BREAKING NEWS

వింటర్ క్యాంపింగ్ కి సరైన ప్రదేశాలు ఇవే..!

దూర ప్రయాణాలు చేయడం చాలా మందికి ఇష్టం. అయితే దూర ప్రయాణాలు చేసేవారికి క్యాంపింగ్  కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అంతే కాదు క్యాంపింగ్   అనేది మళ్ళీ రిఫ్రెష్ చేస్తుంది. అలానే ఉత్తేజ పరుస్తుంది. మీకు నచ్చిన వారితో క్యాంపింగ్  కి  వెళ్లే సమయం దొరికితే ఆ ఆనందమే వేరు.. చల్లని గాలులు, వెచ్చని మంటలు అబ్బా... నిజంగా ఊహించుకుంటేనే చాలా బాగుంటుంది కదా ...! అలానే మీ ప్రయాణాన్ని కూడా మరింత అందంగా మారుస్తుంది క్యాంపింగ్. మీ స్నేహితులతో, కుటుంబ సభ్యుల తో క్యాంపింగ్ చేస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. 
 
నిజంగా అది మరుపు రాని క్షణాలులా మారిపోతే బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా మందికి  క్యాంపింగ్ అనేది కేవలం వేసవి కార్యకలాపంగా మాత్రమే భావిస్తారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి అది ఏమిటంటే..?  ఏ సీజన్లోనైనా క్యాంపింగ్ చాలా బాగుంటుంది. శీతా కాలం లో కూడా మరింత అద్భుతంగా ఉంటుంది. అయితే మరి భారత దేశం లో  శీతాకాల క్యాంపింగ్స్ ప్రదేశాలు కూడా ఉన్నాయి మరి వాటి వివరాలు ఏంటో తెలుసుకుని ఇప్పుడే క్యాంపింగ్ కి బయలుదేరండి.
 
మనాలి:
 
మనాలి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే క్యాంపింగ్ గురించి కూడా చూడండి వివరా ల్లోకి వెళితే.. ఇక్కడ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచు తో కప్పబడిన పర్వతాలు మరియు బ్లూ స్కై బ్యాక్ డ్రాప్ తో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎంతో అందంగా కూడా ఉంటుంది ఇది భారత దేశం లో పర్యాటకులకు, ప్రయాణికులకు కూడా ట్రెకింగ్ వంటి వాటితో ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనాలి లో ఉచిత కంపెనీతో పాటు ఏ ప్రదేశం లో అయినా గుడారాలు వేసుకోవచ్చు.
  
సోనమార్గ్
  
ఈ ప్రదేశం కూడా తప్పక చూడ వలసిన ప్రదేశాల లో ఒకటి. శీతాకాలం లో ఈ ప్రదేశం లో  క్యాంపింగ్ ఖచ్చితంగా  మంచి అనుభవాన్ని ఇస్తుంది. మీరు వింటర్ హాలిడేస్ ని ఆనందంగా గడపాలని అనుకుంటే ఇక్కడికి వెళ్లాల్సిందే. అద్భుతమైన నీలి ఆకాశం బాగా ఆకర్షిస్తుంది. అలానే ఎంతో అందమైన ఈ ప్రదేశంని మెడోస్ ఆఫ్ గోల్డ్ అని కూడా పిలువ బడుతుంది. ఉత్తమ క్యాంపింగ్ ప్రదేశాల లో ఇది ఒకటి.
 
 జైసల్మేర్:
 
జైసల్మేర్ కూడా చాలా అందమైన ప్రదేశం. ఇది శీతాకాలం లో స్వర్గంలా ఉంటుంది. మెత్తటి ఇసుక, స్వచ్ఛమైన గాలి ఎడారిలో మెరిసే అంతు లేని దృశ్యం మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తుంది. 30 ఎకరాలు ఎడారి మధ్య జైసల్మర్ రాతి పై 21 పెద్ద కాన్వాస్ గుడారాలు ఉన్నాయి ఈ ప్రదేశాన్ని కూడా తప్పక దర్శించాల్సిందే. అప్పుడే దీని అందం గురించి, దీని యొక్క ప్రత్యేకత గురించి మీకు అర్ధం అవుతుంది.
 
ముస్సూరీ
 
అందమైన కొండలు, లోయల తో కలిగి ఉన్న ఈ అందమైన ప్రదేశంని తప్పక చూడాలి కదా..! మరి ఈ పర్వత ప్రాంతం లో ఉన్న తాజా గాలి మరియు అన్యదేశ గ్రామాల తో ముస్సోరి శిబిరం ఒక మాయ ప్రదేశంగా మారడం జరిగింది. అటువంటి ఈ ప్రదేశం చెప్పుకోదగ్గది కదా..? ఆకాశం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్రకృతి చూస్తే ఎంతటి బాధలైనా మరిచి పోయేలా ఉంటుంది. 
 
అంజునా :
 
అంజునా కూడా అద్భుతమైన ప్రదేశం. గోవాలోని అంజునా బీచ్ వద్ద క్యాంప్ చేయడానికి చాలా ప్రశాంతమైన ప్రదేశాలు ఉన్నాయి. అందమైన పక్షులు, ఆకాశం, సూర్యాస్తమయం బాగా ఆకర్షిస్తుంది. గోవా లో ఉన్న ఈ అంజునా లో పడే సూర్యరశ్మి చూసి ఇక్కడ రుచికరమైన సి ఫుడ్ ని ఆస్వాదించవచ్చు. శీతా కాలం లో అవకాశం వస్తే ఈ ప్రదేశాన్ని విడిచి పెడితే ఏ మాత్రము బాగోదు కనుక ఈ ప్రదేశాన్ని కూడా తప్పక దర్శించండి.
 
కౌడియాల: 
 
కౌడియాల ఉత్తరాఖండ్ గంగా నది ఒడ్డున ఉంది మరియు థ్రిల్  కోరుకునే వారికి మరియు సాహస ప్రియులకు ఈ ప్రదేశం సరైనది. మీరు విశ్రాంతి తీసుకోవాలంటే తప్పకుండా ఈ ప్రదేశానికి వెళ్లాలి.  మీ కోసం సరైన వాతావరణాన్ని కలిగి ఉంది. అద్భుతమైన వీక్షణల కోసం టెంట్ హాకీ మరియు మీకు నచ్చినప్పుడు గంగా నది వెంట షికారు చేయవచ్చు. మీరు ఇక్కడ రివర్ రాఫ్టింగ్ లేదా ట్రెక్కింగ్ కూడా ప్రయత్నించ వచ్చు. నిజంగా ఎంతో అద్భుతమైన ఈ ప్రదేశాలని ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సినవి.
  
స్పితి వ్యాలీ:
 
 స్పితి వ్యాలీ కూడ చూడాల్సిన ప్రదేశం.
జన సమూహాల నుండి వందల మైళ్ళ దూరం లో ఉన్న స్పితి వ్యాలీ అద్భుతమైన శిబిరం, ఇక్కడ మీరు మంచు పర్వతాలు, ఆకుపచ్చ పచ్చిక భూములు మరియు నిర్మలమైన రాత్రులు చూడడానికి బాగుంటుంది. ఈ శీతాకాలంలో మీరు స్పితి లోయను సందర్శిస్తే, అద్భుతమైన ఎర్రటి సూర్యుడు హోరిజోన్లో నెమ్మదిగా మునిగి పోతున్నట్లు చూడవచ్చు.