BREAKING NEWS

పరిసరాల పరిశుభ్రత - ఎవరు బాధ్యులు ??

*"పరిసరాల పరిశుభ్రత"*... ఎన్నో ఏళ్లగా చిన్ననాటి నుంచీ పిల్లలకి ఇవే పాఠాలు చెబుతూ పెంచుతున్నాం... మనం నివసించే ప్రదేశాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకోవాలి. ఇదే అలవాటు చేయాలి అనుకుంటున్నాం. కాలం తో పాటు కొన్ని పేర్లు కూడా మారుతూ వస్తాయి. అలా వచ్చిందే మన *#స్వచ్చ్ భారత్"*. ప్రధాని మోడీ ప్రారంభించిన ఈ *"స్వఛ్చ్ భారత్"* క్యాంపెయిన్ కు మంచి స్పందనే లభించింది. అయితే నిజానికి ఈ స్వఛ్చ్ భారత్ క్యాంపెయిన్ ను చాలా కాలం క్రితమే మన ముఖ్యమంత్రి *"క్లీన్ అండ్ గ్రీన్"* పేరుతో మన రాష్ట్రంలో అమలు చేశారు..   

ఇంతకీ ఈ స్వచ్చ్ భారత్ దేశంలో మార్పు తీసుకువచ్చిందా... లేదా క్యాంపెయిన్ ఉద్దేశమే పూర్తిగా మారిపోయిందా... దేశంలో ప్రతి సంవత్సరం నిర్వహించే స్వచ్చ్ సర్వేక్షన్ లో మన రాష్ట్రం నుంచి టాప్ 10 లో రెండు మూడు నగరాలు నిలుస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఈ స్వచ్చ్ భారత అమలు లో ఉన్న లోపాలు ఎవరి కారణంగా జరుగుతున్నాయి... ప్రభుత్వమా.... మనమా????

 ఏ దేశంలో అయినా ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రజలకు అందిస్తూ ఉంటుంది. ఏ ప్రాజెక్ట్ అయినా విజయం సాధించాలి అంటే ప్రజల సహకారం , వారి బాధ్యత కూడా ఎంతో ఉండాలి. ప్రజల నుంచి సరైన స్పందన లేకపోతే ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా , ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదు.. దానికి ఉదాహరణే ఈ *"స్వచ్చ్ భారత్"* నిజానికి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడం కోసం , విదేశీ టూరిస్ట్ లని మన దేశం కు ఆకర్షించడం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వాటిలో ఒకటి ఈ స్వఛ్చ్ భారత్. నగర రోడ్లపై ఒక్క చిన్న చెత్త కనిపించడానికి కూడా వీలు లేదు. రోడ్లన్నీ కడిగిన ముత్యంలా తళతళ మెరిసిపోవాలి... క్యాంపెయిన్ ప్రారంభంలో కాస్త సవ్యంగానే సాగినా తర్వాత్తర్వాత ప్రజల సహకారం లోపించింది అని చెప్పాలి. అందుకే మొదట్లో ర్యాంకులు సాధించిన నగరాలు తర్వత సంవత్సరం ర్యాంకింగ్ లో కాస్త వెనుకబడ్డాయి. ప్రజల సహకారానికి. స్వచ్చ్ సర్వేక్షన్ కు సంబంధం ఏమిటి...

స్వచ్చ్ భారత్ అంటే రోడ్డుపై ఉండే చెత్తను తుడవడం కాదు. అస్సలు చెత్తను రోడ్డుపై వేయకుండా ఉండడం. ప్రారంభించడం ప్రధాని అయినా దాన్ని సరిగ్గా పాటించాల్సింది  మాత్రం మనమే కదా... కానీ ఇక్కడే వస్తోంది అసలు సమస్య. బస్సులో నుంచి వెళ్తూ వెళ్తూ చేతిలో ఉండే చెత్తను సడెన్ గా రోడ్డుపై పడేస్తారు. నోట్లో ఉండే కిల్లిని కనీస జ్ఞానం కూడా లేకుండా గోడలపై ఉమ్మేస్తారు... ఇంట్లో ఉండే చెత్తను ఇంటి వెనకాలే ఖాళీ స్థలంలో విసిరేస్తారు.. ప్లాస్టిక్ చెత్త గురించి మాట్లాడే అవసరమే లేదు. ఇన్ని చేస్తూ కూడా మనం అనేది ఒక్కటే మాట... *"స్వచ్చ్ భారత్ అన్నారు.. రోడ్డుపై చెత్త అలాగే ఉంటోంది.. ఏం చేస్తుందీ ప్రభుత్వం"*.

ఇలా అనుకునే అందరూ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. *"శుభ్రంగా ఉండండి అని మాత్రమే ప్రధాని, ముఖ్యమంత్రి చెప్పగలరు. అంతే గానీ మనం ఎక్కడ పడితే అక్కడ పడేసే చెత్తను వాళ్ళు వచ్చి క్లీన్ చేయరు కదా... శుభ్రం చేసుకోవాల్సింది....శుభ్రంగా ఉంచుకోవాల్సింది మనమే.. అంటే ప్రజలు... కేవలం ప్రభుత్వాన్ని నిందించడమే కాదు. అసలు మనకు ఆ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత ఉందో లేదో ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి... అప్పుడు తప్పు చేస్తున్నది ఎవరో తెలుస్తుంది. స్వచ్ఛ భారత్ కావాలి అంటే స్వచ్ఛ మనసు ఉండాలి... అప్పుడే ఇలాంటి క్యాంపెయిన్ లు ఘన విజయం సాధిస్తాయి.. అయినా నీట్ గా శుభ్రంగా ఉండండి అని ఎవరో చెప్పి .. ఇంత భారీ భారీ ప్రచారాలు అవసరమా... ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి...  ఎవరి బాధ్యతని వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తూ ఉంటే ఇలా చేయండి అంటూ ఎవరూ చెప్పరు.. చెప్పలేరు కూడా... థింక్ వన్స్.... 

Photo Gallery