BREAKING NEWS

తెలంగాణా ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ

నేషనల్ మీడియా సర్వేలే నిజం అయ్యాయి.. తెలంగాణలో కేసీఆర్ ఘన విజయం సాధించారు. తెలంగాణ గడ్డపై తనకు తిరుగులేదు అని మరోసారి నిరూపించారు. తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఏర్పడిన మహా కూటమి తెరాస పై ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. 

" కర్ణుడి చావుకు కారణాలు అనేకం" అన్నట్లు తెలంగాణా లో మహా కూటమి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.

అవేంటో ఓసారి చూద్దాం...
1. బాగా ముందుగా ఒక అంగీకారానికి వచ్చి స్పష్టమైన అవగాహనతో కూటమిగా ఏర్పడి , ప్రజలకోసం ప్రభుత్వంతో పోరాడలేదు...

2.  అప్పటికప్పుడు కేవలం TRS ని ఓడించడమే పనిగా తూతూ మంత్రంగా జత కట్టారు గానీ ఏ పార్టీకి చిత్త శుద్ధి లేదు....

3.కూటమిని నడిపించడానికి ప్రజలలో చరిష్మా ఉన్న నాయకుడు లేడు...

4.KCR శాసనసభ రద్దు చేసిన రోజే అభ్యర్థులను వ్యూహాత్మకంగా ప్రకటిస్తే ,
కూటమి నామినేషన్లు వేయడానికి కూడా కనీసం టైమ్ లేని పరిస్థితులలో సీట్ల పంపకం కూడా చేసుకోలేకపోయింది...

5. ఏవో వారికున్న సర్వేల ప్రకారం ఓడిపోతారు అని తెలిసి , సీట్లివ్వకపోతే ,
సరే అనకుండా రాహుల్ ఇంటిముందు ధర్నాలు చేసి మరీ బలవంతంగా B ఫారాలు సంపాదించారు...

6. కోదండరాం లాంటి నాయకులు పోటీలోనే లేకుండా పోయారు..

6. గద్దర్ కనీసం పోటీ చేసి ఉంటే మరో సీట్ అయినా కూటమికి దక్కేదేమో ...

7. రేవంత్ రెడ్డి లాంటి కొంతమందిని ఓడించడానికి TRS కన్నా స్వపక్ష సభ్యులే ఎక్కువగా శ్రమించారు..

8. వ్యూహాత్మక ప్రచారం తక్కువ అనవసరపు డాంబికం ఎక్కువ అయ్యింది...

9.బండ్ల గణేష్ లాంటి వాళ్ళు సీరియస్ గా గాక కామెడీగా చేసిన ప్రచారం కూడా పరాజయానికి ముఖ్యపాత్ర పోషించింది...

10.కూకట్ పల్లి లో హరికృష్ణ కుటుంబం ఎప్పుడైనా ప్రజాహిత కార్యక్రమాలు చేసారా? హరికృష్ణ కూతురు ని గెలిపించడానికి... అసలు సుహాసిని అంటే ఎవరో కూడా ప్రజలకు పెద్దగా తెలియదు కూడా...

11. పోనీ .. నిజంగా KCR వైఫల్యాలను ప్రజల్లోకి తీసు కెళ్లగలిచారా అంటే అదీ లేదు... కళ్లెదుటే కనిపిస్తున్న సంక్షేమ పథకాలను చెయ్యలేదంటే నమ్మడానికి ప్రజలు కమెడియన్స్ కాదే ...

12. తెలంగాణా సాధన కోసమే ఒక ఉద్యమ పార్టీగా పుట్టి , రాజకీయంగా రూపాంతరం చెంది,ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని అఖండ మెజార్టీతో గద్దె నెక్కి ,అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ,వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన KCR ని   చాలా తక్కువగా అంచనా వేయడం కూటమి చేసిన పెద్ద తప్పు...

13.మేము ఏది చెప్పినా నమ్మేసి ప్రజలు ఓటేస్తారు , ఎన్నికల ముందు అలా కనబడి ఇలా కొన్ని హామిలిచ్చేస్తే ఓ పనైపోతుంది అని భావించడం కూటమి చేసిన మరో అతి పెద్ద తప్పు..

ఓడినా గెలిచినా నిత్యం ప్రజలతో ఉండాలి.నిజమైన ప్రజా సమస్యలపై పోరాడాలి. ప్రభుత్వంలో నిజమైన లోపాలుంటేనే విమర్శించాలి. అంతే గాని ప్రతిపక్షం కదా అని ప్రభుత్వం చేసిన మంచి పనిని కూడా పనికట్టుకుని మరీ పార్టీ అధికార ప్రతినిధుల పేరిట ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తే ..ఆయా పార్టీలకు మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతుంది..

తస్మాత్ జాగ్రత్త... కాలం మారింది.. ప్రజలు తెలివైనవారు.. పాత రోజులలో అయితే కుల పెద్ద చెప్పాడనో , మద్యం పోశారనో , డబ్బులు పంచారనో ఓట్లేసారేమో కానీ ఈ రోజుల్లో వీటన్నింటికి సై అంటున్నా సరే అంతిమంగా తమ మనస్సాక్షి ప్రకారమే ఓటు వేస్తున్నారు. నిజమైన ప్రజాస్వామ్యం ఇప్పుడొచ్చింది..

Photo Gallery