BREAKING NEWS

వేడి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే...!

చాలా మంది వేడి నీళ్ళు తాగడానికి ఇష్ట పడరు. కానీ వేడి నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రోజు ఫ్రిజ్ లో నీళ్లు తాగడం మీకు అలవాటు అయితే ఈ అలవాటుని తప్పకుండా మార్చుకోండి. ఎందుకంటే వేడి నీళ్లు తాగి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. చిల్ గా ఉండే ఫ్రిడ్జ్ వాటర్ తాగడం ఇష్టమైన సరే వేడి నీళ్లు తాగడం మంచిది.

ఫ్రిజ్ లో పెట్టిన నీళ్లు తాగడం వల్ల కలిగే మేలు కంటే ఇబ్బందులే ఎక్కువ ఉన్నాయి. చల్లని నీళ్లు అనేక వ్యాధులకు ఆహ్వానం పలుకుతుంది. అందుకే వైద్యులు అంటూంటారు.. ఉష్ణోగ్రత తో సమానమైన నీళ్లు తాగడం మంచిదని. మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తిగా వేడి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడే తెలుసుకొని పాటించండి. దీని వల్ల మీ ఆరోగ్యం కూడా మరింత మెరుగు పడుతుంది.
 
వివరాల్లోకి వెళితే మహిళలు రోజుకి 2.6 లీటర్లు నీళ్లు తాగడం మంచిది. ఇక పురుషుల విషయానికి వస్తే 3.7 లీటర్ల చొప్పున నీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలి. అదే పనిగా చిల్ వాటర్ మాత్రం తాగకండి. నీళ్లు తాగమన్నారు కానీ చల్లని నీళ్ళు కాదు. కనుక మీకు  వీలైతే గోరు వెచ్చని నీటిని తాగడం మంచిది. ఉదయం లేవగానే ఇలా చేయడం మరింత మంచిది. కాబట్టి మీరు మీ అలవాటు మార్చుకోవడం ఆరోగ్యానికి మరింత సహాయ పడుతుంది.
 
గోరువెచ్చని నీళ్ళు రోజు తాగితే ఏమవుతుంది...?
 
గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవి ఏమిటి అంటే..? తల నొప్పి, అజీర్తి తదితర సమస్యలు తొలగి పోతాయి. దీనితో పాటు ఇతర ఇతర సంబంధిత వ్యాధుల తో బాధపడే వాళ్లకు కూడా గోరు వెచ్చని నీళ్ళు మంచి ఔషధంలా పని చేస్తాయి. అలానే వేడి నీరు కనుక మీరు తీసుకుంటే  గొంతు సమస్యల నుండి కూడా తొలగిస్తుంది. ఊబకాయం అధిక బరువు వంటి సమస్యలు సైతం వేడి నీళ్ల తో అధిగమించవచ్చు. ఇది ఇలా  ఉండగా కీళ్ళ నొప్పుల తో బాధపడే వాళ్లకి కూడా గోరు వెచ్చని నీళ్ళు మరింత బాగా పని చేస్తాయి. వేసవి కాలం లో సైతం డీహైడ్రేట్ సమస్య తీర్చేందుకు వేడి నీళ్ళు ఉపయోగ పడతాయి. జలుబు, న్యూమోనియా నుంచి దూరంగా ఉంచడానికి కూడా ఇది బాగా దోహద పడుతుంది.
 
డయాబెటిస్ ముప్పు ఉందని భయపడే వాళ్లకి కూడా ఇది మంచి ఔషధం. ఏ వైరస్ అయినా బ్యాక్టీరియా అయినా వేడి నీళ్ల తో తరిమేయ వచ్చు. ఇప్పుడు కరోనా విలయతాండవం చేస్తోంది కాబట్టి గోరు వెచ్చని నీళ్ళు తీసుకోవడం ఆరోగ్యానికి చాల మంచిది. అలానే దగ్గు, పడిశం తో బాధపడే వాళ్లకు కూడా గోరు వెచ్చని నీళ్ళు తీసుకోవడం చాలా మంచిది. కాబట్టి మీకు వీలును బట్టి గోరు వెచ్చని నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. అంతే కానీ ఫ్రిడ్జ్ వాటర్ ని మాత్రం తీసుకోకండి. అంత ఎక్కువ ఫ్రిడ్జ్ వాటర్ ని తగ్గిస్తే అంత మంచిది. కాబట్టి దీనిని అలవాటు చేసుకోవడం అందరికి మంచిది.
 
వేడి నీళ్ళు తీసుకోవడం ఎవరికి మంచిది..?
 

ప్రతి ఒక్కరు గోరు వెచ్చని నీళ్ళు తాగడం చాలా మంచి అలవాటు. డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల తో బాధ పడే వాళ్లకు వేడి నీళ్లు తాగడం వల్ల మరింత మంచిదని వైద్యులు తెలుపుతున్నారు. వేడి నీళ్లు తాగడం అన్నారు కదా అని మరీ వేడిగా ఉన్న నీళ్లు తాగకండి. కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తీసుకోండి. బాగా మరిగిన నీళ్లు తాగడం వల్ల మరిన్ని కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి గమనించి తీసుకోవడం మంచిది. మీరు వైద్యులను సంప్రదించి పాటించడం మరింత శ్రేయస్కరం. ఈ విషయం కూడా మీరు గమనించండి.
 
వేడి  నీళ్లను ఎప్పుడు తీసుకోవాలి..?
 
వేడి నీళ్లు ఎప్పుడు తాగినా మంచిదే. కానీ ఉదయం నిద్ర లేవ గానే కాలకృత్యాలు తీర్చుకోక ముందే రెండు లేదా మూడు గ్లాసులు గోరు వెచ్చని నీళ్లు తాగండి. తాగేయమన్నారు కదా అని నీటిని గడగడా తాగకండి. నీటిని నోట్లోనే  ఉంచుకుంటూ గుటకలు వేస్తూ తాగండి. ఇలా చేయడం మంచిది. మీరు క్రమం తప్పకుండా ప్రతి రోజు ఈ పద్ధతిని కనుక అనుసరించారు అంటే మంచి ఫలితాలు చూస్తారు. కాబట్టి ప్రతి రోజు తప్పకుండా దీన్ని అనుసరించండి.
 
చూసారు కదా కాచి చల్లార్చిన నీళ్లు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయో..! మరి మీరు ఇంక ఆలస్యం చేయకుండా ఈ పద్ధతిని అనుసరించేయండి. దీని వల్ల మీకు నష్టం ఏమి ఉండదు. ఎంతో ఆరోగ్యంగా మీరు ఉండవచ్చు. అలానే అనేక సమస్యల నుండి కూడా ఇట్టే బయట పడిపోవచ్చు. కాబట్టి అనుసరించేయండి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి.