BREAKING NEWS

మోడీ ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరిక


బిజెపి పట్ల తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు అన్నదానికి ఉదాహరణ నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలే, మోడీ హవా తగ్గిపోతుంది అన్నదానికి తార్కాణం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఫలితాలు రుజువు చేసాయి. మోడీ అమిత్ షా లు పార్టీ కి పెద్ద ప్లస్ పాయింట్స్ అని, వారు ఒంటి చేత్తో పార్టీ ని గెలిపించగల సత్తా ఉన్న నాయకులని ఆ పార్టీ వర్గాలు ఎన్నికలు ముందు అభిప్రాయపడ్డారు కానీ ఎన్నికలు తరువాత సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఎవరైతే మేము ఏదైనా చెయ్యగలం, మేము రాజకీయాలలో చక్రం తిప్పగలం, మాకు సాటి ఎవ్వరు లేరు అని గొప్పలు పోతారో అలాంటి వారికి ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం, ఇప్పడూ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాల్లో అది పునరావృతం అయ్యింది. 

కొంతమంది నాయకులు గెలిస్తే ఇది ప్రజాస్వామ్య విజయం అని, ఓడిపోతే ఇది ఈవీఎం లు తప్పిదం అని, ఓట్లు లెక్కింపు లో మతలబులు జరిగాయి అని నాయకులు కూడా వున్నారు, అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అలాంటి నాయుకులకు కనీసం ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎంత వయస్సు వారు అర్హులో తెలిసో లేదో అన్న అనుమానాలు వస్తాయి.

పార్లమెంటరి ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాలలో మినహాయిస్తే మిగిలిన అన్ని రాష్ట్రాలలో 70 నుండి 85 శాతం వరుకు ఓటింగ్ జరిగింది. ప్రజలలో చైతన్యం వొచ్చింది ఏ నాయకుడు పని చేస్తున్నాడు, ఏ నాయకుడు పని చెయ్యట్లేదు అన్న అవగాహనా వాళ్ళకి వుంది, పని చేసేవారికి పట్టం కట్టి, పని చెయ్యని వారికి ఓటు ద్వారా బుద్ధి చెప్తున్నారు. బిక్షం ఎత్తుకునే వాడి దగ్గర నుండి ఆటో నడిపేవాడు వరుకు అందరూ రాష్ట్ర, జాతీయ నాయకులూ గురించి చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన రాజకీయాల ప్రస్తావన వస్తూనే ఉంది. ఏ నాయకుడు ఎన్ని అక్రమాలు, స్కాం లు చేసాడు, ఏ నాయకుడు ప్రజలకు ఏం చేసాడు అని ట్రోల్ పేజెస్ ద్వారా భావన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని సభలు పెట్టిన, ఎన్ని ప్రసంగాలు చేసిన, ఎంత ప్రలోభ పెట్టిన ప్రజలు తమకు మంచి చేసే నాయకులకే పట్టం కడుతున్నారు. రాజ్ కుమార్ రావు సినిమా లో చూపించినట్టు ఓటర్లను భయబ్రాంతులుని చేసి బలవంతంగా ఓటు వేయించే రోజులు పోయాయి. ప్రజలు రాజకీయాలు పై పూర్తి అవగాహనతో ఉన్నారు అని నిన్న విడుదల అయినా అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు ద్వారా మరోసారి రుజువు అయ్యింది. 

ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో లోకసభ అసెంబ్లీ ఎన్నికలలో కమల నాధులని భారీ మెజారిటీ తో గెలిపించిన ప్రజలే ఉప ఎన్నికలలో బిజెపి చిత్తు చిత్తుగా ఓడించి, మోడీ  ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలు జారీ చేసారు. ఇటీవల జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీశ్గడ్ రాష్ట్రాలలో ఎన్నికలు ముందు ఓట్లు అడగడానికి వెళ్లిన బీజేపీ నాయకులు పై ఆయా రాష్ట్ర ప్రజలు భౌతిక దాడులుకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్న పరిస్థితులు అందరికి తెలిసిన విషయమే, ఆ సంఘటనలతో ప్రజలు నాయకులు పై ఎంత అసంతృప్తి తో ఉన్నారన్నది స్పష్టం అయ్యింది, అది నిన్న ఫలితాలు ద్వారా రుజువు అయ్యింది.

ఆయా రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం పట్ల ఉన్న అసంతృప్తే అక్కడ బిజెపి ప్రభుత్వ ఓటమికి దారి తీసింది. మధ్య ప్రదేశ్ లో బిజెపి నాయకులు పర్యటించినప్పుడు మహాకోశాల, వింధ్య, మధ్యభూపాల్, ఇండోర్ వంటి ప్రాంతాలలో రైతులు, దళితులు, ముస్లిం మైనారిటీ సంఘాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసాయి. గత ఎన్నికలలో శివరాజ్ సింగ్ చోహన్ 165 సీట్లతో భారీ మెజారిటీ తో గెలిచినప్పటికీ, ఈ సారి ఓడిపోతారని విస్తృతంగా చర్చలు జరిగాయి, ఈ సారి కాంగ్రెస్ ఏ పై చెయ్యి సాదిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకుడిని నిలబెట్టడం, ప్రజలలో అటు మోడీ పాలన పై శివరాజ్ సింగ్ ప్రభుత్వం పై ప్రజలు అసంతృప్తిగా ఉండటం తో బీజేపీ పై కాంగ్రెస్ పై చెయ్యి సాధించగలిగింది. ఎన్నికలు ముంది సిఎస్, జి ఎస్ సంస్థలు వెల్లడించిన మాదిరిగానే రైతులు, దళితులు, కార్మికులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.