BREAKING NEWS

జామకాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మీకు తెలుసా....?

సాధారణంగా పండ్లు తింటే చాలా ఆరోగ్యమని మనకి తెలుసు. అలానే ఆరోగ్యం అన్నింటి కంటే ముఖ్యం అని కూడా మనందరికీ తెలిసినదే. మన ఆరోగ్యాన్ని బలపరుచుకోవడం చాలా కష్టం. ఆరోగ్యాన్ని బలపరుచుకోవాలంటే దానికి మనం అనేక ఆరోగ్య సూత్రాల్ని పాటిస్తూనే ఉంటాము. పండ్ల వల్ల ఆరోగ్యం పెరుగుతుందని మనకి తెలిసిన సంగతే. అయితే జామ పండు తింటే ఆరోగ్యం వస్తుంది..?  ఈ విషయం లోకి వస్తే జామ పండు వల్ల ఆరోగ్యం బలపడుతుందా మరి దీని కోసం పూర్తిగా చదవండి.
 
చౌకగా దొరికే ఈ జామకాయలకి విలువ చాలా ఉంది. విలువైన పండ్ల లో ఉండే ఈ న్యూట్రీషియన్స్ ఈ జామలో అధికంగా ఉంటాయి గమనించండి. అన్ని కాలాల్లోనూ జామపండ్లు దొరుకుతాయి కాబట్టి దొరికినప్పుడల్లా వీటిని తెచ్చుకుని తినండి. జామకాయ ముక్కల పై మిరియాల పొడి, ఉప్పు చల్లుకుని తింటే ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. జామ పళ్ళ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జామ పళ్ళ తో ఐస్క్రీమ్ సలాడ్లు వంటివి కూడా చేసుకోవచ్చు జామపండు వల్ల రుచి రుచితో పాటు ఆరోగ్యం కూడా.
 
జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
 
జామ పండ్లను ఇష్టపడని వారు ఉండరు. కొందరు పచ్చి జామ కాయ తింటే కొంత మంది పండు జామ కాయలు తింటారు. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ దీనిని ఇష్ట పడతారు. ఉసిరి కాయలకు దీటుగా విటమిన్ సి దీనిలో దొరుకుతుంది. ఇదిలా ఉండగా నిమ్మ, నారింజ లో కంటే 4 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ బి, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటివి మెండుగా ఉన్నాయి. జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్ ఇందులో నిండుగా ఉంది.
 
జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్ ఇందులో నిండుగా ఉంది. మధుమేహం ఉన్న వాళ్లు కూడా ఈ పండ్లు తినవచ్చునని వైద్యులు చెబుతారు. దీన్ని బట్టి జామ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో  మనకి అర్థమైపోతుంది. అలానే  జామ వల్ల బరువు తగ్గవచ్చు. ఎక్కువగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు జామ తీసుకోవచ్చు. ఇది నిజంగా మంచి ఔషధంగా పని చేస్తుంది. జామపండ్లు తింటే ఇట్టే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అలానే ఎక్కువ ఆహారం కూడా తినలేరు. అలానే నీరసం కూడా రాదు. ఒబిసిటీ  తో బాధ పడేవారు తమ ఆహారం తో పాటు ఒక జామకాయ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 
మధుమేహగ్రస్తులకు జామ:
 
మధుమేహగ్రస్తులకు జామ దివ్యౌషధంలా పని చేస్తుంది. నిజంగా సంజీవినిలా ఉపయోగపడుతుంది అని అన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయ లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది.
 
దంతక్షయం :
 
జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. ఒకవేళ చిగుళ్ళు వాపులని తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళు జామ ఆకుల ద్వారా నయం చేసుకోవచ్చు వివిధ రకాల అనారోగాల బారినపడి ఆకలి మందగించి పోయిన వాళ్లకి కూడా జామ ఆకులు ఆకలి పుట్టించగలవు. అంతే కాదు మీ దంతాలు కూడా శుభ్రపడతాయి. ధృడత్వం కూడా చేకూరుతుంది ఇలా ఏమైనా దంత సమస్యలు ఉంటే పరిష్కరించుకోవచ్చు.
 
కీళ్ల నొప్పులకు జామ: 
 
చాలా మంది కీళ్ల వాపు, నొప్పులు వంటి సమస్యల తో ఇబ్బంది పడుతూ ఉంటారు.  అటువంటి వాళ్ళు జామాకులను కొద్దిగా వేడి చేసి వాపులు ఉన్న చోట కట్టు కట్టుకోవాలి. దీని వల్ల కండరాలు గట్టిపడేలా చేస్తుంది. అలానే ఎముకల దృఢత్వానికి జామకాయ లో ఉండే పోషకాలు బాగా సహాయ పడుతుంది.
 
ఎసిడిటీ:
 
ఎసిడిటి ఉన్నవారు రోజుకు ఒక జామ పండు తింటే చాలా మంచిది. కడుపు ఉబ్బరం, కడుపులో మంట నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది కనుక జామకాయ తీసుకోవడం మంచిది.
 
దగ్గు, జలుబుకి జామ:
 
జామ దగ్గు జలుబు జ్వరం ఉంటే కూడా నయం చేస్తుంది. ఐదు నుంచి ఆరు ఆకులు నీటిలో మరగబెట్టి డికాషన్ వాడితే దగ్గు, జలుబు పోతుంది. జామ ఆకుల నుంచి లభించే తైలం యాంటీ ఆక్సిడెంట్ల చర్యలను వేగవంతం చేస్తుంది కాబట్టి ఈ పద్ధతిని అనుసరిస్తే జలుబు దగ్గు జ్వరం తగ్గిపోతాయి.
 
కంటి ఆరోగ్యానికి జామ :
 
కంటి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఈ జామకాయలో విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల ఈ న్యూట్రీషియన్ ఐ సైట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి కంటి ఆరోగ్యం పెంపొందించుకోవడానికి జామని తీసుకోవచ్చు.
 
థైరాయిడ్ కి జామ:
 
జామలో అయోడిన్ లేదు అయితే ఇందులో ఉండే కాపర్ మరియు ఇతర మినిరల్స్ థైరాయిడ్ జీవక్రియలు క్రమబద్దం చేయడానికి హార్మోన్ల ఉత్పత్తికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. కనుక థైరాయిడ్ సమస్యల తో బాధ పడే వారు కూడా జామని తీసుకోవచ్చు.
 
సంతాన ఉత్పత్తికి జామ:
 
జామకాయను బాగా నమిలి తినడం వల్ల శరీరం లో ఫిల్లెట్ బాగా ఉత్పత్తి అవుతుంది దీనివల్ల సంతాన ఉత్పత్తి పెంచే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది.