BREAKING NEWS

స్ట్రెచ్ మార్క్స్ ని సులువుగా తగ్గించుకోవాలంటే ఇలా చెయ్యండి...!

మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అటువంటి సమస్యల్లో స్ట్రెచ్ మార్క్స్ సమస్య ఒకటి. ఈ సమస్యకి అనేక పరిష్కారాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వీటి గురించి ఇప్పుడే తెలుసుకుని వెంటనే వాటిని ట్రై చేయండి. వీటిని ఫాలో అయితే ఈ సమస్యని మీరు తొలగించవచ్చు. మహిళలకి గర్భధారణ మరియు ఊబకాయం తర్వాత ఈ స్ట్రెచ్ మార్క్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇది తరచుగా  స్ట్రెచ్ అయినా లేదా శరీరం యొక్క చర్మం కుంచించుకుపోవడం వల్ల వస్తుంది.  అయితే స్థూలకాయం వల్ల పొత్తి కడుపు చుట్టూ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. 
 
ఇది ఇలా ఉండగా గర్భం ధరించిన తర్వాత మహిళల్లో ఇవి బాగా కనపడవు. ఈ స్ట్రెచ్ మర్క్స్ ని కనుక మీరు వదిలించుకోవాలి అనుకుంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. మంచి పరిష్కారం మీకు కనిపిస్తుంది. కడుపు, భుజాలు, కాళ్లు ఇలా శరీర భాగాల పై ఇవి వస్తూ ఉండడం సహజం. త్వరగా బరువు తగ్గడం లేదా అంతే త్వరగా బరువు పెరగడం వంటి సమస్యల వల్ల కూడా ఇవి ఏర్పడతాయి. వీటిని తగ్గించుకోవడానికి అనేక మంది మార్కెట్లో దొరికే క్రీమ్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వీటికి బదులుగా చిట్కాలని కనుక ఫాలో అయితే అతి సులువుగా తగ్గించుకోవచ్చు.  
 
కొబ్బరి నూనె:
 
కొబ్బరి నూనె ఎంత మంచిదో మనకి తెలుసు. ప్రత్యేకంగా దీని గురించి చెప్పక్కర్లేదు. కొబ్బరి నూనె లో చర్మానికి మేలు చేసే ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. కొబ్బరి నూనె లేకుండా బ్యూటీ కేర్ లో ఏదీ సాధ్యం కాదు. చర్మానికి మాయిశ్చరైజర్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. దీన్ని చర్మం పై నేరుగా అప్లై చేస్తే కనుక ఈ స్ట్రెచ్ మార్క్స్ తగ్గి పోతాయి. అయితే మీరు చేయవలసిందల్లా ఒకటే ముందుగా కొబ్బరి నూనె తీసుకొని చారలపై నేరుగా రాయండి. ఆ తర్వాత మెల్లగా మసాజ్ చేయాలి. ఇలా కనుక మీరు చేస్తే ఈ సమస్య నుండి మీకు పరిష్కారం దొరుకుతుంది.
 
 బంగాళాదుంప రసం:
 
 బంగాళదుంప రసం కూడా దివ్యౌషధంలా పనిచేస్తుంది. చర్మానికి మేలు చేసే ఎన్నో గుణాలు బంగాళాదుంపలో ఉన్నాయి. ఏ మచ్చలైన సరే ఇట్టే పోవాలంటే బంగాళాదుంప రసం చాలా బాగా పని చేస్తుంది. ఈ స్ట్రెచ్ మార్క్స్ ని పోగొట్టుకోవాలి అనుకొనేవారు ముందుగా బంగాళ దుంపను ముక్కలుగా చేయాలి. ఆ తర్వాత ఒక్కో ముక్కని తీసుకుని మచ్చలపై  రుద్దాలి. ఇది ఆరిపోయిన తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మంచి పరిష్కారం మీకు కనిపిస్తుంది. నిజానికి బంగాళదుంపలో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి ప్రత్యేక గుణాలు ఉన్నాయి.
 
కీర :
 
కీర కూడా స్ట్రెచ్ మార్క్స్ ని పోగొట్టడానికి బాగా పనిచేస్తుంది. కీర రసంలో ఎన్నో ప్రత్యేక గుణాలు ఉన్నాయి. దీనిని చర్మంపై ఉపయోగించడం వల్ల ఈ సమస్య కూడా త్వరగా తగ్గిపోతుంది. అయితే కీరాని ఎలా అప్లై చేయాలి అనే విషయానికి వస్తే.. ముందుగా కొంచెం కీర రసం లో కాస్త నిమ్మరసం కలిపి చారల పై రాయాలి. కాసేపు ఉంచి పూర్తిగా ఆరాక కడిగేయాలి. ఇలా చేస్తే చాలు ఈ సమస్య త్వరగా తగ్గిపోతుంది.
 
కోకో బటర్: 
 
కోకో బటర్ ని అనేక బ్యూటీ కాస్మెటిక్స్ లో ఉపయోగిస్తారు అన్న సంగతి మనకు తెలిసిందే. దీనిలో అనేక గుణాలు ఉన్నాయి. స్ట్రెచ్ మార్క్స్ ని పోగొట్టడానికి సహాయ పడతాయి. కోకో బీన్స్ నుండి తయారు చేసిన న్యాచురల్ బటర్ ఇది అని మనకి తెలుసు. దీనిని మీ చర్మంపై అప్లై చేయడం వల్ల త్వరగా స్ట్రెచ్ మార్కులు తగ్గిపోతాయి. 
 
ఆముదం:
 
 ఆముదంలో చర్మపోషణకు ఉపయోగపడే అనేక గుణాలు ఉన్నాయి. ఈ ఆముదాన్ని ఉపయోగించడం వల్ల కూడా ఈ సమస్య తొలగిపోతుంది. ముందుగా కొంచెం ఆముదం తీసుకుని చర్మం పై మసాజ్ చేయాలి. ఇది స్కిన్ మాయిశ్చరైజర్ ని అందించి త్వరగా మచ్చలు, చారలు తగ్గేలా చూస్తుంది. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
  
 కలబంద :
 
కలబంద కూడా మంచి పరిష్కారం చూపిస్తుంది. అలోవెరా జెల్ ఉపయోగించడం వల్ల స్ట్రెచ్ మార్కులు సులభంగా తగ్గుతాయి. చర్మానికి అనేక విధాలుగా ఎల్లవేళలా పనిచేస్తుంది. అయితే స్ట్రెచ్ మార్కులు ఎలా పోగొట్టాలి అనే విషయానికి వస్తే.. ముందుగా కొంచెం సహజంగా దొరికే అలోవెరా గుజ్జుని లేదా మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ ఏదైనా తీసుకోవచ్చు దీనిని ఒంటి మీద ఉన్న ఆ చారల మీద రాయాలి. ఇలా నెమ్మదిగా మసాజ్ చేస్తూ ఉండాలి. రాసిన పదిహేను నిమిషాలకి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీనిలో  విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసి బాగా కలిపి ఇలా ఈ పద్ధతిని అనుసరించవచ్చు. ఇలా చేయడం వల్ల మరింత బాగా పని చేస్తుంది.