BREAKING NEWS

గోధమ గడ్డి వల్ల కలిగే ప్రయోజనాలు.... ఇంట్లో పెంచే పద్ధతి ఇదే...!

గోధుమ గడ్డి ఆరోగ్యానికి చాలా మంచిది. గోధుమ గడ్డిని జీవం కలిగిన ఆహారంగా పేర్కొనవచ్చు. దీని వల్ల ఉన్న లాభాలు అన్ని ఇన్ని కావు. దీనిలో విటమిన్- ఇ తో పాటు ఇతర పోషకాలు కలిగి ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది గోధుమ గడ్డి రసం. దీనిని ఆరోగ్యప్రదాయిని అని చెప్పవచ్చు. అనేక రోగాలకు నివారిణిగా దీనిని ఉపయోగించవచ్చు. ఒక గ్లాసు రసం లో ఏ విటమిన్, బి కాంప్లెక్స్, సి మరియు కె విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సెలీనియం, సోడియం, సల్ఫర్, కోబాల్ట్, జింక్, క్లోరోఫిల్ ఉంటాయి.  ఒక గ్లాసు రసాన్ని సేవిస్తే చర్మం పై ముడుతలు రావు. ముడుతలు మటుమాయ మవడమే కాక చర్మం కాంతివంతంగా, ప్రకాశ వంతంగా ఉంటుంది. చూసారా..! ఎంత ఆరోగ్యమో మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం గోధుమ గడ్డి వల్ల కలిగే లాభాలు కోసం పూర్తిగా చదివేయండి.
 
గోధుమ గడ్డి వల్ల కలిగే ప్రయోజనాలు:
 
గోధుమ గడ్డిని  తీసుకోవడం వల్ల క్లోరోఫిల్ ని అందిస్తుంది. గోధుమ గడ్డి రసం తాగడం వల్ల శరీరం లోని విష పూరిత పదార్థాలు బయటకు పంపబడతాయి. అలానే క్యాన్సర్ వ్యాధి పెరుగుదలని గోధుమ గడ్డి నివారిస్తుంది. అలానే అలసట కూడా తగ్గిపోతుంది. గోధుమ గడ్డి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. రక్త శుద్ధి కి గోధుమ గడ్డి దివ్యౌషధం. అంతే కాదు గోధుమ గడ్డి లో కొలెస్ట్రాల్ కూడా ఉండదు. ఒక గ్లాస్ గోధుమ గడ్డి రసం లో 17 ఎమినో యాసిడ్స్, ఫైబర్ ఎంజైమ్స్ ఉంటాయంటే ఎంత ఉపయోగమో కదా...!  గడ్డిని తీసినట్లు దీనిని తీసి పారేయకండి.  గోధుమ మొలకలని న్యూట్రిషనల్ రిజర్వాయర్ గా పౌష్టికాహార నిపుణులు గుర్తించారు.
 
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యూనివర్సల్ ఫార్మసి అండ్ బయో సైన్స్ లో ప్రచురించబడిన ఒక ముఖ్య అధ్యయనం ప్రకారం ప్లేట్లెట్స్ సంఖ్యను పెంచడానికి వీట్ గ్రాస్ ను ఉపయోగిస్తారు అయితే ఇక్కడ గోధుమ గడ్డి ఉపయోగించడానికి గల కారణం ఏమిటి అని అనుకుంటున్నారా..?  దీనికి కారణం దాని లోని క్లోరోఫిల్ అణువుల నిర్మాణం మరియు శరీరం లోని హిమోగ్లోబిన్ నిర్మాణానికి సమానంగా ఉంటుందని చెప్పబడింది. కనుక మీరు ప్రతి రోజూ అర కప్పు గోధుమ గడ్డి రసం తో నిమ్మ రసం తాగడం కొనసాగించండి. నిజంగా దీనిని కనుక అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఒక వేళ మీరు కనుక ఈ జ్యూస్ ని  తాగ లేకపోతే దీనిలో కొంచెం తేనెను కూడా కలుపుకొని తీసుకోవచ్చు. అదే కనుక మీకు అసలు జ్యుస్ ఏ వద్దనుకుంటే మీరు దీనిని చిన్న చిన్న ముక్కలుగా కోసి సలాడ్ చేసుకొని తినవచ్చు. ఇది కూడా మంచి ఫలితం చూపిస్తుంది. 
  
గోధుమ గడ్డిని ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది..? 
 
గోధుమ గడ్డి రసం కనుక పరిమితి దాటి  తాగితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవేమిటి అంటే..?  తలనొప్పి, జీర్ణకోశ వ్యాధులు, పళ్ల రంగు మారడం, మగతగా ఉండడం వంటివి కూడా జరుగుతాయి. మరొక విషయం ఏమిటి అంటే తాజాగా ఉన్నప్పుడు మాత్రమే ఈ గోధుమ గడ్డి రసాన్ని తాగండి. నిలవ ఉంచి తీసుకోకండి. అంతే కాదు ఇది ఆహార ప్రత్యామ్నాయం కాదని గుర్తించండి. కేవలం ఆరోగ్యం కోసం ఆహారం లో భాగంగా దీనిని తీసుకోండి. ఒక వేళ గోధుమ గడ్డి రసం మీకు పడకపోతే మానివేయడం మంచిది.
 
గోధుమ గడ్డి ఎక్కడ దొరుకుతుంది..?
 
గోధుమ గడ్డి కోసం కష్టపడక్కర్లేదు. ఇంట్లో గోధుమ గడ్డి పెంపకం సులువుగా చేసుకోవచ్చు. ఇంట్లోనే పెంచుకుని దాని నుండి రసం తీసుకుని తాగవచ్చు. దీని కోసం 8 నుండి 10 గంటల పాటు గింజలు నానపెట్టాలి. ఆ తర్వాత ప్రతి నాలుగు గంటలకి  నీరు మార్చాలి. ఇలా చేస్తే బాగా ఎదుగుతుంది. అలానే  రెండు అంగుళాల రంధ్రాలు గలిగిన ఓ ట్రేను తీసుకోవాలి. దానిలో మూడింతలు మట్టిని వేయాలి. ఆ మట్టి పై నీటిని పోయాలి. గోధుమలను సమానంగా ఆ మట్టి లో వేయాలి. మీ ఇంట్లో ఉండే కిటికీ కి కాస్త సమీపాన గాలి తగిలేటట్లు పెట్టాలి. 
 
అలానే గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..?  సరాసరి సూర్య రశ్మి పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా కనుక ఈ జాగ్రత్తలని పాటిస్తే  కేవలం ఐదో రోజుకి మొక్కలు ఒక అంగుళం ఎదుగుతాయి. అలా ఎదిగాక ఇప్పుడు కొంచెం నీరు రోజుకు ఒక సారి పెడితే సరి పోతుంది. పదో రోజుకి గోధుమ గడ్డి 6, 7 అంగుళాల ఎత్తుకి పెరుగుతుది. అప్పుడు వాటిని కోసి ఉపయోగించుకోవచ్చు. అంతే సులువుగా ఇంట్లో పెంచుకుని ఆరోగ్యం ని సొంతం చేసుకోవచ్చు.