BREAKING NEWS

మీపై మీ నమ్మకాన్ని పెంచుకోవాలంటే ఈ రహస్యాలని పాటించాల్సిందే..!

ప్రతి ఒక్కరికి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. నమ్మకం కనుక ఉంటే ఉన్నత శిఖరాలని చేరుకోగలరు. నమ్మకం అనేది మిమ్మల్ని బాగా ముందుకు నడిపిస్తుంది. దీని వల్ల ఎంత పెద్ద సమస్య ఉన్నా సులువుగా పరిష్కరించుకోవచ్చు. ఒకవేళ కనుక ఒకరి పై వాళ్ళకే నమ్మకం లేదు అనుకోండి కనీసం రెండు అడుగులు కూడా ముందుకు వేయలేరు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..? 

నమ్మకం ఉంటే జీవితంలో ఎంతటి కష్టాన్నైనా తేలికగా ఎదుర్కోవచ్చు. ముందు నిన్ను నువ్వు నమ్మాలి. నువ్వు ఏ పని చేయాలన్నా, నీకు ఏది కావాలి అనుకున్న, నువ్వు ఏమి సాధించాలి అన్నా, నీపై నీకు నమ్మకం ఉండాలి. నీపై నీకు నమ్మకం పెంచుకుంటే నిన్ను ఆపడం ఎవరి తరమూ కాదు.. కాబట్టి నమ్మకాన్ని బాగా పెంచుకోవటం ముఖ్యం.
 
ఒకరు విజయాన్ని అందుకుంటున్నారు అంటే దానికి కారణం వారి మీద వారికి ఉన్న నమ్మకమే. ఎప్పుడు కూడా వాళ్లు చేయగలరు... నేను చేయలేను.. అని చింతించకూడదు,  పని నుంచి పారిపోవాలని ప్రయత్నం చేయకూడదు. నమ్మకాన్ని పెంచుకుంటూ వెళ్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు.. అయితే ఆ నమ్మకం నీలో రావడానికి పెద్ద కష్టం ఏమి అక్కర్లేదు. కేవలం ఉన్న ఈ సాధారణ అలవాట్ల తో సులువుగా నమ్మకాన్ని పెంచుకోవచ్చు. మరి మీరు కూడా మీ నమ్మకాన్ని పెంచుకోవాలి అనుకుంటున్నారా..?  మరి ఆ సాధారణ అలవాట్లు ఏమిటో చూడండి. తద్వారా నమ్మకాన్ని యిట్టె పెంచేసుకోండి.
 
మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయడం:
 
మీ పై మీ ఇష్టాన్ని పెంపొందించుకోవడం, మిమ్మల్ని మీరు ఇష్టపడడం వంటివి మీరు మొదలు పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీపై మీకు నమ్మకం కలుగుతుంది. ఏ పని చేయాలన్నా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళడానికి ధైర్యాన్ని అందిస్తుంది. కాబట్టి ఎప్పుడు మీరు మీ గురించి నెగిటివ్ గా ఆలోచించకూడదు. అలానే ద్వేషాన్ని కూడా మీరు పెంపొందించుకోకూడదు. మీరు ఏ పని చేసినా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేస్తూ ముందుకు సాగాలి. అలా కనుక మీరు చేస్తే తప్పకుండా తిరుగులేని విజయాన్ని అందుకుంటారు.
 
మీకు మీరే బహుమతి ఇచ్చుకోవడం:
 
ప్రస్తుత ప్రపంచం లో అవతలి వారిని  మెచ్చుకోవడం చాలా తక్కువ. ఒకవేళ అలా పొగిడినా దాని వల్ల తమకు ఏదో లాభం రావాలని అనుకునే వారే.. అందువల్ల నిజంగా మెచ్చుకోవడం  కనుమరుగై పోయింది. అందుకే మిమ్మల్ని మీరు అభినందించడం చాలా ముఖ్యం. మీరు చేసే ప్రతి చిన్న పని లో, ప్రతి చిన్న విషయం లో కూడా అభినందించి కోవాలి. ఏ చిన్న పని అయినా మీరు  చేసినట్టు మరొకరు ఎవరు చేయలేక పోవచ్చు. కాబట్టి ప్రతి దాంట్లో కూడా మిమ్మల్ని మీరు అభినందించుకుని తీరాలి. దీని వల్ల నీకు మరింత ప్రోత్సాహం దక్కుతుంది.
  
డ్రెస్సింగ్:
 
చాలా మంది ధరించే దుస్తులుని లెక్కచేయరు. మీరు నమ్మినా, నమ్మక పోయినా మంచిగా డ్రెస్సింగ్ సెన్స్ మీలో నమ్మకాన్ని పెంచుతుంది. మంచి డ్రెస్సింగ్ అంటే వేలకు వేలు పోసి ఖరీదైన బట్టలు అనుకోకండి. మంచి డ్రెస్సింగ్ అంటే..? మీకు నప్పేటట్లు ఉన్న డ్రెస్సింగ్ ఏదైనా సరే అది వేసుకోగానే మీలో తెలియని నమ్మకం పెంచేలా ఉంటుంది. కాబట్టి దీని మీద కూడా మీరు కొంచెం ఏకాగ్రతని పెట్టడం ముఖ్యం. దీని కారణంగా నమ్మకం మీకు పెరుగుతుంది.
 
ఇతరుల మాటలు పట్టించుకోవద్దు:
 
ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. మీకు తప్పు అనిపించేది ఎదుటి వారికి ఒప్పు అనిపించవచ్చు. వారికి ఒప్పు  అనిపించింది మీకు తప్పు అనిపించ వచ్చు. కనుక ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నీకు అనవసరం. మీ గురించి వాళ్ళకేం తెలుసు ఏదో అనుకోవడానికి.. మీ సందర్భాలు, మీ కష్టాలు, మీ బాధలు ఎదుటి వారి ఎవరికీ పూర్తిగా తెలియవు. కాబట్టి మీ ఆలోచనకే ప్రాముఖ్యత ఇవ్వండి. అంతే కానీ ఎదుటి వాళ్ళు ఏమి అనుకుంటున్నారు అని మీరు అనవసరంగా ఆలోచించొద్దు. పైగా ఇది మీ జీవితం మీ జీవితాన్ని నిర్ణయించడానికి ఎదుటి వాళ్ళు ఎవరు..? కనుక మీరే చక్కగా ఆలోచించి మీ పరిస్థితిని దృష్టి లో ఉంచుకొని ముందడుగు వేస్తే మీ నమ్మకం మరింత పెరుగుతుంది. అలానే మీరు విజయాన్ని సాధించగలరు. కాబట్టి దీనిని కూడా మీరు బాగా గమనించడం ముఖ్యం.
 
ప్రామిస్ ని బ్రేక్ చేయకండి :
 
ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ చేసినప్పుడు దాన్ని నిలబెట్టుకుని తీరాలి. దాని వల్లనే అవతలి వారి నమ్మకం పెరుగుతుంది. అవతలివాళ్లు మీపై నమ్మకం పెట్టుకోవడం వల్ల మీ పై మీకు నమ్మకం కూడా కలుగుతుంది.
 
అనవసరంగా బాధపడవద్దు:
 
చిన్న సమస్యను కూడా పెద్దగా ఊహించుకుని బాధ పడటం నమ్మకాన్ని పోగొడుతుంది. పైగా అనవసరంగా మీ ఆనందం కూడా తెగిపోతుంది. మీరు నమ్మకాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు  కాబట్టి తక్కువ ఆలోచించి ఆనందంగా ఉండండి. నమ్మకమే కాదు ఆనందం కూడా మీకు కలుగుతుంది.