BREAKING NEWS

నువ్వులనూనెతో అనేక సమస్యలకి ఇలా చెక్ పెట్టేయండి...!

ఆరోగ్యకరమైన, తినగలిగిన నూనెలలో నువ్వుల నూనె ఒకటి. దీని వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ఆయుర్వేద చికిత్స లో కూడా దీనిని విరివిగా వాడుతూ ఉంటారు. కేవలం వంటకి మాత్రమే కాకుండా దీన్ని ఆయుర్వేద చికిత్స లో కూడా ఉపయోగిస్తున్నారు అంటే దీని వల్ల కలిగే లాభాలు గురించి మీకు ఈ పాటికే అర్ధం అయ్యిపోయి ఉండవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం నువ్వుల నూనె గురించి పూర్తిగా ఇప్పుడే తెలుసుకోండి. ఇందులో ఉండే పోషక విలువలు వల్ల దీనిని నూనెలకే రాణిగా భావిస్తారు. నువ్వుల నూనె నువ్వుల విత్తనాల నుంచి తీస్తారు. దీనిని ప్రాచీన ఈజిప్టు కాలం నుండి నొప్పులు తగ్గించడానికి వాడేవారని తెలిసింది. 
 
నువ్వులు నూనె వల్ల కలిగే లాభాలు:
 
నువ్వుల నూనె చర్మాన్ని కాపాడడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, బి చర్మ సమస్యలను దూరం చేస్తుంది. మనం పచ్చళ్ళని పెట్టడానికి నువ్వుల నూనెని ఎక్కువగా ఉపయోగిస్తుంటాము  కానీ ఈ నువ్వుల నూనెని  వాటికే పరిమితం చేయవద్దు. ఈ నూనెని మనం వంటకి, ఒంటికి కూడా వాడవచ్చు. ప్రతి రోజూ నువ్వుల నూనెతో  పదార్థాలు చేసి వాడితే చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. నువ్వుల నూనె లోని ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, పిండి పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి, శరీర సౌందర్యానికి చాలా మేలు చేస్తుంది.
  
రక్తపోటును తగ్గించడానికి నువ్వుల నూనె:
 
పరిశోధన ద్వారా వెల్లడించింది ఏమిటంటే నువ్వుల నూనె రక్తపోటు స్థాయిని తగ్గించడానికి ఉపయోగపడుతుందని. ఈ నూనెను వాడడం వల్ల పేషెంట్ల లో రక్తపోటు స్థాయి బాగా తగ్గాయి. సహజంగా తగ్గించడానికి ఇది ఒక ప్రాకృతిక పదార్థం.
 
 చర్మానికి నువ్వుల నూనె :
 
నువ్వుల నూనె వాడటం వల్ల చర్మానికి తేమ లభిస్తుంది. మృదువుగా ఉంచడం మరియు ముడతలు కూడా తగ్గుతాయి. దీన్ని సహజ సన్ స్క్రీన్ గా కూడా ఉపయోగించవచ్చు. చర్మంకి త్వరగా పీల్చుకుంటుంది.  దానికి  పోషణని ఇస్తుంది. ఎండిపోవడం మరియు పగుళ్లను పోయేటట్టు చేస్తుంది కాబట్టి ఇటువంటి సమస్యలతో బాధపడేవారు చర్మానికి నువ్వుల నూనె రాసుకుంటే చాలా మేలు చేస్తుంది.
  
దంత సమస్యలకు నువ్వుల నూనె:
 
కేవలం ఆరోగ్యానికి చర్మ సమస్య మాత్రమే కాదు దంత సమస్యలు కూడా నువ్వుల నూనె బాగా మేలు చేస్తుంది. నువ్వుల నూనె నోటి ఆరోగ్యానికి, పరిశుభ్రతకి  ప్రాచీన కాలం నుండి వాడుతూ వస్తున్నారు. అయితే దంత సమస్యలు తొలగించడానికి నేరుగా నోట్లో నువ్వుల నూనెని పోసుకుని పుక్కిలిస్తే నోటి ఆరోగ్యానికి చాలా బాగా సహాయ పడుతుంది. పళ్ళు పుచ్చి పోవడం ఇలా ఏ సమస్య ఉన్న కూడా నువ్వుల నూనె బాగా పని చేస్తుంది. ఇలా నోటికి సంబంధించిన అనేక సమస్యను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది.
  
గుండె ఆరోగ్యానికి నువ్వుల నూనె:
 
శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు నువ్వుల నూనె లో కలిగి ఉన్నాయి. ఇది గుండె పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది.  కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది. అంతే కాదండి మెరుగైన రక్త ప్రసరణకు ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉండే  ఫ్యాటీ యాసిడ్లు- సెసమోల్ మరియు సెసమిన్ రెండూ హృదయ మరియు రక్త ప్రసరణ వ్యవస్థను బలంగా ఉంచి, కొలస్ట్రాల్ స్థాయిని తక్కువగా ఉండేలా చేస్తాయి. 
 
రక్తం లో చక్కెర స్థాయిని తగ్గించడానికి నువ్వుల నూనె:
 
నువ్వుల నూనె లో మెగ్నీషియం రక్తం లో చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది . ఈ నువ్వుల నూనె లో విటమిన్ ఇ లో  ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తం లో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. వివిధ అధ్యయనాల్లో మధుమేహ రోగులు డైట్ చేయడం వల్ల సానుకూల ఫలితాలు కనిపించాయని ఆ పరిశోధన ద్వారా వెల్లడయింది.
 
నువ్వుల నూనె జుట్టును సంరక్షించి మంచి పోషణని అందిస్తుంది. ఇది సహజమైన సన్ స్క్రీన్  పదార్థంగా ప్రసిద్ధి కాబట్టి ఇది జుట్టుకు హాని మరియు కాలుష్యం నుండి కాపాడుతుంది.  వెంట్రుకలకు కూడా నువ్వుల నూనె చాలా మంచిది. మీరు కనుక క్రమం తప్పకుండ నువ్వుల నూనెని తలకు పెట్టుకుంటే వెంట్రుకలు ఊడిపోకుండా, జుట్టు ఒత్తుగా పెరిగేందుకు బాగా ఉపయోగ పడుతుంది. కేవలం జుట్టు పెరగడమే కాదు చుండ్రు సమస్యకు కూడా నువ్వుల నూనె మంచి ఫలితం ఇస్తుంది. ఒకవేళ  తెల్ల జుట్టుని త్వరగా రాకుండా కాపాడుకోవాలనుకుంటే కూడా నువ్వుల నూనె వాడడం మంచిది. పేను కొరుకుడు సమస్య కూడా నువ్వుల నూనె తో  తగ్గిపోతుంది. నువ్వుల నూనె పెట్టుకుంటే జుట్టు బాగా పెరగడానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. 
 
అలానే మానసిక ఒత్తిడి మరియు ఆందోళన స్థాయిని తగ్గించి మెరుగు పరచడం లో కూడా నువ్వుల నూనె  బాగా సహాయ పడుతుంది. ఇలా అనేక ప్రయోజనాలు దీని ద్వారా మనకి కలుగుతాయి. ఒకవేళ మీ ఇంట్లో నువ్వుల నూనె వాడకుండా ఉన్నట్టయితే ఇప్పటి నుండి మొదలు పెట్టేయండి ఆరోగ్యంగా ఉండండి.