BREAKING NEWS

గవర్నర్ తో ప్రజకూటమి నాయకులు భేటీ


ప్రజాకూటమి ని ఒక పార్టీగా గుర్తించాలి అంటే ఈ రోజు గవర్నర్ నర్సింహన్ ను కోరనున్నారు కాంగ్రెస్, టిడిపి నాయకులు ఈ మేరకు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టు సమాచారం. మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్, టిడిపి, తెలంగాణ జన సమితి, సిపిఐ పార్టీ లు కలిసి పోటీ చేసినందు వల్ల ఈ కూటమిని అంత ఒక జట్టుగా పరిగణించాలని విజ్ఞప్తి చేయనున్నాయి. ఎన్నికలు ఫలితాలు తర్వాత రాజ్యాంగ బద్ధమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్ ను కోరనున్నాయి.

ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు గవర్నర్ ప్రజకూటమి నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చారు, అయితే ఇంతకు ముందు బీజేపీ నాయకులు ఫలితాలు తర్వాత తెరాస కు మద్దత్తు ఇవ్వాల్సి వస్తే  తాము తప్పకుండ ఇస్తామని చెప్పడంతో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా చెయ్యాలని గవర్నర్ కి వివరించాలని భేటీ లో నిర్ణయించారు. ప్రజకూటమి నేతలు నిన్న జరిగిన భేటీ లో కలిసి చర్చించారు, ఫలితాలు తరువాత ప్రత్యర్థులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించే అంశాలు పై గవర్నర్ కి తెలియజేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అంతే కాకుండా ఎన్నికలు తరువాత జరిగిన భౌతిక దాడులు, బెదిరింపులు, ఓట్లు గల్లంతు విషయాలు పై కూడా ఫిర్యాదు చెయ్యాలని నిర్ణయించారు. 

ఫలితాలు వెలువడిన తరువాత ప్రజకూటమి నేతలు అందరితో చర్చించి ప్రత్యర్థులను ఎదురుకోవడానికి  ఒక ప్రణాళికను రూపొందించాలని అని నిర్ణయించారు. ప్రజకూటమి కి 70 నుండి 75 స్థానాల్లో విజయకేతనం ఎగురు వేస్తుంది అని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గడిచిన మూడు నెలలో తెరాస చేసిన అక్రమాలు గురించి, ఆపద్ధర్మ పాలన గురించి గవర్నర్ కి ఫిర్యాదు చేయాలన్న ప్రజకూటమి నేతలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రజకూటమిని ఇంకా బలపరిచేందుకు ఎంఐఎం, ఇండిపెండెట్ అభ్యర్థులు, ఇతర పార్టీలు నుండి తిరుగుబాటు చేసి పోటీ చేసిన వ్యక్తుల మద్దతు కూడా తీసుకోవాలని ప్రజకూటమి నేతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఎంఐఎం కచ్చితంగా 9 స్థానాలలో గెలుస్తునందున ఈ నిర్ణయానికి వొచ్చారని, ఈ మేరకు ఎంఐ ఎం ముఖ్య నేతలతో చర్చింగా, వారు కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్స్ తో అంత సుముఖంగా వ్యక్తం చేయలేదని తెలిసింది. ఇదిలా ఉండగా ఎన్నికలు ముందు రోజు రాజ్యాంగ విరుద్ధంగా అర్ధరాత్రి సమయంలో తలుపులు బద్దలు కొట్టుకొని ఎటువంటి ముందస్తు హెచ్చరికలు చెయ్యకుండా రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేసిన తీరు పై  ప్రజకూటమి నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది, కూకట్ పల్లి లో ఉద్దేశపూర్వకంగా 50 వేల ఓట్లను జాబితాలో నుండి తొలిగించడం వంటి అంశాలను గవర్నర్ కి వివరిస్తామని ప్రజకూటమ నేతలు అన్నారు. 

Photo Gallery