BREAKING NEWS

అప్పన్నపల్లి ఆలయ చరిత్ర, విశేషాలు తప్పక చూడాల్సిందే...!

మన ఆంధ్రప్రదేశ్ లో అనేక ఆలయాలు ఉన్నాయి. అలానే పురాతన ఆలయాల కి ప్రాముఖ్యత ఎక్కువ అని మనకి తెలుసు. అటువంటి ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు చాలా ఉన్నాయి. ఇటువంటి ఆలయాలని ప్రతి ఒక్కరూ తప్పక దర్శించాలి. అయితే ఈ ఆలయాల విషయంలో కి వచ్చే సరికి వీటి చరిత్ర దేవస్థానం విషయాలు ఇలా అనేక విషయాలు తప్పక తెలుసుకోవాలి.... మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో పురాతన ఆలయమైన అప్పన్నపల్లి ఆలయం గురించి ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి.
 
అప్పనపల్లి ఊరు :
 
అప్పనపల్లి తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన మామిడికుదురు నుండి 5 కిలో మీటర్ల దూరంలో ఉంది. సమీప పట్టణమైన అమలాపురం నుండి కేవలం పది కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం కలదు. మారుమూల ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఈ ఊరికి అప్పనపల్లి అనే పేరు ఎందుకు వచ్చిందంటే..?  వాయువేగుల అప్పన్న అనే ఋషి ద్వారా ఈ పేరు పెట్టడం జరిగింది ఆ ఋషి ఇక్కడ లోక కళ్యాణార్ధం తపస్సు చేశాడు. పూర్వ కాలంలో ఈ ప్రదేశంలో బ్రాహ్మణులు వేదాలని వల్లె వేస్తూ ఉండేవారని ప్రతీతి. ఇక్కడ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు రెండు వెంకటేశ్వర దేవస్థానంలు ఉన్నాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని తూర్పు భారతదేశంలో బాలాజీ అని పిలుస్తారు. పూర్వము ఉన్న దేవస్థానమును కళ్యాణ వెంకటేశ్వరుడు అని పిలుస్తారు ఈ దేవస్థాన నిర్మాత మొల్లేటి రామస్వామి. ఈయన ఒక కొబ్బరి వర్తకుడు ఆయన కీర్తిశేషులు శ్రీమతి వాయువేగుల సీతమ్మ గారి ఇంట్లో కొబ్బరి వర్తకము చేయసాగెను.
 
అప్పనపల్లి ఆలయ విశిష్టత: 
 
ఆంధ్రప్రదేశ్ లో  వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎన్నో ఉన్నా తిరుపతి లో కొలువైన వెంకట చలపతి ఆలయం దేశం లోనే కాదు ప్రపంచం మొత్తం మీద భక్తులు తిరుపతికి వెళ్లి క్యూ కడతారు. అయితే మరి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఆలయానికి దగ్గర లక్షణాలు కలిగిన ఆలయాల్లో మరో రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ద్వారకా తిరుమల అయితే మరొక ఆలయం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అప్పనపల్లి. నిజంగా ఎంత గొప్ప విశేషం కదా..! వెంకటేశ్వరస్వామి కలియుగ ప్రత్యక్ష దైవం.. భక్తుల కష్టాలు పోగొట్టడంలో మరియు వెంకటేశ్వర నామాలు కి ఈయన సుప్రసిద్ధుడు. 
 
అప్పనపల్లి ఆలయ విశేషాలు: 
 
భగవంతుడు తనను దర్శించడానికి వచ్చిన వాళ్లనే కాదు.. రాలేక పోయే వారి కోసం కూడా తాపత్రయ పడతాడు. ఇలా శ్రీనివాసుడు తన భక్తుడి కోసం తరలి వచ్చిన క్షేత్రమే ఈ అప్పనపల్లి ఎంత మహిమ కదా..?  ప్రాచీన కాలంలో అప్పన్న అనే భక్తుడు స్వామి వారి గురించి ఈ ప్రదేశం లో తపస్సు చేయడం వల్ల ఈ గ్రామానికి పేరు వచ్చింది అని మనం చెప్పుకున్నాం. ఇదిలా ఉండగా ఈ పుణ్య క్షేత్రానికి స్వామి వారు రావడానికి కారకుడు రామస్వామి అనే భక్తుడు. తాను దాచిన డబ్బుతో తిరుమల వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. అయితే తనకి వయసు పైబడిన కారణంగా ఆయన తిరుమల వెళ్లలేక ఆవేదన చెందాడు.
 
దీనితో త్వరలోనే శ్రీనివాసులు ఆ గ్రామానికి వస్తున్నట్లు కలలో ఆయనకి వెంకటేశ్వర స్వామి  చెప్పారు. ఇలా వెంకటేశ్వర స్వామి వారి ఆదేశం మేరకు ఈ ఆలయం ఇక్కడికి రావడం జరిగింది రామస్వామి సంతోషంతో పొంగిపోయాడు. తన కొబ్బరికాయల దుకాణంలో  స్వామివారి నిలువెత్తు చిత్రపటం ఉంచి పూజించడం మొదలు పెట్టాడు. ఇప్పటికి కూడా ఆలయంలో ఆ చిత్ర పటం ఉంది. స్వామి వారి ఆదేశాల మేరకు ఈ గ్రామం లో ఆలయ నిర్మాణం 1960 వ సంవత్సరంలో జరిగింది 1960 నుంచి 1980 వరకు ఈ ఆలయ నిర్వహణ రామస్వామి ఆధ్వర్యంలో సాగింది.
  
అప్పనపల్లి బ్రహ్మోత్సవాలు :
 
వివిధ పర్వ దినాల లోను, జేష్ఠ మాసంలో 5 రోజుల పాటు బ్రహ్మోత్సవం జరుగుతాయి. అధిక సంఖ్య లో భక్తులు వచ్చి ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. వసతి సత్రాలు, నిత్యాన్నదానం, కళ్యాణమండపం ఇలా యాత్రికులకు కావలసిన సదుపాయాలు సమకూర్చారు. ఇక్కడే చాలా మంది వివాహాలు కూడా జరుపుకుంటారు. 
  
అప్పనపల్లి ఆలయ గోపురం: 
 
ఎటు చూసినా పురాణ సంబంధమైన దృశ్యాల తో కూడిన వివిధ దేవతా ప్రతిమలు దర్శనమిస్తాయి. గర్భాలయంలో స్వామి బాలాజీగా కొలువై ఉంటాడు. అలానే ప్రత్యేక మందిరాల్లో పద్మావతి దేవి, ఆండాళ అమ్మవారు కూడా ఉంటారు. అమ్మ కన్నా అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి వారిది సున్నిత మనసు, కోరిన వరాలను ఆప్యాయంగా ఇస్తాడు అని భక్తుల నమ్మకం.
 
అప్పనపల్లి ఎలా వెళ్లాలి..?
 
 అప్పనపల్లి కాకినాడకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి 85 కిలో మీటర్ల దూరంలో ఉంది మరియు అమలాపురంకి  35 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడ నుండి ప్రత్యేక బస్సు అప్పనపల్లి వరకు నడుస్తుంది. కాకినాడ నుండి రావులపాలెం మీదుగా కూడా ఈ ఆలయం చేరుకోవచ్చు.
 
అప్పనపల్లికి 35 కిలోమీటర్ల దూరంలో పాలకొల్లు రైల్వే స్టేషన్ ఉంది. రైలు మార్గంలో ప్రయాణించే వారు అక్కడ నుంచి చేరుకోవచ్చు. ఈ ఆలయానికి అతి సమీపంలో ఉన్న ఎయిర్ పోర్ట్  రాజమండ్రి ఎయిర్ పోర్ట్. ఇది ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.