BREAKING NEWS

అద్భుతమైన వైద్య గుణగణాలు కలిగిన సపోటా వల్ల కలిగే లాభాలు ఇవే..!

సపోటా పండు తియ్యగా, రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పండును ఇష్టపడతారు. సపోటాకు మరో పేరు చికు. చాలా మందికి ఈ పేరు తెలియదు. కానీ సపోటా అన్న పదం సుపరిచితమే. ఈ పండులో అధిక కేలరీలు ఉంటాయి. దీనినే నోస్ బెర్రీ అని కూడా పిలుస్తారు. ఆరోగ్యకరమైన పండ్లలో దీనిని ఒకటి అని మనం చెప్పవచ్చు. ఈ పండు అనేక పోషకాలని కలిగి ఉంటుంది. దీనిలో ఉండే గుజ్జు వల్ల తేలికగా జీర్ణమైపోతుంది.

అలానే  గ్లూకోజ్ అధికంగా ఉండటం వల్ల శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది. విటమిన్లు, మినరల్స్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. దీనిని మనం జ్యూస్, మిల్క్ షేక్ ఇలా ఏ విధంగానైనా కూడా తీసుకోవచ్చు. అయితే మరి దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మీకు తెలియకపోయి ఉండవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుని తీరాలి. ఎందుకంటే ఒకటి, రెండు కాదు ఏకంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం సపోటా పండు లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడే తెలుసుకోండి. వీటిని కనుక మీరు చూశారంటే తప్పక ఆశ్చర్యపోతారు. 
 
సపోటా వల్ల కలిగే ప్రయోజనాలు: 
 

సపోటా లో పిండిపదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి ఇచ్చే గ్లూకోస్ కూడా దీనిలో ఉంటుంది. కిడ్నీలో ఏర్పడ్డ రాళ్ళను తొలగించడం లో సపోటాకు సాటి లేదని వైద్య నిపుణులు అంటున్నారు. దీనిలో ఉండే విటమిన్- ఏ కంటికి చాలా మంచిది. సపోటాలో ఆరోగ్యానికి మేలు చేసే నియాసిన్, కాపర్, ఐరన్ వంటి మూలకాలు కూడా ఉన్నాయి. సపోటా లోని ఫైబర్లు మలబద్దకం సమస్యలు దూరం చేస్తాయి.
 
దీనిలో  విటమిన్ ఏ మాత్రమే కాదు విటమిన్- బి, విటమిన్ -సి కూడా కలిగి ఉంటాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సపోటా లో క్యాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా లభించడం వల్ల ఎముకలు గట్టిగా ఉంటాయి. గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు సపోటా బాగా మేలు చేస్తుంది. నిద్రలేమి సమస్య తో బాధపడే వాళ్ళు సపోటా తీసుకుంటే చాలా మంచిది. అలానే ఆందోళనతో ఇబ్బంది పడే వాళ్లు కూడా దీనిని తీసుకోవడం చాలా మంచిది. అంతే కాదు నరాల ఒత్తిడిని తగ్గించి ఉపశమనం కూడా కలిగిస్తుంది. ఊబకాయ సమస్యలతో బాధపడే వారికి కూడా సపోటా చాలా మంచిది. డయాబెటిస్, గుండె సమస్యల తో బాధపడే వారు తప్పకుండా వైద్యులను సంప్రదించిన తర్వాతే ఈ  పండు తినాలి. అంతే కాదండి సపోటా తీసుకోవడం వల్ల వృద్ధాప్యం లో వచ్చే అంధత్వ నివారణకు కూడా చాలా మంచిది అని డాక్టర్లు సూచించారు.
 
కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సపోటా:
 
సపోటా విటమిన్- ఇ కలిగి ఉంటుందని మనం చెప్పుకున్నాం. అయితే పరిశోధనల ప్రకారం విటమిన్-ఏ వృద్ధాప్యంలో కూడా కంటి చూపును మెరుగుపరుస్తుంది. అందువల్ల మంచి దృష్టిని పొందడానికి మీరు సపోటా పండు తప్పకుండా తీసుకోండి.
 
యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ సపోటా:
 
ఇది మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పని చేస్తుంది. పేగు శోధము, చికాకు పెట్టే పేగు వ్యాధి, పొట్టలో పుండ్లు వంటి వ్యాధులు నివారణ ద్వారా పరిస్థితిని మెరుగు పరచడానికి సహాయపడుతుంది. మీకు కలిగే ఎటువంటి వాపులు అయినా నొప్పులు అయినా సపోటా బాగా తగ్గిస్తుంది. తద్వారా మంటను కూడా ఇది తగ్గిస్తుంది. 
 
రక్తస్రావ నిలుపుదలకు తోడ్పడే గుణం :
 
సపోటా మూలిక రక్తస్రావాన్ని ఆపుతుంది. అంటే రక్తస్రావం నిలుపుదలకు తోడ్పడే లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ఈ మూలిక దెబ్బలు తగిలినప్పుడు, మొలలు వచ్చినప్పుడు రక్తస్రావాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
 
మానసిక ఆరోగ్యం :
 
సపోటా పండు వల్ల అన్ని ఇన్ని కాదు ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు ఇప్పటికే మనకు అర్థం అయి ఉంటుంది. అయితే మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒత్తిడి తగ్గించడం లో సపోటా ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిద్రలేమి, ఆందోళన కూడా ఇట్టే తరిమికొట్టేస్తుంది.
 
మూత్రపిండాల్లో రాళ్ళు తొలగిస్తుంది: 
 
సపోటా విత్తనం పొడి మూత్రపిండాల్లో, పిత్తాశయంలో రాళ్లను తొలగించడానికి బాగా సహాయ పడుతుంది. తద్వారా మూత్ర విసర్జన కారకంగా పనిచేస్తుంది. అలానే ఇది మూత్రపిండాల వ్యాధుల నుంచి రక్షణ కూడా అందిస్తుంది.
 
బరువు తగ్గడంలో :
 
బరువు తగ్గడానికి కూడా సపోటా బాగా పని చేస్తుంది. సపోటాపండు తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఎంజైమ్ స్రావాన్ని నియంత్రించడం ద్వారా ఊబకాయం నిరోధిస్తుంది. తద్వారా జీవక్రియ నియంత్రిస్తుంది. 
 
సపోటా పండు చర్మం కాంతివంతంగా ఉండడానికి సహాయపడుతుంది. అలానే జుట్టును మృదువుగా చేస్తుంది, జుట్టు రాలడానికి మంచి చికిత్స. చర్మంమీద లేపనం లాగ ఇది పనిచేస్తుంది. ఫంగల్ పెరుగుదలను అరికడుతుంది. చూసారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మరి ఇంకెందుకు ఆలస్యం ప్రతి రోజూ మీ డైట్ లో సపోటా పండును ఏదో ఒక రూపంలో తీసుకోండి. ఇలా చేస్తే అనేక సమస్యలకు చెక్ పెట్టేయొచ్చు.