BREAKING NEWS

"పెట్ట" టీజర్ విడుదల


సూపర్ స్టార్ రజినీకాంత పుట్టున రోజు సందర్భంగా ఆ చిత్ర యూనిట్ "పెట్ట" టీజర్ ని విడుదల చేసింది. ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రజిని అభిమానులలో ఒక పండుగ వాతావరణం నెలకొనింది. ఈ చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కి ఇటు తెలుగు లో అటు తమిళం లో మంచి క్రేజ్ ఉండటం తో ఈ చిత్రానికి అంచనాలు మరింత పెరిగాయి.

విడుదల చేసిన టీజర్ ని పరిశీలిస్తే, రజిని వాకింగ్ తో టీజర్ మొదలవుతుంది, వీధి లైట్ లు వెలుగులు మధ్య రజిని నడుచుకుంటూ టార్చ్ లైట్ లు పట్టుకొని కొట్టుకుంటున్న ఒక గుంపు దగ్గరకి వెళ్లి నుంచొని సిగ్నల్ ఇస్తాడు. టీజర్ లో రజినీకాంత్ రొండు పాత్రలలో కనపడ్డారు, ఒక క్యారెక్టర్ స్టైలిష్ గా గా ఉంటె ఇంకొక క్యారెక్టర్ లో తమిళ్ పంచెకట్టు స్టైల్ లో కనపడ్డారు, ట్రెడిషనల్ లుక్ లో పెద్ద గడ్డం తో రజిని మాస్ ఆడియన్స్ ని రంజిపచేసేవిధంగా కనపడ్డారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ టీజర్ లో రజిని ఎంట్రన్స్ కి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు, ఇది కచ్చితంగా మాస్ ఆడియన్స్ ని, తలైవర్ ఫాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. "మాస్ మారానో" అనే లిరిక్స్ తో వొచ్చే ఈ బాక్గ్రౌండ్ మ్యూజిక్ తమిళనాట మారుమోగిపోతుంది అనడం లో అతిశయోక్తి లేదు. 

ఈ చిత్రం లో రజిని సరసన త్రిష, సిమ్రాన్ నటిస్తుండగా, మక్కల సెల్వన్ విజయ్ సేతుపతి ఈ చిత్రం లో ప్రతినాయకుడి పాత్రల్లో నటించారు. బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్న సంగతి విదితమే. సన్ పిక్చర్స్ సంక్రాంతి కనుకుగా తమిళ్, తెలుగు లో ఒకేసారి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తుంది.  
 
 

Photo Gallery