BREAKING NEWS

సూను సూద్ ''ఐ యామ్ నో మెస్సయ్య'' పుస్తకంలో మదనపల్లి రైతు ప్రస్తావన

సోను సూద్ అంటే మనకు గుర్తొచ్చేది సినిమాలు కాదు. కరోనా  సమయంలో అతను చేసిన సహాయం, సేవ. సోనూసూద్ ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయపడ్డాడు. పరోపకారం ఇదం శరీరం అన్నట్టు నడుచుకున్నాడు. నిజంగా మనిషి అనడం కంటే మహాత్ముడు అనడంలో ఏ మాత్రము సంశయము లేదు. తీవ్ర ఇబ్బందులు పడిన పేదలకు, వలస కార్మికులకు ఎంతో సహాయం చేశాడు. ఇటువంటి మహాత్ముడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వివిధ రాష్ట్రాలకు బస్సులు, విమానాలను ఏర్పాటు చేయడం.. విద్యార్థులకు, పేదలకు చేయూతనివ్వడం..

వలస కార్మికులను అక్కున చేర్చుకుని వారి పాలిట ఆపద్బాంధవుడు అవ్వడం.. ఇలా ఎన్నో విధాలుగా ప్రజలకు సహాయం చేసి ప్రశంసలు అందుకున్నాడు. రీల్ లైఫ్ లో విలన్ అయినా  రియల్ గా హీరో అయ్యాడు. అయితే వలసదారులు సోనుకి మెస్సయ్య అని ప్రశంసలు ఇచ్చారు. మెసయ్య అంటే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం, అలా ఆదుకోవడానికి వచ్చిన వ్యక్తిని మెస్సయ్య అని అంటారు. అందుకే సోనూసూద్ ఆటోబయోగ్రఫీ కి ఆ పేరును ఖరారు చేశారు. మరి ఐ ఆమ్ నాట్ మెస్సయ్యా లో సోను ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి అవేమిటో ఇప్పుడే చూసేయండి.
  
చిత్తూరు రైతు నాగేశ్వరరావుపై సోను ప్రస్తావన:
 
సోనూసూద్ విలన్ గా మనందరికీ తెలుసు. అయితే కష్టాలని ఎంతో ఇష్టంగా మార్చేశాడు. ఈ పుస్తకంలో చిత్తూరు రైతు నాగేశ్వరావు గురించి సోను ప్రస్తావించారు. అయితే తన కుమార్తెలను కాడెద్దులుగా మార్చి వ్యవసాయం చేస్తున్న ఒక వీడియో చూసి చలించిపోయాను అని అన్నారు సోనూసూద్. అయితే గతంలో దీనికి పరిష్కారంగా ట్రాక్టర్ పంపించడం మనకి తెలిసినదే. ఈ సందర్భం గురించి సోనూసూద్ ఏమంటున్నాడు అంటే..? గంటలు కాకుండా ఎకరాల్లో పని చేసేవారికి అంకితం. ఇవి నా స్వంత కవిత్వం కాదు నేను వాటిని ఒకసారి చదివినట్లు గుర్తు అరువు తెచ్చుకున్నవి అయినా ఆ జ్ఞాపకాలు తిప్పి చూస్తే 2020 జూలై 25 శనివారం నాకు కనిపించిన దృశ్యం గురించి ఇలా ఆలోచించాను అని అన్నారు.
 
కృష్ణమూర్తి అనే ఒక జర్నలిస్టు  తనలో  చైతన్యం తీసుకు వచ్చినందుకు ఆయనకు రుణపడి ఉంటానని చెప్పడమే కాక వీడియోను అప్లోడ్ చేసి చిత్తూరు జిల్లా లోని మదనపల్లిలో ఒక టమోటా రైతు నాగేశ్వర గురించి ట్వీట్ చేశాడు. అయితే రైతు సాంప్రదాయ ఎద్దులకు బదులుగా తన పొలం దున్నడానికి కుమార్తెను ఉపయోగిస్తున్నారు ఇది చాలా బాధ కలిగించిందని చెప్పారు. ఆ అమ్మాయిలు బడిలో ఉండాలి కానీ నాగలి లాగకూడదు అని చెప్పారు. ఇది మహమ్మారి కరోనా వల్లే జరిగిందని అయినా నన్ను దిగజార్చడం ఇష్టపడలేదు ఆ దృశ్యం నా మైండ్లో ఫీడ్ అయ్యిందని చెప్పడం జరిగింది.

పేదరికంతో బాధ పడుతున్న ఆ తండ్రి తన కుమార్తెతో పొలం దున్నుతుంటే తన తల్లి ఎరువులు జల్లుతుంది. అనేక మైళ్ల దూరం నుంచి సోనూసూద్ తాపత్రయ పడ్డాడు. అయితే ఈ రైతు కోసం తెలుసుకోవడానికి అక్కడ ఉన్న తెలిసిన వ్యక్తిని సంప్రదించాలని కొన్ని గంటల్లో వాళ్ళు వివరాలు పంపారని సోనుసూద్ చెప్పాడు. అయితే దీని ద్వారా అతని పేరు నాగేశ్వరరావు అని సోషల్ మీడియాలో కంటపడ్డ ఆ దృశ్యం చిత్తూరుకు దగ్గరగా ఉన్న ఒక గ్రామంలోనిది. 
 
అక్కడ ఉన్న కొన్ని గ్రామాల్లో షూటింగ్ కి వెళ్ళినా చిత్తూరు జిల్లాకు వెళ్ళలేదు అని చెప్పాడు. అయితే జూలై 25 రాత్రి 9:30 గంటలకు ఆంధ్రకు చెందిన నా స్నేహితుడు మరిన్ని వివరాలు అందించారు. అతని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు అని చెప్పాడు. నాగేశ్వరావు తో వ్యక్తి గతంగా ఫోన్ చేసి మాట్లాడాను మదనపల్లె లోని టీ స్టాల్ నడుపుతున్నాని చెప్పాడు. అయితే అనుకోకుండా మహమ్మారి దెబ్బ కొట్టడం కారణంగా ఇలా ఆవేదన చెందుతున్నాడు అని నాగేశ్వరరావు తెలియజేశాడు.
 
అతని కుటుంబ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అప్పటికి తెలుసుకున్నాను అని చెప్పాడు. సోను సూద్ వెంటనే అతనికి రెండు ఎద్దులు ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశాడు ఇది విన్న నాగేశ్వరావు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అయితే తిరుపతిలో ఎద్దులు అందుబాటులో ఉన్నాయి అని చెప్పి తిరిగి కొద్దిసేపటికి ఫోన్ చేశాడు. పెద్దగా ఆలోచించకుండా ఎద్దులు కొనడానికి డబ్బు పంపుతానని నాగేశ్వరరావుకి హామీ ఇచ్చాను అని సోను చెప్పడం జరిగింది. కానీ కుటుంబ సమస్యకి  పరిష్కారం ఎద్దుల కాదు అని  ట్రాక్టర్ అని గ్రహించాను అని సోనూ చెప్పాడు.
 
పెంగ్విన్ రాండం హౌస్ ఇండియా రాసిన ఈ ఆత్మకథలో సోనూ భాయ్ తన అనుభవాలని పొందుపరిచారు. ఇంతకీ దీనికి ''ఐ ఆమ్ నో మెస్సయ్య''  అని పేరు పెట్టడం విశేషంగా మారింది. ప్రజలు చాలా జాలి, దయ కలవారు అని సోనూ స్పందించాడు. ఇలా వారి అభిమానంతో నాకు మెస్సయ్యా అని పేరు పెట్టారు కానీ నేను దేవుడిని కాదు నా మనసుకు తోచింది మాత్రమే చేస్తాను అని అన్నాడు. అయితే తన అనుభవించిన పరిస్థితులు ఎలా జీవితాన్ని మార్చేశాయి అనేది ఈ పుస్తకంలో ఆసక్తికరంగా ఉంటుంది అని అన్నారు సోనూసూద్. ఇటీవలే ఈ పుస్తకం విడుదల కూడా అయింది. వాటిలోని మదనపల్లి రైతు గురించి ప్రస్తావన జరిగింది.