BREAKING NEWS

కొత్త సంవత్సరానికి ఇలా సరికొత్తగా, సరదాగా గడిపేద్దామా...!

కొత్త సంవత్సరం వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఎనలేని ఆనందం కలుగుతుంది. ఇంటిల్లపాది సరదాగా గడపడం లేదా చుట్టుపక్కల వాళ్లతో కలిసి పార్టీలు చేసుకోవడం వంటివి సహజం. మరికొద్ది గంటల్లో మనం అంతా కలిపి 2020 కరోనా సంవత్సరానికి గుడ్ బై  చెప్పేయాలి. రాబోయే 2021 కి స్వాగతం పలుకుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. అయితే 2020 మొత్తం కరోనాతో సమయమే తెలియకుండా పోయింది.

ఈ మహమ్మారి కారణంగా ఏ ఆనందము ప్రజలకు కలుగలేదు. కనీసం ఈ సారి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి కూడా మనకి వీలు లేదు. ఏది ఏమైనా కొత్త సంవత్సరం అంటే ప్రతి ఒక్కరికి కాస్తోకూస్తో ఆత్రుత ఉంటుంది. ఎలానో బయటికి వెళ్లి వేడుకలు చేసుకోలేం.. కాబట్టి సరదాగా ఇంట్లోనే వేడుకల్ని సంతోషంగా జరుపుకుందామని ఎన్నో కుటుంబాలు ప్లాన్ చేసుకునే ఉంటారు ఈపాటికే.
 
మరి ఇంట్లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడానికి కొన్ని టిప్స్, పద్ధతులు మీకోసం మరి ఆలస్యం ఎందుకు వీటిలో నచ్చిన వాటిని మీరు కూడా మీ ఇంట్లో అనుసరించి ఎంతో ఆనందంగా 2021 కి స్వాగతం పలికేయండి. వీటిని కనుక అనుసరించారంటే కరోనా  కాలంలో న్యూ ఇయర్ పార్టీ ఎలా చేసుకోవాలి అనే చింత కూడా మీకు కలగదు. ఇటువంటి సమయంలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకునే పద్ధతులు ఇవే....
 
టేస్టీ టేస్టీ కేక్స్:
 
న్యూ ఇయర్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కేకులు. కనుక మీకు ఇష్టమైన కుకీస్, కేక్స్ ని సిద్ధం చేసుకోండి. ఎప్పుడు లాగ కాకుండా  కేక్ ని కొత్త థీమ్ తో ఆలోచించండి. లేకపోతే మీరే సరదాగా ఇంట్లోనే చేసేయండి. మీకు నచ్చిన ఫ్లేవర్స్, మీకు నచ్చిన టెస్ట్ కి తగ్గట్టు చక్కగా చేసి ఆనందంగా ఆస్వాదించండి లేదా మీ ఇంటి చుట్టుపక్కల వారితో కలిపి కేక్ బేకింగ్ పోటీలను నిర్వహించుకుని సరదాగా గడపవచ్చు. సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయడం మాత్రం మర్చిపోకండి.
 
 గిఫ్ట్స్ ని ఇచ్చిపుచ్చుకోవడం:
 
సరదాగా మీకు నచ్చిన వాళ్ళకి మీ ప్రియమైన వాళ్లకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ గిఫ్ట్స్ ని పంపండి. మీకు ఇష్టమైన వాళ్ళకి వాళ్ళకి నచ్చే వస్తువుల్ని పంపితే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నచ్చిన వస్తువుల్ని మీరు కనుక  పంపారంటే వాళ్ళు చక్కగా సంతోషిస్తూ ఈ న్యూ ఇయర్ ని మీరు ఇచ్చిన ఆనందం తో  మొదలు పెడతారు మరి ఆలస్యం ఎందుకు వాళ్ల ఫేవరెట్ గిఫ్ట్స్ ని ఇప్పుడే పంపించేయండి.
 
 కుటుంబ సమేతంగా గడపడం:
 
ఇప్పుడు న్యూ ఇయర్ కి బయటికి వెళ్లడం కుదరదు కాబట్టి సరదాగా ఫ్యామిలీ తో గడపండి. ప్రతిసారి ఎలాగో స్నేహితుల తో, ప్రేమికుల తో గడిపే ఉంటారు. కానీ ఈ సారి మీకు మంచి అవకాశం కుటుంబంతో గడపడానికి దొరికింది. కాబట్టి మీకు నచ్చిన అంత సేపు మీ ఫ్యామిలీ తో గడపండి. న్యూ ఇయర్ ని మీ కుటుంబ సభ్యుల తో గడపడం వల్ల అనేక అపురూప క్షణాలు మీకు సొంతమవుతాయి. కాబట్టి సరదా సరదాగా మీ ఫ్యామిలీ తో గడపండి. కాస్త సమయం వాళ్ల కోసం వెచ్చించండి.
 
డాన్స్, మ్యూజిక్:
 
అబ్బా ఇష్టమైన పాటల తో చక్కగా స్టెప్పు లేస్తూ ఉంటే ఆ కిక్కే వేరు కదా....! పెద్దవాళ్లు సైతం డాన్స్, పాటలు వంటి వాటికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఈ న్యూ ఇయర్ కి సరదాగా మీ ఇంట్లో వాళ్ళందరూ కలిపి చిన్నచిన్న స్టెప్పులు వేసి చిందులేసేయండి. నిజంగా ఇది అపురూప క్షణములా మారిపోతుంది. కావాలంటే ఒకసారి మీరే ట్రై చేయండి.
  
పార్టీ చేసుకోండి:
 
ఇది వరకు న్యూ ఇయర్ కి మీరు రెస్టారెంట్ లో,  క్లబ్ లలో,  పబ్ లలో గడిపి ఉంటారు కానీ ఇప్పుడు కరోనా కారణంగా ప్రభుత్వం వాటిని నిషేధించడం జరిగింది అన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే మీరు నిజంగా ఇలాంటి వాతావరణం లో గడపాలనుకుంటే మీ ఇంటినే  ఒక రెస్టారెంట్ లాగ  పార్టీ వాతావరణం తో మార్చేయండి. ఇంటిల్లిపాదీ కలిసి నచ్చిన ఆహారం తో ఆనందంగా గడపండి. ఇది కూడా మంచి న్యూ ఇయర్ వేడుకల మారిపోతుంది. కావాలంటే ఈ న్యూ ఇయర్ కి ప్రయత్నం చేసి చూడండి. 
 
చూసారా..! ఇంత మంచి పద్ధతుల్ని కనుక మీరు అనుసరించారు అంటే ఎప్పుడు చేసుకోలేని న్యూ ఇయర్ ని మీరు మీ  ఇంట్లో చేసుకోవచ్చు. రంగు రంగుల ముగ్గులు, పిల్లాపాపల తో ఆనందాలు... నచ్చిన ఆహారం, కేక్స్, డాన్స్ ఇలా ఎన్నో వాటితో  మీ ఇంట్లోనే పార్టీ చేసుకోవచ్చు 2020 కి గుడ్ బై చెప్పేసి.... 2021 కి ఎంతో ఆనందంగా స్వాగతం పలకండి... 
 
మీకు మీ కుటుంబ సభ్యులకి విష్ యు హ్యాపీ న్యూ ఇయర్...