BREAKING NEWS

మోడీ బ్రష్టుపట్టించారు : చంద్రబాబు


తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహావిష్కరణ నిమ్మితం చెన్నై వెళ్లిన సంగతి  విధేతమే, చెన్నై లో నిర్వహించిన సభలో చంద్రబాబు తమిళం లో ప్రసంగిస్తూ కరుణానిధి పై ప్రశంసల వర్షం కురిపించారు. తమిళనాడు ప్రజలకు ఉన్నతమైన  సంస్కరణలు, అద్భుతమైన పధకాలను ప్రవేశపెట్టిన ఎక్కైక రాజకీయనాయకుడు కరుణానిధి అని కొనియాడారు. ఆనాడు యునైటెడ్ ఫ్రంట్ లో కలిసి పని చెయ్యడం తన అదృష్టం అని గుర్తుచేశారు. 

రానున్న ఎన్నికలలో స్టాలిన్ నేతృత్వం లో డిఎంకె పార్టీ ని గెలిపించాలని ప్రజలను కోరారు. తమ ఓట్లతో డీఎంకే ని గెలిపించి రాష్ట్రంలో బిజెపి పతనానికి నాంది కావాలని తమిళనాడు ప్రజలను కోరారు. ఓటమిని దరిచేరనివ్వకుండా  13 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా గొప్ప నాయకుడు కారుణానిధి అని గుర్తుచేసారు. సభ  మొదటి లో డీఎంకే పార్టీ ని పొగడ్తలతో ముంచెత్తిన చంద్రబాబు తరువాత బీజేపీ పై మోడీ పై  తీవ్రమైన విమర్శలు చేసారు. ప్రజలు ఎంతో నమ్మకం తో బీజేపీకి పట్టం కడితే దానిని మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, దేశం లో అన్ని వ్యవస్థలను నాశనం చేసింది అని, వీళ్ళ పని తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలు అవుతున్నారని అన్నారు. వీళ్ళ మాటలు నమ్మి మద్దత్తు ఇస్తే మమ్మల్ని వెన్నుపోటు పొడిచిందని, తామంతా బీజేపీ ప్రభుత్వానికి 2014 ఎన్నికలలో మద్దత్తు పలికి మోసపోయామన్నారు. మోడీ ప్రభుత్వం లో ఫెడరలిజం వ్యవస్థ పూర్తిగా బ్రష్టుపట్టిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ కోరితే దానిని రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.

అధికారం చేతిలో ఉంది అని వారి ఇష్టానుసారాంగా వ్యవహరిస్తున్నారని, సీబీఐ వారిని వారి ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేస్తున్నారు. మేము వారిపై విమర్శలు చేస్తున్నామని మా నాయకులు పై సిబిఐ వారిని పంపించి ఇష్టం ఒచ్చినట్టు చేస్తున్నారని, కానీ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారన్నారు. బీజేపీ అక్రమాలు ఆర్బీఐ కి  కూడా పాకిందని, బీజేపీ దెబ్బకు ఆర్బీఐ గవర్నర్ కూడా రాజీనామా చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజకీయంగా ఎదుర్కునే శక్తీ, సామర్ధ్యం లేక మాపై ఐటి దాడులు నిర్వహిస్తున్నారు అని అయినా మాకు ఏ భయం లేదని మేము ఎలాంటి అవినీతి, అక్రమాలు లేకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామన్నారు.

రాఫెల్ డీల్ లో అనేక అక్రమాలు జరిగిన వారి తప్పుడు ఆధారాలతో సుప్రీమ్ కోర్ట్ ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని చంద్రబాబు విమర్శలు చేసారు. ఎలా చూసిన ఫెడరల్ వ్యవస్థని మోడీ ప్రభుత్వం బ్రష్టుపట్టించింది అన్నారు. ఈ సభలో సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేరళ ముఖ్యమంత్రి విజయన్ కూడా పాల్గొన్నారు. 

 

 

Photo Gallery