BREAKING NEWS

Exit Polls - వాస్తవ ఫలితాలను ప్రతిబంబిస్తాయా..?


తెలంగాణ లో పోలింగ్ ముగిసింది, ఆలా పోలింగ్ ముగిసిందో లేదో జాతీయ వార్త సంస్థలు  లు, పొలిటికల్ లీడర్లు ఎన్నికలకు  సంబందించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేసాయి. తెలంగాణ కి సంబంధించి ఒక్కొక్కరి మాట ఒక్కక్క విధంగా ఉంది, కొంతమంది ఏమో మహాకూటమి గెలుస్తుందని, ఇంకొంతమంది ఏమో తెరాస గెలుస్తుందని అంటున్నారు.. ఇంతకు ఎవరి మాట నిజం అవుతుంది జాతీయ సంస్థలదా..? లగడపాటి సర్వేదా..? పొలిటికల్ లీడర్ల దా..? 

ఒకసారి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ని పరిశీలిస్తే, జాతీయ వార్త సంస్థలు అయినా టైమ్స్ అఫ్ ఇండియా, టైమ్స్ నౌలు దాదాపుగా అన్ని సంస్థలు తెరాస పార్టీ కి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ని విడుదల చేసాయి కానీ మాజీ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం తెరాస కి వ్యతిరేకంగా ఎగ్జిట్ పోల్స్ ని విడుదల చేసారు. ఏది ఎలా ఉన్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము మొత్తం ఎగ్జిట్ పోల్స్ గురించే చర్చలు జరుపుతున్నారు.! 

అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి..? ఇవి వాస్తవ ఫలితాలకు లీక్ అయినా పేపర్ లు లాంటివా..? వీటికి అంత ప్రాముఖ్యత ఉందా..? క్రిందటి ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏమైనా వస్తావా రూపం దాల్చాయా..? ముఖ్యంగా ఇప్పుడు మనం లగడపాటి రాజగోపాల్ గతం లో చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గురించి పరిశీలిస్తే, మొదటిలో అయినా గుజరాత్ శాసన సభ ఫలితాలు గురించి సర్వే చేయడం జరిగింది. అయితే సర్వే ఫలితాలు, వాస్తవ ఫలితాలు కొంచెం దగ్గరలో రావడం వాళ్ళ అయినా సర్వే లు మీద అందరి చూపు మళ్లింది. ఇదే పరిస్థితి కర్ణాటక తమిళనాడు ఎన్నికలలో కూడా పునరావృతం అయ్యంది దీనితో రాజగోపాల్ సర్వే లు అంటే సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రతి సారి ఈ సర్వే ఫలితాలు నిజం అవుతాయి అని ఎవరు చెప్పలేరు, కొన్ని సార్లు అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫలితాలు బిన్నంగా వొచ్చిన దాఖలాలు కూడా లేకపోలేదు.

తమిళ నాడు లో జరిగిన ఎన్నికలలో కూడా జాతీయ ఛానెల్ లు డీఎంకే అధికారం లోకి వస్తాయి అని చెప్పాయి కానీ ఏ ఐ డీఎంకే అధికారంలోకి వొచ్చింది. దీని బట్టి చూస్తే ఒక్కోసారి సర్వే ఫలితాలు అనేవి వస్తావా ఫలితాలకు దగ్గరగా ఉండచ్చు కానీ కచ్చితంగా సర్వే ఫలితాలే నిజం అవుతాయి అని లేదు. కానీ ఇప్పటి వరకు చూస్తే ఎగ్జిట్ పోల్స్ అనేవి వాస్తవ  ఫలితాలకు దగ్గరగా రావడం జరిగింది. అయితే ఈ సారి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి సంబందించిన  ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాస్త బిన్నంగా ఉన్నాయి అనడం లో సంధేయం లేదు. జాతీయ వార్త సంస్థలు  లు తెరాస పవర్ లోకి వస్తుంది అని చెబుతుంటే, లగడపాటి సర్వే మాత్రం కాంగ్రెస్ నేతృత్వం లో ఉన్న మహాకూటమి పవర్ లోకి వస్తుందని అని చెబుతున్నాయి. మరి అధికారం ఎవరికొస్తుందో తెలుసుకోవాలంటే  డిసెంబర్ 11 వరకు వేచి చూడాల్సి ఉంది.  
 

Photo Gallery