BREAKING NEWS

విశాఖ ఉత్సవ్.... మన ఉత్సవ్....


ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది పర్యాటకులు విశాఖ అందాలను చూసేందుకు నిత్యం నగరానికి వస్తుంటారు. ఎన్నిసార్లు వచ్చినా... ఎంత సేపు చూసినా తనివి తీరని అందం మన స్మార్ట్ సిటీ సొంతం.   ఇంతటి అందమైన నగరానికి మరింత సొబగులు అద్దడానికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం... అందులో భాగమే విశాఖ ఉత్సవ్... 1997 చంద్రబాబు నాయుడి పాలన నుంచి నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవ్ ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతూ ఉంది... ఎంతో మంది టూరిస్ట్ లని అట్రాక్ట్ చేస్తోంది.... ఒక్కో సంవత్సరం ఒక్కో రకంగా ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. కేవలం విశాఖ ఉత్సవ్ చూడడం కోసమే ఇతర ప్రాంతాలు నుంచి విశాఖ వస్తుంటారు...

          మనం ఎప్పుడు చూడని పువ్వులు, విదేశాల్లో తప్ప మన రాష్ట్రంలో కనిపించని అందమైన ఫ్లవర్స్... రోజూ మనం చూసే పువ్వుల సరికొత్త ఆకారాలు.. చూస్తూ మైమరచిపోవచ్చు... ఇది అంతా ఎక్కడా అనుకుంటున్నారా... మన విశాఖ ఉత్సవ్ లోనే... సిటీ సెంట్రల్ పార్క్ లో ఏర్పాటు చేసిన ఈ ఫ్లవర్ షో నుంచి ప్రజలు చూపు తిప్పుకోలేరు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.  మూడు రోజుల పాటు జరిగే ఈ విశాఖ ఉత్సవ్ వేదికగా ఎంతో మంది టాలెంట్ ఉన్న కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పండుగ సంబరాలు భాగంగా బీచ్ మొత్తం సందర్శకులతో రద్దీగా మారిపోయింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా విశాఖ ఉత్సవాలు ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు... కాసేపు కళాకారుల ప్రదర్శన కూడా చూశారు... విశాఖలో , చుట్టుపక్కల ప్రాంతాల్లో దాగున్న కళాకారులను వెలికి తీసి వారిని ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ విశాఖ ఉత్సవ్ లక్ష్యం. దానికి తగ్గట్లుగానే ప్రతి సంవత్సరం ఎంతో మంది లోకల్ టాలెంట్ కు అవకాశాలు కల్పిస్తూ వారికి గుర్తింపు వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. వీరితో పాటు స్టార్ అట్రాక్షన్ కూడా ప్రతి సంవత్సరం కనువిందు చేస్తున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో సంగీత కచేరీ, హీరో హీరోయిన్స్ స్పెషల్ అపిరియన్స్ తో ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తున్నారు. 

                  కేవలం ఇవి మాత్రమే కాదు. వివిధ ప్రాంతాలకు చెందిన రకరకాల ఫుడ్ ఐటమ్స్, గేమ్ షోస్, ఫ్లవర్ షో, రాష్ట్రంలోని వివిధ ప్రముఖ ఆలయాల నమూనా చూపరులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. మూడు రోజుల పాటు సాగే. ఈ ఉత్సవంలో ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం తో అలరిస్తూ ఉంటారు. మొదటి రోజు వైఎంసియే నుంచి ఉత్సవ కార్నివాల్ ప్రారంభించి ఆర్కే బీచ్ లోని ప్రధాన్ వేదిక వరకు భారీ ర్యాలీ గ వస్తారు. కార్నివాల్ లో వివిధ కర్మాగారాలకు చెందిన శకటాలు, సాంస్కృతిక నృత్యాలు, పులి వేషాలు, డప్పు వాయిస్తూ అంగ రంగ వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం ప్రారంభం అయ్యే అసలు కార్యక్రమం సమయానికి బీచ్ రోడ్డు మొత్తం మిరుమిట్లు గొలిపే లైటింగ్ తో నిండిపోతుంది. ఎలాంటి వారు అయినా ఒక్కసారి ఈ ఉత్సవ్ కు వస్తే ఇక అక్కడి నుంచి కదలాలి అనిపించదు. 

                       1997 లో ప్రారంభం అయిన ఈ ఉత్సవం 2014లో హుడ్ హుడ్ కారణంగా చిన్న బ్రేక్ పడింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకూ క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఎంతో మందికి ఉపాధి , ఎంతో మందికి వినోదం అందిస్తున్నారు ... 


 

Photo Gallery