BREAKING NEWS

మోడీ ప్రభుత్వం పై అసంతృప్తి ఎందుకు?


నిన్న మొన్నటి దాకా ఎక్కడ చూసిన మోడీ, అమిత్ షా ప్రబంజనం నడిచింది, ప్రజలు వాళ్ళకి బ్రహ్మరధం పట్టారు. ఒక్కసారిగా ప్రజలలో ఇంత తిరుగుబాటు ఎందుకు..? కమల నాథుల పై ప్రజలకు ఎందుకు అంత అసంతృప్తి..? వీటికి కారణాలు లేకపోలేదు, నోట్లు రద్దు విషయం లో ప్రజల నుండి మొదటిలో మంచి అనుకలతే వొచ్చినప్పటికీ బిజెపి ప్రభుత్వం ఆ డబ్బులు ని ప్రజలకు సరైన పద్దతిలో వినియోగించకుండా దుర్వినియోగం చేశాయని, ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టారు వాటి లెక్కలు చెప్పడం లో విఫలం అయ్యింది.

అంతేకాకుండా ఎన్నికలు సమయంలో రైతులుకి చేసిన రుణ మాఫీ, ఉచిత విద్యుత్ వంటి వాగ్దనాలను నిలబెట్టు కోవడం లో తీవ్రంగా విఫలం అయ్యింది. ఇంధనం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటడం ఇలాంటి వాటి వాళ్ళ బిజెపి ప్రభుత్వం పై తీవ్ర అసంతృప్తి నెలకొనింది. ముఖ్యంగా రఫెల్ డీల్ ని "ఎచ్  ఏ ల్" కాకుండా రిలయన్స్ కి ఇవ్వడం ద్వారా అనేక ఉద్యోగులు లో కూడా బీజేపీ అంటే విముక్త ఏర్పడింది. 

అయితే ఇవ్వని కాంగ్రెస్ ప్లస్ పాయింట్స్ గా మలుచుకుంది, రైతులు రుణాలు మాఫీ చేస్తామనని, తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలు తగ్గిస్తామని, నిరంతర విద్యుత్ అందిస్తామని చెప్పడం తో ప్రజలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛాతీస్గఢ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ కి పట్టం కట్టారు.

Photo Gallery