BREAKING NEWS

పొడిబారిన చర్మాన్ని అందంగా మార్చాలంటే ఈ టిప్స్ పాటించాలి..!

 చలికాలం వచ్చిందంటే చాలు అనేక రకాల ఇబ్బందులు మనకి ఎదురవుతాయి. ముఖ్యంగా గజ గజా వణికి పోవటం, చర్మం పగిలి పోవడం కూడా జరుగుతుంది. దీనితో పాటు ఏ పని చేయాలనిపించదు.  అలానే  ఏమీ తోచక పోవడంతో పాటు బాగా బద్దకంగా ఉంటుంది. అలానే  రోజూ చేసుకునే పనులు సక్రమంగా సాగవు కూడా. ఆ చలికి దుప్పటి కప్పుకొని కాసేపు అలా నిద్ర పోవాలని అనిపిస్తుంది. ఇది కేవలం ఒకరిద్దరికి మాత్రమే  అనిపించేది కాదు. చాలా మందికి ఇలానే అనిపిస్తుంది. అయితే శీతా కాలం లో వచ్చే చల్లని గాలులు ఆహ్లాదంగా ఉన్నా... శీతాకాలం వల్ల చర్మ సౌందర్యానికి కొంత హాని జరుగుతుంది.
 
శీతాకాలం లో పెదవులు, చేతులు, ముఖం, కాళ్లు, పాదాల మీద  తీవ్ర ప్రభావం పడుతుంది. ఇటువంటి సమస్యలకు కచ్చితంగా చెక్ పెట్టాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అంతే కాదు చర్మం ముడతల బారిన కూడా సులువుగా పడే అవకాశం ఉంది. చర్మం పొడిగా మారిపోవడం వల్ల కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే చర్మం పొడిబారి పోకుండా ఉండాలంటే ఈ పద్ధతిని కచ్చితంగా అనుసరించి తీరాల్సిందే. ఇలా కనుక చేస్తే మీ చర్మం పొడిబారడం నుండి బయట పడటమే కాకుండా చర్మ సౌందర్యం మరింత పెరుగుతుంది మరి ఇంక ఆలస్యం ఎందుకు దీన్ని పూర్తిగా చూడండి.  ఇక్కడ ఉన్న పద్ధతుల్ని కనుక అనుసరించారు అంటే కచ్చితంగా నిగారింపు తో పాటు పొడి బారిపోవడం తగ్గుతుంది.
 
వేడి నీళ్ల తో స్నానం చేయడం :
 
చలి కాలం లో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి చాలా మంది వేడి నీటి తోనే స్నానం చేస్తారు. అదే సక్రమైన పద్ధతి. చలి కాలం లో ప్రతి రోజూ స్నానం చేయడానికి ఐదు నుంచి పది నిమిషాలు ఖచ్చితంగా కేటాయించడం మంచిది. అయితే ఎక్కువ సేపు ఇలా స్నానం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే చర్మం నుండి నూనె తొలగిపోయి చర్మం యొక్క తీవ్రతను తగ్గిస్తుంది. కనుక మీరు మరీ వేడి నీళ్లు కాకుండా వెచ్చని నీటి తో స్నానం చేయండి. ఇలా చేస్తే శరీరం లోని తేమ ఎక్కువగా బయటకు పోకుండా ఉంటుంది.
 
పెట్రోలియం జెల్లీ లేదా మాయిశ్చరైజర్: 
 
చర్మం బాగా పొడిబారి పోతే ముందు మాయిశ్చరైజర్ ని అప్లై చేసుకోవడం మంచిది. అలానే మీ చర్మం కనుక బాగా పొడిగా మారిపోతే .. పెట్రోలియం జెల్లీ లేదా ఇతర క్రీమ్‌ను రాయడం వల్ల చర్మం పై గడ్డలు కనిపించడం తగ్గుతుంది. ఇది చాల సులువైన పద్ధతి.  కొద్దిగా పెట్రోలియం జెల్లీ లేదా క్రీమ్ తీసుకొని చర్మం పొడిబారిన చోట రాస్తే దానిని తగ్గించ వచ్చు.  మాయిశ్చరైజర్ వల్ల
మీ చర్మ కణాల మధ్య అంతరాన్ని కూడా తగ్గిస్తుంది మరియు తేమను నిలుపుకుంటుంది. ఇది చర్మాన్ని మంచి స్థితి లో కాపాడుతుంది. కనుక తప్పకుండ దీనిని ఉపయోగించండి. 
 
చర్మం పై దురద వంటివి వస్తే ఏం చెయ్యాలి..? 
 
చర్మం పొడిబారి పోవడమే కాకుండా చలి కాలం లో కొన్ని సందర్భాల్లో చర్మం పై ఎక్కువగా దురద వేస్తూ ఉంటుంది. మీకు కనుక దురద వస్తే..  చర్మం పై గీతలు పడేలా రుద్దకండి. ఇది మాత్రం ముందు గుర్తు పెట్టుకోండి. అలాంటి సమయం లో మాయిశ్చరైజర్ వాడండి. ఇది ఎక్కువ సమయం దురదను నియంత్రిస్తుంది. ఇలా దురద ఉన్న ప్రదేశం లో కోల్డ్ కంప్రెస్లను పూయడం వల్ల దాని నుండి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ఇలా అనుసరించడం ఎంతో ముఖ్యం. 
 
ఆయిల్ తో  స్నానం:
 
చలి కాలంలో కనుక కొబ్బరి నూనె తో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా  చేయడం చాల మంచిది.  చర్మంపై కొబ్బరి నూనెను ఉపయోగించి స్నానం చేస్తే పగుళ్లు తగ్గుతాయి. అలానే చర్మం కూడా నిగారింపుగా తయారవుతుంది. 
 
సన్‌స్క్రీన్ వల్ల ఫలితం: 
 

సన్‌ స్క్రీన్ కూడా బెస్ట్ సొల్యూషన్. దీని మూలం గానే చర్మానికి మంచి ఫలితం కలుగుతుంది. శీతాకాలం మరియు వేసవి రెండింటి లోనూ సన్‌ స్క్రీన్ ఉపయోగించండి. ఇది కూడా సులువైన దారే.
 
 తీసుకోవాల్సిన మరికొన్ని జాగ్రత్తలు:
 
మగవాళ్ళు షేవింగ్ చేసే ముందు, షేవింగ్ క్రీమ్ లేదా జెల్ ను కొన్ని నిమిషాల ముందు ముఖం మీద వేసుకుని కొద్ది సేపటి తర్వాత షేవ్ చేసుకోండి. ఇది ఇలా ఉండగా బట్టల కోసం వాసన లేని డిటర్జెంట్ వాడండి మరియు ఫాబ్రిక్ మృదుల పరికరాన్ని వాడకుండా ఉండండి. అలానే శీతా కాలంలో చికాకు కలిగించే బట్టలని ధరించడం కూడా మానుకోండి.
 
ఇలా కనుక ఈ జాగ్రత్తలని పాటిస్తే ఖచ్చితంగా వింటర్ లో వచ్చే పగుళ్లు తగ్గిపోతాయి. ఇక నుండి పొడిబారిన చర్మాన్ని కూడా అందమైన చర్మంగా మార్చుకోవచ్చు.