BREAKING NEWS

ఫార్మింగ్ - సహజ పరిష్కారం

 వ్యవసాయం.... ఫార్మింగ్.... భాష ఏదైనా భావం ఒక్కటే... మనం ఈ రోజు నగరాల్లో హాయిగా ఉంటున్నాం అంటే పల్లెటూర్లలో రైతులు పడుతున్న కష్టమే... మనం తింటున్న, తినబోయే ప్రతి మెతుకు రైతుల కష్ట ఫలమే.... ఇప్పటి తరానికి పల్లెలు అన్నా, వ్యవసాయం అన్నా పెద్దగా పరిచయం లేదు. మారుతున్న కాలంతో పాటు ఈ తరం యువతలో కూడా మార్పులు వస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పటికీ మార్పు రానిది, రాలేనిది " పల్లెలు దేశానికి వెన్నుముక లాంటిది"... ఈ మాటను మనం ఎప్పుడూ వింటూ, చదువుతూనే ఉంటాం. భవిష్యత్తులో కూడా వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అదే నిజం.... .

మార్పులు ఏ రంగంలో అయినా చాలా సహజంగా కనిపించే విషయం.. అయితే ఆ మార్పులు ఆ రంగానికి లేదా పర్యావరణం, చుట్టుపక్కల వారికి ఏదో ఒక విధంగా లాభం/మంచి చేసే విధంగానే ఉండాలి గాని నష్టం చేసేది అయ్యి ఉండకూడదు. కానీ ఈ ఆధునిక సమాజంలో, మారుతున్న కాలానికి తగ్గట్లుగా వ్యవసాయంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పంటకు ఉపయోగించే ఎరువుల విషయంలో మార్పు ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇక్కడ నుంచి వచ్చాయో తెలియదు గాని రసాయనిక ఎరువుల వినియోగం రైతులకు అలవడింది. ఎన్నో ఎకరాల పంట అయినా సరే రసాయనిక ఎరువులతో పంటను రక్షించుకోవడం అలవాటు చేసుకున్నారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వలన ఎన్నో నష్టాలు వస్తున్నాయని అంటున్నారు నిపుణులు... ఇప్పుడు వాడుతున్న రసాయనిక ఎరువులు కు ప్రత్యామ్నాయం "జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్". ZBNF అంటే ఏమిటి , దాని లాభాలు ఏమిటి, మన రాష్ట్రంలో ఈ విధానం ఏ విధంగా విజయం సాధించింది...

వ్యవసాయం అనగానే ఎరువులు, క్రిమిసంహారక మందులు, విచ్చలవిడిగా రసాయనాల వాడకం. ఇప్పుడు మోడ్రన్‌ కాలంలో సేద్యానికి అర్థం మారిపోయింది. ఈ తరహా సాగుతో దిగుబడి సంగతి ఏమో కానీ పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విచ్చలవిడి రసాయనాల వాడకంతో రైతుల , ప్రజల ఆరోగ్యం మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పైగా రసాయనాలు కొనుగోలుకు అధిక ఖర్చులు ... కట్ చేస్తే సగటు రైతు అప్పుల పాలు అవ్వాల్సి వస్తోంది... దీనికి పరిష్కారంగా ZBNF ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పంటలకు ఎలాంటి రసాయనిక ఎరువులు లేకుండా సహజంగా పంటలు పండించి అధిక దిగుబడి సాధించిన సుభాష్ పాలేకర్ సహాయంతో ఈ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు..  ఆవు పేడ , మూత్రం నుంచి తయారుచేసి సహజ ఎరువులతో ఖర్చు లేకుండా వ్యవసాయమే ఈ ZBNF. ఇప్పటికే రాష్ట్రంలో ఈ విధానంలో రైతులు కొంతమంది పంటలు పండిస్తున్నారు. 50వేల మంది వరకు అనుసరిస్తున్న ఈ విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. రానున్న కొన్ని సంవత్సరాల్లో రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు ఈ విధానం అవలంబించే విధంగా ప్రచారం చేసేందుకు సిద్ధం అవుతోంది ప్రభుత్వం...

ఈ నెల 11 నుంచి 13 వ తేదీ వరకు పారిస్ లో జరిగిన "పారిస్ పీస్ ఫోరమ్"కు విజయనగరం జిల్లా నుంచి కలెక్టర్ బృందం హాజరయ్యారు. డెవలప్మెంట్ విభాగంలో భారతదేశం తరఫున "జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్" స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ఈ విభాగంలో సుమారు 130కు పైగా స్టాల్ లు ఏర్పాటు చేశారు. అయితే వాటన్నింటిలోనూ టాప్ 10 బెస్ట్ ప్రాజెక్ట్స్ ను సెలెక్ట్ చేశారు నిర్వాహకులు... మన ZBNF ఈ టాప్ 10లో స్థానం సంపాదించింది... ఎంతో మంది ఇతర దేశాల ప్రతినిధులు మన సహజ వ్యవసాయం పై ఆసక్తి చూపిస్తున్నారు. స్టాల్ ను పరిశీలించినా పలు దేశాల ప్రముఖులు మన పద్ధతిని , అనుసరిస్తున్న విధానాన్ని ఆశ్చర్యపోయారు... తమ దేశంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. భారతదేశంలో ఈ విధానం అనుసరిస్తున్న మొదటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ కు ఖ్యాతి లభించింది... టాప్ 10 లో నిలిచిన ఈ ZBNF ప్రాజెక్ట్ కు "పారిస్ పీస్ ఫోరమ్" తరఫున ఒక సంవత్సరం పాటు సహాయ సహకారాలు అందించనున్నారు... 

ఇంతకీ అసలు ఈ ప్రకృతి సేద్యానికి, జీరో బడ్జెట్ వ్యవసాయానికి మూలం ఏమిటో తెలుసా.... విశాలంగా ఉండే అడవులు... అవును మనకు తెలియని ఎన్నో రకాల పళ్ళు, రకరకాల కాయగూరలు, పువ్వులు లాంటివి ఎన్నో పండుతాయి. మనం చేస్తున్న రసాయనిక వ్యవసాయమే మంచిది అనేదే నిజం అయితే అడవి పెరిగే ఆ వృక్షాలకు, చెట్లకు ఎవరు రసాయనాలు వేస్తున్నారు. ఈ ఆలోచనతోనే ప్రకృతి వ్యవసాయం చేసి విజయం సాధించారు సుభాష్ పాలేకర్. ప్రకృతిలో ఉండే సహజ ఎరువులే పంటను ఆరోగ్యవంతంగా కాపాడుతుంది. మంచి రుచిని అందిస్తుంది. కొన్ని రోజులు వర్షాలు లేకపోయేసరికి రసాయన ఎరువులు తో పండించే మొక్కలు త్వరగా వాడిపోతాయి. అదే సహజ ఎరువులతో పండిస్తే మాత్రం వర్షాభావ పరిస్థితులని సైతం తట్టుకునే విధంగా బలంగా తయారవుతుంది పంట... వీటితో పాటు ప్రకృతిలో లోపిస్తున్న సమతుల్యతను కూడా ఈ ZBNF తో కాపాడవచ్చు ...

ఎన్నో మంచి లక్షణాలు , తక్కువ ఖర్చుతో కూడిన ఈ ZBNF ను భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. న్యూయార్క్ టైమ్స్ కూడా  ఆంధ్రా ప్రభుత్వం చేస్తున్న ఈ ZBNF గురించి ప్రత్యేక కథనం కూడా ప్రచురించింది...  భవిష్యత్తులో 100 శాతం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ను ప్రకటించేందుకు ముఖ్యమంత్రి, రైతులు కృషి చేస్తున్నారు....

Photo Gallery