BREAKING NEWS

నూతన సంవత్సరం HAPPY NEW YEAR 2019

నూతన సంవత్సరం వస్తోందంటే చాలు... ఎన్నో ఆశలు, మరెన్నో కోరికలతో పాత సంవత్సరానికి సెండాఫ్ ఇవ్వడానికి రకరకాలుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు యువత. ప్రతి సంవత్సరం కాస్త భిన్నంగా జరుపుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అంతా ఓకే చోట చేరి కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.. మంచిదే.. బట్ బీ కేర్ ఫుల్...

                     కోరికలకు కళ్లెం వేయని, ఆశలకు హద్దుల్లేని, రెడ్ సిగ్నల్ లేని స్పీడ్ తో పార్టీలను ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. సరిగ్గా అక్కడే యువత దారి తప్పుతోంది. సంవత్సరానికి ఒకసారి కదా... ఏమౌతుంది లే అనే నిర్లక్ష్య ధోరణి వలనే సంవత్సరం మొత్తం స్వీట్ మెమోరీస్ చేసుకుందాం అనుకునే వారికి జీవితాంతం చేదు విషాదం మిగులుస్తుంది... 12 గంటల సమయంలో మద్యం సేవిస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పే కుర్రకారు అక్కడి నుంచి ఇస్తనుసారంగా బిహేవ్ చేస్తారు. మందు నిషా నషాళానికి ఎక్కేకా బైక్. లు కిక్ కొట్టి స్టార్ట్ చేస్తారు... ఎటు వెళ్తున్నారు , ఎంత స్పీడ్ లో వెళ్తున్నారో కూడా తెలియదు. చేతిలో యక్సిలేరేటర్ ను ఒక్కసారి రైజ్ చేస్తే చాలు... చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచిపోతారు. మందు కిక్కు ఒక పక్క బైక్ స్పీడ్ థ్రిల్ ఇంకో పక్క.... ఇక చెప్పేదేముంది.... రోడ్లపై స్వైర విహారం చేసేస్తారు...

                   పోలీసు డిపార్ట్మెంట్ సీరియస్ యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎవరు పట్టుబడినా పనిష్మెంట్ గారంటీ..  కానీ శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్లు పోలీసులకు దొరక్కుండా ఎలాంటి దొంగ దారుల్లో వెళ్దామా అని వెతుకుతుంటారు మందు బాబులు. అసలే ఈ రోజు అర్ధరాత్రి వరకు వైన్ షాప్ లు తెరిచి ఉంచుకోవచ్చు అంటూ పర్మిషన్ లు కూడా ఇచ్చేశారు. తాగిన వారికి తాగినంత... ట్రిపుల్ రైడింగ్ లు, జిగ్ జాగ్ , ర్యాష్ డ్రైవింగ్ లు చేస్తూ దడ పుట్టిస్తారు. హాపీ నైట్ గా గడపాల్సిన 31st నైట్ ను విషాదాంతం చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రమే కాకుండా సరదాగా ఒకరితో ఒకరు పోటీ పడుతూ వేగంగా బైక్ లు నడిపే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అధిక వేగం, డ్రంక్ అండ్ డ్రైవ్ లలో ఎంతో మంది యువత బలి అయిపోతున్నారు. ఎంజాయ్ చేయండి. తప్పు లేదు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అది తెలుసుకోండి. లిమిట్ క్రాస్ చేయకండి. సేఫ్ గా న్యూ ఇయర్ కి వెల్ కమ్ చెప్పండి.... సంతోషంగా గడపండి...

            ముఖ్యంగా విశాఖ లాంటి నగరాలలో ఈవెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. స్నేహితుల ప్రోత్సాహంతో మద్యం తాగి డ్రైవ్ చేయడమో , లేదా థ్రిల్ కోసమో, అందరి ముందు గొప్ప కోసమో.... ఇలా కారణం ఏదైనా రిజల్ట్ మాత్రం ఒకటే... ఓవర్ స్పీడ్., ర్యాష్ & జిగ్ జాగ్ డ్రైవింగ్ .. పెదాలపై చిరునవ్వు తో కొత్త సంవత్సరానికి కోటి ఆశలతో స్వాగతం చెబుదాం... కళ్ళలో కనిపించే చెప్పలేని బాధతో కాదు .... 

BE CAREFUL.... BE SAFE.....HAPPY NEW YEAR 2019

Photo Gallery