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యి అవకాశం ఉంది కానీ, తమిళ్ చిత్రం "కత్తి" లో చూపించిన సమస్యలే చూపిస్తే, ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన ఒచ్చే అవాకాశాలు ఉన్నాయి. అయితే ఈ కథలు సోషల్ మీడియాలో ఒచ్చే రుమోర్స్ కాబట్టి వీటిని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే విడుదల చేసిన టీజర్ ఆధారం చేసుకొని చూస్తే  వ్యవసాయం లో కొత్త పద్ధతులు గురించి రైతులకు అవగాహనా కల్పించే స్టూడెంట్ గా అర్ధం అవుతుంది. ఈ చిత్రం లోని కొన్ని కీలక మైన సన్నివేశాలను డెహ్రాడూన్ లో చిత్రీకరించారు. ఈ చిత్రం యొక్క తరువాత షెడ్యూలు పోలాచ్చి లో వ్యవసాయానికి సంబందించిన సన్నివేశాలను షూట్ చెయ్యబోతున్నారు. పూజ హెగ్డే, సోనాల్ చౌహన్ ఈ చిత్రం లో హీరోయిన్ లు గా నటిస్తున్నారు.