BREAKING NEWS

క్రిస్మస్ 2020 : ఈ పండుగ చరిత్ర, ప్రత్యేకత ఇదే..!

క్రిస్మస్ అంటే ఎక్కడ చూసినా లైట్లతో కళకళల్లాడిపోతుంది. కుటుంబమంతా కలిసి పిల్లాపాపలతో సరదాగా ఈ పండుగను చేసుకుంటారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ ని డిసెంబర్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే అసలు క్రిస్మస్ అంటే ఏమిటి..?, ఎలా జరుపుకుంటారు..?,  దానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి...? ఇలా అనేక విషయాలు మీ కోసం.. మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా చదివేయండి..
 
క్రిస్మస్ పండుగ ఎందుకు జరుపుకుంటారు?
 
ఏసుక్రీస్తు జన్మించిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ సమయంలో చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం,  జీసస్ పుట్టినప్పటి నుండి కరుణామయుడు, దయామయుడు గా క్రైస్తవులందరి ఆరాధనలు అందుకుంటున్నాడు. ఈ పర్వదినాన్ని క్రైస్తవులందరూ ఎంతో ప్రత్యేకమని భావించి కొలుస్తారు. అయితే ఏసుక్రీస్తు పుట్టి ఇప్పటి వరకు సుమారు రెండు వేల ఏళ్ళు దాటింది అని చరిత్ర ద్వారా మనకి తెలుస్తోంది. 
 
క్రిస్మస్ పండుగ రోజు నాడు క్రైస్తవులు ఏం చేస్తారు..? 
 
క్రైస్తవులందరూ ఎంతో ఆనందంగా అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. సర్వసాధారణంగా క్రిస్మస్ ట్రీ, కేక్స్, డాన్స్లు, బహుమతులు మొదలైన వాటితో ఘనంగా జరుపుకుంటారు. మరి ఈ పండుగ గురించి పూర్తిగా చూస్తే... ఈ పండుగ నెల రోజుల ముందు నుండే ప్రారంభమవుతుంది. ఈ సమయంలో క్రైస్తవులు తమ ఇళ్ళను, చర్చిలను అందంగా అలంకరిస్తారు. ప్రతి ఒక్కరి ఇళ్లల్లో స్టార్ పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు. రంగు రంగుల లైట్లు, క్రిస్మస్ ట్రీ లు ఏర్పాటు చేస్తారు. ఇది నిజంగా ఈ పండుగ యొక్క ప్రత్యేకత.
  
 క్రిస్మస్ పండుగ:
 
ఈ నెల రోజులు కూడా ఎక్కడ చూసినా లైట్లు, జనం, మంచి సందడి తెస్తుంది. ఈ పండుగ సమయంలో చాలా మంది బహుమతులు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. దీని కారణంగా ఈ పండుగ వేళల్లో చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా కూడా ఉంటారు. మనదేశంలో క్రిస్మస్ పండుగను మతాలకతీతంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ప్రతి ఒక్కరు విషెస్ చెప్పుకోవడం అనేక చోట్ల పిల్లలు పెద్దలు కలిపి పార్టీ చేసుకోవడం మనకి తెలిసినదే. క్రిస్మస్ అలానే న్యూ ఇయర్ సందర్భంగా కూడా పార్టీని జరుపుకుంటారు. ఈ సంప్రదాయం నిన్న మొన్న వచ్చినది కాదు. ఎన్నో ఏళ్ళ నుంచి ఇలా సాగుతున్నది. ఇలా జరుపుకోవడానికి గల కారణం ఆనందంలోనే పరమార్థం ఉందని ప్రతి ఒక్కరు నమ్ముతారు.
 
శాంటా తాత:
 
శాంటా  తాత పేరు చెప్తే చిన్న పిల్లలు సైతం ఆనందంగా ఉంటారు. సెలబ్రిటీలు కూడా బయట శాంటా  తాత లాగ రెడీ అయి పిల్లలకి బహుమతులు అందిస్తారు. క్రిస్మస్ టైం లో శాంటా వచ్చి ఆశ్చర్యపోయే గిఫ్ట్లు తెస్తాడు అని పిల్లలు ఎదురు చూస్తారు. చాలా చర్చిలలో, విద్యాసంస్థల్లో శాంటా తాత లాగ వేషం వేసుకుని సరదాగా ఆడుకుంటారు. శాంతి, స్నేహానికి ప్రతీక శాంటా అని నమ్ముతారు ప్రజలు. ఎందుకంటే అందరిలోనూ తాను ఆనందం నింపుతాడు కనుక. అలాగే ఎంతో మంచి మనసుతో మెప్పిస్తాడు.  అందుకే అందరి ముఖంలోనూ ఆనందం శాంటా తాత వస్తే కలుగుతుంది.
 
ఏసు జననం, పేరు వెనుక కారణం:
  
ఒక రోజు మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కనబడి ఓ మేరీ నీవు దైవ అనుగ్రహం పొందావు. కుమారునికి జన్మనిస్తావు అది చెప్తుంది. అంతే కాదు పుట్టే బిడ్డకి ఏసు అని పేరు పెట్టాలని... అతను దేవుని కుమారుడు అని తెలియజేస్తుంది. అయితే ఏసు అంటే రక్షకుడు అని అర్థం. ఆ తర్వాత ఆ దేవదూత చెప్పిన విధంగానే మేరీ ఏసు కు జన్మనివ్వడం జరుగుతుంది.  ఆ తర్వాత ఒకసారి దైవదూత జోసఫ్ కలలో కనిపించి  నీవు యేసుని విడిచి పెట్టకు ఆమె దేవుని బలంతో గర్భం దాల్చింది. కనుక ఆమెకు పుట్టే బిడ్డ దేవుని బిడ్డ అని చెప్తుంది.
 
తను నమ్మిన ప్రజలందరినీ వాళ్ళ పాపాల నుండి విముక్తి కలిగిస్తాడు అని కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. ఆ మాటలు విన్న జోసెఫ్ అప్పటి నుంచి మేరీనీ ప్రేమతో ఆదరించాడు. అదే రాజు ఆదేశాల మేరకు జోసఫ్ మేరీలు తమ స్వగ్రామమైన బేత్లెహామ్ వెళతారు. అయితే వాళ్ళు అక్కడికి వెళ్లేసరికి వారికి ఉండడానికి చోటు దక్కదు. చివరకు ఎలాగో లాగ ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం కల్పించాడు.

మేరీ అక్కడే ఏసుకు జన్మనిచ్చింది. ఆ రాత్రి ఆ ఊరికి ప్రక్కనున్న పొలాల్లో కొందరు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు ఆ సమయంలో ఆకాశం నుండి ఒక దేవత దిగివచ్చింది. ఆకస్మాత్తుగా వెలుగు రావడంతో గొర్రెలకాపరులు భయపడ్డారు. అప్పుడు దేవత మీరు భయపడొద్దు, శుభవార్తను చెప్పడానికి వచ్చాను. ఈరోజు లోక రక్షకుడు పుట్టాడు మీ అందరికీ ప్రభువు అని తనకు సంబంధించిన ఆనవాళ్లను చూపించడం జరుగుతుంది. ఇలా దేవుని వరంతో యేసు జన్మిస్తాడు.
 
క్రీస్తు పుట్టిన ఈ శుభదినం మీ కుటుంబంలో అందరికీ ఆరోగ్యం, ఆనందం కలుగజేయాలని కోరుకుంటూ.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు...