BREAKING NEWS

మెగా - నందమూరి వార్

ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో జర్నలిస్ట్ ప్రభు బాలకృష్ణ గురించి చెప్పమని మెగా బ్రదర్ నాగ బాబు ని కోరగా, తనకి బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పడంతో సోషల్ మీడియా లో ఇది పెద్ద దూమారం రేపింది. అయితే ఈ విషయం పై ఈ రోజు నాగ బాబు స్పందించారు అతను చెప్పిన కామెంట్స్ పై స్పందించారు. 

అయితే నిన్న అన్న కామెంట్లు ని వెన్నక్కి తీసుకుంటూ ఒక వీడియో బైట్ ని రిలీజ్ చేసారు. తన ఫేస్బుక్ లైవ్ లో ఒక తప్పు జరిగిందని, తాను యూట్యూబ్ గాని, సోషల్ మీడియా లో జరిగేవి కానీ ఎక్కువ చూడను అని, నిన్న నా ఫేస్బుక్ లో కొంతమంది బాలకృష్ణ గారి గురించి మాట్లాడమంటే, బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అన్నాను అని, తర్వాత కొంతమంది ఫీల్ అయ్యినట్టు ఫీడ్ బ్యాక్ వొచ్చిందని, అలా అనడం తప్పు అన్నారని, ఆలా అనడం నిజంగా తన తప్పేనని, బాలకృష్ణ గారు తెలియకుండా ఎవరుంటారు అని అయినా మంచి నటుడు అని, ముఖ్యంగా అతను పెద్ద కమెడియన్ అని, అయిన అంత కామెడీ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని, అందరిని కడుపుబ్బా నవ్విస్తారని అలాంటి అతను గురించి నేను అలా అనడం తన తప్పని అన్నారు. అంతే కాకుండా అతను ఎన్టీఆర్ గారు తో కూడా నటించిన కమెడియన్ అని వల్లూరి బాలకృష్ణ చిత్రం చూపిస్తూ ఈ మాటలు అన్నారు. ఈయన గురించి తెలియన వాళ్ళు ఎవరు ఉండరు అని కావాలంటే వల్లూరి బాలకృష్ణ అని వికీపీడియా లో సెర్చ్ చేస్తే అతని గురించి వస్తుంది అని చెప్పి ముగించారు.

అయితే ఈ రోజు రిలీజ్ చేసిన వీడియో ఇంకా దూమారం రేపుతోంది, ఇది మెగా - నందమూరి వార్ గా కొంతమంది వర్ణిస్తున్నారు. జర్నలిస్ట్ అడిగింది నందమూరి బాలకృష్ణ గురించి అని నాగబాబు ఎవరో పేర్లు చెప్తూ పరోక్షంగా బాలకృష్ణ ని కమెడియన్ అంటున్నారని సోషల్ మీడియా లో నందమూరి అభిమానులు మండిపడుతున్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని బాలకృష్ణ ని కోరగా తనకి పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదని నందమూరి బాలకృష్ణ అన్నారు, దీనికి కౌంటర్ ఇస్తూ నాగబాబు ఇలా మాట్లాడి ఉంటారని మెగా అభిమానులు నాగబాబు కి మద్దత్తు ఇస్తున్నారు. 2014 ఎన్నికలులో టీడీపీ తరుపున ప్రచారం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరో గుర్తురాలేదా అని బాలకృష్ణ ని మెగా అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. నాగబాబు బాలకృష్ణ తెలియదు అంటే మాత్రం దీని పెద్దది చేస్తున్నారని సోషల్ మీడియా లో మెగా - నందమూరి వార్ జరుగుతుంది. అయితే నాగబాబు అన్న మాటలకు నందమూరి క్యాంపు నిశ్శబ్దాన్ని పాటిస్తుంది. ఈ మెగా - నందమూరి గొడవ ఫిలిం ఇండస్ట్రీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరి రొండు అగ్ర కుటుంబాలు మధ్య జరుగుతున్న ఈ గొడవ గురించి "మా" అసోసియేషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరో పక్క రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ కలిసి రాజమౌళి విషయం లో నటిస్తున్న సంగతి తెలిసిందే, ఈ గొడవ ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో వేచి చూడాలి.  

Photo Gallery