BREAKING NEWS

వైస్సార్సీపీ ని డిమాండ్ చేస్తున్న జనసేన

ఎన్నికలు సమీపించే కొలది ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారుతూ వస్తున్నాయి, ఎప్పుడు ఏ పార్టీ ఏ పార్టీ తో పొత్తు పెట్టుకుంటుందో ఎవరు ఊహించలేని పరిస్థితి నెలకొనింది. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న గాసిప్స్ ఏంటంటే రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ వైస్సార్సీపీ తో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్టు, అంతే కాకుండా జనసేన కొన్ని డిమాండ్లను వైస్సార్సీపీ ముందు ఉంచినట్టు తెలుస్తుంది. వాటిని వైస్సార్సీపీ నాయకులు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

వీటి మీద తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ జనసేన మరియు వైస్సార్సీపీ నాయకులు ఒక రహస్య సమావేశం లో పాల్గొని రాబోయే ఎన్నికలలో ఇరు పార్టీల కలయికతో చంద్రబాబు ని గద్దెదించాలని అని నాయకులు చర్చించినట్టు తెలుస్తుంది. ఈ సమావేశం లో పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు, విజయ్ సాయి రెడ్డి, కొంతమంది తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సన్నిహితులు ఒక ప్రముఖ ఐఏస్ ఆఫీసర్ గెస్ట్ హౌస్ లో సమావేశం అయ్యారని, సుమారుగా 5 గంటలు సుదీర్ఘ చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఈ సమావేశం లో నాగబాబు జనసేనకు 30 అసెంబ్లీ సీట్లు 5 ఎంపీ సీట్లు జనసేన పార్టీ కి ఇవ్వాలని డిమాండ్ చేసారని సమాచారం. 2019 ఎన్నికలలో జనసేన పార్టీ  వైస్సార్సీపీ తో కలవాలి అంటే ఈ డిమాండ్లు కి సమ్మతం అయితే కలిసి పని చెయ్యడానికి ఏమి ఇబ్బంది లేదు అంటూ జనసేన నాయకులు ఈ సమావేశం లో చెప్పినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ పర్యటనలో నిమగ్నమై ఉన్న పవన్ కళ్యాణ్ ఇండియా కి రాగానే ఈ విషయాలు పై పార్టీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. తెలంగాణ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత కెసిఆర్ ప్రెస్ మీట్ లో చంద్రబాబు తెలంగాణకి వొచ్చి తమకి గిఫ్ట్ ఇచ్చారని మేము కూడా "రిటర్న్ గిఫ్ట్" ఇవ్వాలి కదా అని చెప్పి సంచలనం సృష్టించారు. అయితే పవన్ కళ్యాణ్ ఇండియాకి రాగానే కెసిఆర్ ని కలవబోతున్నారని, ఇరు పార్టీల కలయిక గురించి చరించబోతున్నారని సమాచారం. అయితే ఇదే విషయం పై కెసిఆర్ జగన్ తో ఫోన్ లో సంభాషణలు జరిపారని, జగన్, పవన్ ని కలిపి చంద్రబాబు నాయుడికి చెక్ పెట్టె ప్రయత్నాలు చేస్తున్నారు అని పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతున్న వార్త. అయితే జనసేన పెద్దలు చేసిన డిమాండ్లు జగన్ కి అత్యంత సన్నిహితుడు అయిన విజయ్ సాయి రెడ్డి సుముఖంగా ఉన్నారని ఇదే విషయం పై జగన్ తో చర్చించి త్వరలో తన నిర్ణయాన్ని తెలుపుతామని చెప్పిన్నట్టు సమాచారం. ఈ వార్తలో నిజం ఎంత ఉంది తెలియదు కానీ ప్రస్తుతం రాజకీయ సర్కిల్స్ లో అయితే చక్కెర్లు కొడుతుంది. ఒక వేళా జనసేన వైస్సార్సీపీ కలిస్తే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలవడం కష్టతరమే, ఎందుకంటే 2014 ఎన్నికలలో ఏ పార్టీ తో పొత్తు లేకుండానే వైస్సార్సీపీ 4 లక్షల ఓట్లు తేడాతో ఓడిపోయింది.2014 ఎన్నికలలో తెలుగుదేశం  ఎన్డీయే లో ఉండటం,ఆ పార్టీలు తరుపున పవన్ కళ్యాణ్ విస్తృత ప్రచారం చెయ్యడం ద్వారానే అధికారం లోకి ఒచ్చిందనడంలో అతిశయోక్తి లేదు.  

మరి ప్రతి సభలలో జగన్ చేసే ఆక్రమణలను బట్టబయలు చేస్తూ ఉండే పవన్ కళ్యాణ్ జగన్ తో కలుస్తారా అనేది ప్రస్నార్ధకరం. ఒక వేళా ఇరు పార్టీలు కలిస్తే ఆంధ్రప్రేదేశ్ లో తెలుగుదేశం పార్టీ 2019 లో అధికారం లోకి రావడం కొంచెం కష్టతరమే. మరి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటూ కష్ట సమయాలలో తన మాస్టర్ బ్రెయిన్ ని  ఉపయోగించి తనకి ప్రతికూల పరిస్థితులు గా మార్చుకోగల సత్త ఉన్న చంద్రబాబు దీనికి ఎలా చెక్ పెడ్తారో చూద్దాం.