BREAKING NEWS

ఎత్తిపోతల జలపాతం గురించి ఆసక్తికరమైన విశేషాలు...!

జలపాతాలు చూడడానికి చాలా బాగుంటాయి. సెలవు రోజుల్లో నిజంగా జలపాతాలను చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా జలపాతాలు చూడడం చాలా బాగుంటుంది. చుట్టూ అందమైన ప్రకృతి, జలపాతాలు చూడ ముచ్చటగా ఉంటాయి. అటువంటి అందమైన జలపాతాల్లో ఎత్తిపోతల జలపాతం ఒకటి. ఈ జలపాతం గురించి అనేక విషయాలు ఇక్కడ ఉన్నాయి మరి ఆలస్యమెందుకు పూర్తిగా చూసేయండి. 
 
ఎత్తిపోతల జలపాతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా మాచర్ల సమీపం లో ఉంది. ఎత్తిపోతల జలపాతము నాగార్జున సాగర్ నుండి మాచర్ల మార్గం లో 11 కిలో మీటర్ల దూరం లో గుంటూరు జిల్లా, తాళ్లపల్లి వద్ద ఉంది. చక్కటి ప్రకృతి చుట్టూ ఆలయాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. 
 
ఎత్తిపోతల జలపాతం:
 
తాళ్లపల్లి వద్ద ఉన్న ఈ జలపాతం 70 అడుగుల ఎత్తు లో కృష్ణా నది ఉపనది అయిన చంద్ర వంక నది పై ఉంది. ఈ చంద్రవంక నది నల్లమల శ్రేణులు తూర్పు కొండల లో ముత్తుకూరు వద్ద పుట్టి తుమ్మూరు కోట అభయారణ్యం లో, తాళ్ల పద్మావతి తుమృకోట అభయారణ్యం లో తాళ్లపల్లి వద్ద 70 అడుగుల నుండి ఎత్తు నుండి పడి ఉత్తర దిశగా ప్రయాణించి కృష్ణా నది లో కలుస్తుంది. ఇక్కడ ఉండే మరో విశేషం ఏమిటంటే ఇక్కడ మొసళ్ల పెంపక కేంద్రం కూడా ఉంది.
 
ఎత్తిపోతల జలపాతం అనే పేరు ఎలా వచ్చిందంటే..?
 
అందమైన ఈ జలపాతానికి పేరు ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే.... యతి అనే పేరు గల ఒక మహర్షి తపస్సు చేసిన స్థలం కనుక ఈ ప్రదేశం యతి తపో తలం (ఎత్తిపోతల) స్థలంగా ప్రసిద్ధి గాంచింది.
 
ఈ జలపాతం ఎలా ప్రసిద్ధి చెందింది అంటే...? 
 
ప్రకృతి వీక్షకుల్ని కనువిందు చేసే ఈ జలపాతం నిత్యం కళకళ్లాడుతూ ఉంటుంది. ఈ జలపాతం అందరికీ సుపరిచితం. ఎలా ప్రసిద్ధి అయ్యింది..? అనే విషయానికి వస్తే... ఎప్పుడూ ఏదో ఒక సినిమా షూటింగ్  ఇక్కడ జరుగుతుండడం, నిత్యం యాత్రికులు రావడం వస్తూ ఉంటారు. దీని వల్ల ఎప్పుడూ కళకల్లాడుతూ ఉంటుంది. రద్దీగా కూడా ఉంటుంది. యతి అనే ఋషి కారణంగా ఇక్కడికి ఉన్న జలపాతానికి ఆ పేరు వచ్చిందని అక్కడ ఒక బోర్డు మీద కూడా రాసి ఉంటుంది.  ఈ జలపాతాల కారణం గానే అక్కడ ఉన్న క్షేత్రానికి ఎత్తిపోతల దత్తాత్రేయ క్షేత్రం అనే పేరు వచ్చింది. 
 
ఎత్తిపోతల జలపాతం కి ఎలా వెళ్లాలి..? 
 
ఈ ప్రదేశాన్ని సులువుగా చేరుకోవచ్చు. ఎత్తిపోతల జలపాతాన్ని చేరుకోవడానికి రెండు విమానాశ్రయాలు దగ్గర లో ఉన్నాయి. అవి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు విజయవాడ గన్నవరం విమానాశ్రయం. అదే కనుక  రైలు మార్గం లో ప్రయాణించే వారు ఎలా చేరుకోవాలి అంటే...?  ఈ జలపాతానికి సమీపం లో మూడు రైల్వేస్టేషన్లు ఉన్నాయి. అవి ఏమిటంటే...?  విష్ణుపురం, పొందుగుల, నడికుడి జంక్షన్ లో హైదరాబాద్, గుంటూరు, విజయవాడ ప్రాంతం నుంచి వచ్చే రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. అదే  ఒక వేళ రోడ్డు మార్గం లో మీరు వస్తుంటే హైదరాబాద్, నల్గొండ, నాగార్జున సాగర్, గుంటూరు తదితర ప్రాంతాల నుండి బస్సులు తిరుగుతుంటాయి. మాచర్ల నుండి చేరుకోవచ్చు కాబట్టి ఈ జలపాతాన్ని చేరుకోవడానికి ఏ సమస్య ఉండదు. సులువుగా ఈ ప్రదేశాన్ని ఎవరైనా చేరుకోవచ్చు.
 
ఎత్తిపోతల జలపాతం సమీపం లో ఉన్న ఆలయాలు:
 

కేవలం జలపాతం మాత్రమే కాదు ఇక్కడ ఆలయాలని కూడా చూడవచ్చు. ఇంతకు ముందు చెప్పినట్లుగా దత్తాత్రేయ స్వామి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్న మరో విషయం ఏంటంటే...?  ఇక్కడ ఈ లోయ లో వెలిసిన దత్తాత్రేయ స్వామి సుగాలీయుల ఇల వేలుపు. ప్రతి ఏటా తొలి ఏకాదశి నాడు జరిగే తిరునాళ్ళకు సమీప జిల్లాల్లోని సుగాలీలు అసంఖ్యాకంగా హాజరవుతారు. ఇది ఇలా ఉండగా ఇక్కడ మధుమతీ దేవి, రంగనాధ స్వామి, చౌడేశ్వరీ దేవి ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ దేవాలయాలు ఎత్తిపోతల జలపాతానికి దిగువ భాగం లో ఉన్న అతి పురాతన దేవాలయాలు.  ఈ ఆలయాల కోసం ప్రజలకి తెలిసినది చాల తక్కువ. కానీ ఈ ఆలయాలకు ఉన్న ప్రత్యేకత ఎక్కువే. ఈ ఆలయం లో విగ్రహాన్ని కొండను తొలిచి లోపల ఏర్పాటు చేసారు. ఇప్పటికీ దేవాలయానికి వెళ్ళాలంటే తలదించుకొని వెళ్ళావలసినదే.
 
ఆలయాల్లో పండుగలు, పర్వదినాలు: 
 

ఈ ఆలయంలో పండుగలు, పర్వదినాలు కూడా బాగా జరుగుతాయి. ప్రతి తొలి ఏకాదశి, దత్త జయంతి మొదలగు పర్వదినాల లో, రాష్ట్రం లోని నలు మూలల నుండి భక్తులు ఇక్కడకు తరలి వస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఈ దేవాలయాలకు సరిహద్దు లో నల్లగొండ, గుంటూరు, ప్రకాశం, మహబూ నగర్, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల నుండి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు.