BREAKING NEWS

సిటీ ఆఫ్ డెస్టినీ , మన విశాఖ - ఫ్లాష్ బ్యాక్ 2

స్వాతంత్ర్యానికి ముందు విశాఖపట్నం ఎలా ఉండేదో తెలుసుకున్నారు. ఇప్పుడు సుమారు 60 సంవత్సరాలకు ముందు విశాఖ ఎలా ఉండేదో కూడా ఓ లుక్కేయండి.... 

చేపల మార్కెట్

60 ఏళ్ల క్రితం... విశాఖపట్నం అంటే పూర్ణామార్కెట్‌ అవతలే... మెయిన్‌ రోడ్‌ అంతా బంగారం, వస్త్ర దుకాణాలతో నిండిపోయి ఉండేది. ఇప్పుడు ఎవరికి ఏ కూరగాయలు కావాలి అన్నా, ఏ వస్తువునైనా హోల్ సేల్ ధరలకే కొనాలి అన్నా సరే విశాఖ వాసులు ఒకటే మాట... పూర్ణా మార్కెట్.. కానీ అప్పటి  అప్పట్లో పూర్ణామార్కెట్‌ను చేపల బజారుగా వాడుకునేవాళ్లు. కురుపాం మార్కెట్‌ ఒక్కటే కూరగాయల మార్కెట్‌. అప్పట్లో అది ప్రతిష్టాత్మక వ్యాపార కేంద్రం. అక్కడికే వెళ్లి కూరగాయలు తెచ్చుకునేవాళ్లం. ఆ రోజుల్లో “అర్థనా" ఇస్తే కూరగాయలను గుమ్మం 'దగ్గరకు మోసుకు వచ్చేవారు.. ఇప్పుడు అయితే వందల రూపాయలు ఇచ్చిన సరిపోవు... 

ఊళ్లో రైల్వే స్టేషన్‌

అప్పట్లో సిటీ అంటే వన్ టౌన్ ఏరియా మాత్రమే ఉండేది... కానీ ఇప్పుడు సిటీ బాగా డెవలప్ అయిపోయింది. అప్పుడు వన్ టౌన్ దగ్గర 'వైజాగ్‌పట్నం' రైల్వే స్టేషన్‌ ఉండేది. అక్కడి నుంచి వాల్తేరుకు షటిల్‌ ట్రైన్స్‌ ఉండేవి. ఎవరైనా దేవాడ వెళ్లాల్సి వస్తే కొత్తవలస రైల్వే స్టేషన్‌ నుంచి బండి కట్టించుకుని వెళ్లేవాళ్లు.  వైజాగ్‌ సముద్రపు ఒడ్డునే బీచ్‌లో మినర్వా హాల్‌ ఉండేది. ఆ రోజుల్లో దానిని కొత్తగా కట్టారు. దానికి ఎదురుగ్గా రెండు వీధులు ఉండేవి. అవన్నీ బ్రాహ్మణులు ఉండే వీధులు. అందుకే వాటిని కొత్త అగ్రహారం అనేవారు. ఇప్పుడున్నకోటవీధి అక్కడితో అయిపోయేది. జనాభాలో ఎక్కువ భాగం పూర్ణామార్కెట్‌కు ఇటు వైపే ఉండే వారు.

అదో వింత

సుమారు 60 సంవత్సరాల క్రితం ఇంట్లో రేడియో ఉంది అంటే అందరు షాక్ అయ్యేవారు. బీచ్‌ దగ్గర రేడియో ఉండేది. సాయంత్రం అందరూ అక్కడికి చేరి వార్తలు వినేవారు. ప్రముఖ రాజకీయ నాయకుల ప్రసంగాలు కూడా సముద్రపు ఒడ్డునే జరుగుతుండేవి. అప్పట్లో రేడియో ఉంటే చాలా గొప్పవాళ్ల కింద లెక్క... మూడు వీధుల్లో ఒకరికి మాత్రమే రేడియో ఉండేది. ఎవరైనా రేడియో వినాలి అంటే ముందుగా వాళ్లకు 'మేం రేడియో వినడానికి వస్తున్నాం" అని కబురు పెట్టి ఓ గంట విని ఇళ్లకు వచ్చేవాళ్లు. తెలుగుపై లెక్చర్‌ ఇవ్వడానికి నేను 1978లో అమెరికా వెళ్లాను. అక్కడ నుంచి వచ్చేటప్పుడు టీవీ తీసుకెళ్ళమమని చెప్పారు. నేను టీవీ చూడడం అదే మొదటిసారి. అప్పటి వరకు విశాఖలో ఎవరికీ టీవీ తెలియదు. 

మినర్వా టాకీస్‌

1948-48లలో మినర్వా టాకీస్‌ అని నంబర్‌ వన్‌ థియేటర్‌ ఉండేది. ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయింది. చాలా పెడ్ద థియేటర్‌.చాలా రష్‌గాఉండేది. పూర్ణా ధియేటర్‌ కూడా పేరు పడిసదే. లీలా మహల్‌,సరస్వతీ టాకీస్‌ ఇలా మొత్తం ఐదారు హాల్స్‌ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడో.... ఐనక్స్ లు అంటూ అడుగడుగునా థియేటర్లు దర్శనం ఇస్తున్నాయి...

దసపల్ల ఏరియా.

భూముల ధరలు ఆకాశం అంటుతున్నాయి. గజం స్థలం కొనాలి అంటేనే లక్షల్లో మేటర్... అలాంటిది 1000 గజాల స్థలం కేవలం 250 రూపాయలకే ఇవ్వడానికి రెడీ అయ్యారు అప్పట్లో... కానీ కొనుక్కునే వారు ఏరీ???  ఆ హోటల్‌ ఉన్న ప్రాంతం అంతా అప్పట్లో చెవుడు రాణి గారి ఆస్తి. 1000 గజాల స్థలం ఉంది. ఇప్పిస్తాను, తీసుకో... రూ. 250 మాత్రమే' అన్నారు. అంటే గజం పావలా.నాన్నగారీకి ఆసక్తి లేక తీసుకోలేదు...మరి ఇప్పుడో... ధర ఊహించగలమా?”

ఇక ఆర్కే బీచ్ దగ్గర ఉన్న భూమి గురించి వేరే సంగతి.    ఇప్పుడు రామకృష్ణ మిషన్‌ దగ్గర చాలా అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.. కానీ ఇది వరకు ఆ ప్రాంతం అంతా పెద్ద పెద్ద మట్టి దిబ్బలతో ఉండేది. అప్పట్లో అక్కడ ఓ కాంట్రాక్టర్‌ ఉండేవాడు. “గజం కేవలం 18 రూపాయలే... చాలా చౌక... భవిష్యత్తులో చాలా డెవలప్‌ అవుతుంది. కొనుక్కోండి.” అని చాలా బతిమాలేవాడు. మట్టిదిబ్బలు ఎవరు కొంటారులే అని చాలా మంది కొనలేదు. కట్ చేస్తే...  ఇప్పుడు అక్కడ అపార్ట్‌మెంట్‌లను చూస్తే ఈ ప్రాంతం అదేనా అని అశ్చర్యం కలుగుతుంది.

అప్పట్లో విశాఖపట్నం అంటే యల్లమ్మతోట (ఇప్పటి జగదాంబ జంక్షన్‌) వరకు మాత్రమే ఉన్న పెద్ద పల్లెటూరు అంటే నమ్మగలరా??? కానీ ఇది నిజం. అప్పటి ఊరు,మనుషులు, ఆ జీవితం గురించి తలచుకుంటే చిత్రంగా, ఓ కలలా ఉంటుంది. జనాభా వేలలో ఉన్నా, అందరూ ఒకరికొకరు పరిచయం ఉన్నట్టే అనిపించేది. పెద్ద ఊరన్న పేరే కానీ యల్లమ్మతోట తర్వాత ఊరే లేదంటే నమ్ముతారా? టర్నర్‌ చౌల్ట్రీ నుంచి సరన్వతి పార్క్‌ వరకు పది అడుగుల ఎత్తులో గోడ ఉండేది. అప్పట్లో పన్నెండు, పధ్నాలుగేళ్లు వచ్చినా సాయంత్రం ఆరు దాటాక ఆ వైపు వెళ్ళడం నిషిద్ధం. పెద్దవాళ్ల తోడు లేకుండా వెళ్లే పరిస్థితే లేదు. సరన్వతీ టాకీస్‌కో, ప్రభాత్‌ టాకీస్‌కో వెళ్లాలన్నా పెద్దవాళ్లు ఉండాల్సిందే. యల్లమ్మ తోటంటే అడవే. జనాభా అంతా పూర్ణామార్కెట్‌, కురుపాం మార్కెట్‌ , కోట వీధి, వెలంపేట,డాబాగార్జెన్స్‌, అల్లిపురం లోనే ఉండేవారు. తక్కిన ప్రాంతాలన్నీ శివార్లే. సెయింట్‌ ఆంధోనీ స్కూల్, ఆంధ్రా యూనివర్సిటీ అప్పుడూ ఉన్నాయి కానీ ఎడారిలా ఉండేవి... 

రెండే రూట్లు 

అప్పట్లో రెండు పాపులర్‌ బస్‌ రూట్లు ఉండేవి. నంబర్‌ 8 బన్సు సింహాచలం, నంబర్‌ 10 బన్సు యూనివర్శిటీకి . రెండు ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిన్ట్యూట్స్‌, మెంటల్‌ హాస్పిటల్‌ , మెడికల్‌ కాలేజి, కెజీహెచ్‌ ను కవర్‌ చేసేది కాబట్టి 10 బాగా పాపులర్‌ రూట్‌. ఆర్కే బీచ్‌ అంటే ఆ రోజుల్లో ఎడారి లాంటి బీచ్‌. అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. ఫిషింగ్‌ హార్బర్‌ ప్రాంతంలో అప్పట్లో రాత్రయితే దెయ్యాలు తిరుగుతున్నాయనే వాళ్లు. అక్కడ మినర్వా టాకీస్‌ అని ఒకటి ఉండేది.ఆ నీనిమా హాల్‌లో ఇంగ్లిష్‌ సినిమాలు ఎక్కువగా వేసేవాళ్లు. మధ్యాహ్నం మూడు గంటలకు, సాయంత్రం 8 గంటలకు షోలు ఉండేవి. సెకెండ్‌ షో ఊసే లేదు.

నోట్: కొన్ని సందర్భాలలో నాకు ఈ విషయాలు చెప్పిన వ్యక్తి కోణంలో రాయడం జరిగింది. గమనించగలరు...