BREAKING NEWS

కూటమికి పది అటు ఇటుగా 65 స్థానాలు


తెలంగాణ లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది, ఒకటి రొండు ప్రదేశాలలో తప్పించి తెలంగాణ అంతటా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ కమిషన్ విజయవంతంగా ఎన్నికలు నిర్వహించారు. కొందరు వ్యక్తులు తమ పేర్లు ఓటర్ లిస్ట్ లో లేవు అని ఆరోపణలు చేసినప్పట్టికి దానికి ఈసీ సరైన వివరణ ఇచ్చింది.

ఇదిలా ఉండగా మా పార్టీ గెలుస్తుంది అంటే మా పార్టీ గెలుస్తుందని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ ఐటీ మంత్రి కేటీర్  మాత్రం తెరాస జెండానే ఎగురుతుంది అని గట్టి నమ్మకంగా ఉన్నారు. దీనికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా వొచ్చేసాయి అని దాని ఫలితాలు అన్ని కారు కి అనుకూలంగా వొచ్చాయి అని తెరాస కార్యకర్తలు చెప్పుకొస్తున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ తెరాస పార్టీ లో, కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మరోసారి అధికారం లోకి రాబోతున్నామని సంబరాలు చేసుకుంటున్నారు. అయితే దీని పై కెటిర్ స్పందిస్తూ తెరాస పార్టీ 100 స్థానాలలో విజయం సాదిస్తుందని , మేము మారోసారి తెలంగాణ ప్రజలు అస్సీసులతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని ధీమా వ్యక్తం చేసారు. ఇది నేను ఊరికే మొక్కుబడిగా చెప్పటం లేదని అన్ని ప్రాంతాల నుండి వస్తున్న సమాచారం మేరకే చెప్తున్నానని అన్నారు.

గత 5 నెలలు నుండి తెరాస పార్టీ వెన్నండి ఉండి పార్టీ కి సహాయం చేసిన కార్యకర్తలు అందరికి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఎగ్జిట్ పోల్స్ విషయం పై లగడపాటి వెర్షన్  వేరేలా ఉంది తెరాస పార్టీ చిత్తుగా ఓడిపోతుందని, మహాకూటమికి 60 నుండి 65 వరకు సీట్ లు కైవసం చేసుకుంటుందని తెరాస 30 నుండి 35 వరకు దక్కుతాయి అని ఇప్పటికే లగడపాటి సర్వే విడుదల చేసారు. ఎవరు గెలుస్తారా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. తెలంగాణ ఎన్నికలు ఫలితాలు ఈ నెల 11న వెలువడనున్నాయి. 

లగడపాటి సర్వే:

ప్రజా కూటమి కాంగ్రెస్ = 65 +/- 10 {టీడీపీ = 5 +/- 2}

టీఆర్ఎస్ = 35 +/- 10

ఎంఐఎం = 7 +/- 2

బీజేపీ = 7 +/- 2

ఇతరులు = 7 +/- 2

Photo Gallery