BREAKING NEWS

ఇలా 2021లో

2021లో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం పరాయి వాళ్ల చేతిలోకి వెళ్లడం, ఉగ్రవాదుల దాడులు, వానలు, వరదలతో ఎన్నో మరణాలు సంభవించడం. అవేకాక కొత్త వాటిని ఆవిష్కరించడం, దేశవిదేశాల్లో గుర్తింపులు, కొత్త బాధ్యతలను స్వీకరించడం. అందుకు వాక్సిన్ కార్యక్రమాల్లో పాల్గొనడం. ఆటల్లో నెగ్గి మన దేశానికి పేరు తేవడం, అవార్డులు అందుకోవడం, వారసత్వ కట్టడంగా, టూరిస్ట్ విలేజిగా మన తెలుగు రాష్ట్రానికి గుర్తింపు  రావడం... ఇలా చాలా విషయాలే జరిగాయి. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మరో అవతారం ఎత్తి ఒమిక్రాన్ గా విజ్రంభిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా....   
 
ప్రపంచంలో:-
ఆఫ్ఘానిస్తాన్లో తాలిబాన్ల పరిపాలన:- ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ముఖ్యంగా స్త్రీలకు భయంకరమైన కట్టుబాట్లను విధించింది. ఆ దేశం నుంచి వెళ్ళిపోవడానికి దాదాపు 640మంది ఒకే విమానం ఎక్కారు. అంతేకాదు ఆఫ్ఘానిస్తాన్ ను ‘ఇస్లామిక్ ఎమిరేట్ అఫ్ అఫ్గానిస్తాన్’ గా పేరు మార్చారు.

యూఎస్ ఎమ్మా రదుకాను:- యూఎస్ టెన్నిస్ ఆటలో గ్రాండ్ స్లామ్ టైటిల్ ను ఎమ్మా రదుకాను గెలిచింది.

దుబాయ్ ప్రభుత్వం:- 100శాతం పేపర్ లెస్ గవర్నెన్స్ గా మారిన ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రభుత్వంగా దుబాయ్ అవతరించింది. అన్ని రకాల అంతర్గత, బాహ్య సేవలను, ట్రాన్సాక్షన్స్ ను వంద శాతం డిజిటల్ ఫార్మాట్లోనే కొనసాగిస్తూ ఈ ఘనత సాధించింది. 
 
మన దేశంలో చోటు చేసుకున్న మార్పులు:-
దిల్లీ వ్యవసాయ చట్టాల నిరసనలు:- కొత్త వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున రైతులు ఢిల్లీకి చేరి ఎర్రకోటపైన ఉన్న జాతీయ జెండా పక్కన స్మారక పతకాన్ని ఎగరవేశారు. ఈ తోపులాటలో కొంతమంది రైతులు చనిపోగా, పోలీసులు గాయపడ్డారు.  

కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పులు :- శ్రీనగర్ లో ముష్కరులు సాధారణ ప్రజలపై దాడి చేయడంతో 11 మంది చనిపోయారు. అందులో ఉపాధ్యాయులు, వలస కూలీలు ఉన్నారు. అలా ఏడాదిలో ౩౦ మందిని చంపేసారు. భద్రత దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో 9 మంది  సైనికులు, 13 మంది ముష్కరులు మరణించారు.

పాండోరా పేపర్ల కలకలం:- పన్నుకట్టకుండా దాచిపెట్టిన సొమ్మును పరాయి దేశాలల్లో ట్రస్టుల పేరుతో ఆస్తులను పెంచుకుంటూపోతున్నారు. అలా మనదేశంలో దాదాపు 380 మంది ప్రముఖుల పేర్లు పాండోరా పేపర్లో ఉన్నాయి.
వాక్సిన్ డ్రైవ్:- ప్రధాని మోడీ ఈ వాక్సిన్ డ్రైవ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మొదటిది, రెండవ డోస్ లను ఇప్పటివరకు వేస్తూనే ఉన్నారు. అలా దాదాపు కొన్ని కోట్ల మంది ఈ వాక్సిన్ లను వేయించుకున్నారు.

బిపిన రావత్ మరణం:- తమిళనాడులో హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తోపాటు దాదాపు 13 మంది సైనికులు మరణించారు.     
 
మిస్ యూనివర్స్:- ఇజ్రాయెల్ లో జరిగిన మిస్ యూనివర్స్ అందాల పోటిలో మన దేశానికి చెందిన హర్నాజ్ కౌర్ సంధు విజేతగా నిలిచి “మిస్ యూనివర్స్ కిరీటాన్ని” కైవసం చేసుకుంది.  

తానా సాయం:- ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆస్పత్రులకు 25 కోట్లు విలువ చేసే మందులను, వైద్య పరికరాలను ఉచితంగా  అందజేస్తున్నారు.
 
ఒలింపిక్స్ లో సాధించిన విజయాలు:-
మీరాబాయి చాను(వెయిట్ లిఫ్టింగ్ లో రజతం పతకం),  పీవీ సింధు(బాడ్మింటన్ లో కాంస్య పతకం),  నీరజ్ చోప్రా(జావెలిన్ త్రోలో బంగారు పతకం), రవికుమార్ దహియా(రెజ్లింగ్ లో రజతం పతకం), లవ్లీనా బార్గొహెయిన్(బాక్సింగ్ లో కాంస్యం పతకం), భారత హాకీ జట్టు (కాంస్యం పతకం), భజ్ రంగ్ పూనియా (రెజ్లింగ్ లో కాంస్యం పతకాలను) సాధించారు.   
 
ఆంధ్రప్రదేశ్ లో:-

మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ:- ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లు ప్రతిపాదనను అసెంబ్లీ ముందు ఉంచారు. కానీ ఈ రాజధానుల వలన కలిగే  ప్రయోజనాలు గురించి వివరించడానికి ఇంకా సమయం కావాలని అందుకు చట్టంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉందని అందుకే బిల్లును ఉపసంహరించుకున్నట్లు ఏపీ జగన్ చెప్పారు.   

రైతుల మహోద్యమ సభ విజయవంతం:- అమరావతి రైతుల పాదయాత్ర రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహోద్యమ సభను నిర్వహించి పలు పార్టీల నాయకులను ఆ కార్యక్రమానికి  పిలిచి విజయవంతగా సభను ముగించారు.

సినిమా టిక్కెట్ ధరలో అయోమయం:- ఒకవైపు ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధర తగ్గించాలనుకుంటే, మరోవైపు ధియేటర్ యజమానులు ధియేటర్ ను మూసేస్తున్నారు.

జోవాద్ తుఫాన్:- ఆంధ్రలో వర్షాకాలంలో జోవాద్ ముప్పు సంభవించి ఎంతోమంది ప్రజలు ఇళ్లను కోల్పోయి, ప్రమాదవశాత్తు వరదలో కొట్టుకుపోయి చాలామంది చనిపోయారు.

ఎన్వీ రమణ పర్యటన:- సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ విజయవాడలో పర్యటించారు.
 
పద్మ శ్రీ అవార్డు గ్రహీతలు :- మొత్తం 119 మంది పాల్గొనగా, అందులో తెలుగు వారు....
తెలుగు రాష్ట్రాల్లో :- ఆంధ్రప్రదేశ్ లో కళారంగంలో అన్నవరపు రామస్వామి, నిడమోలు సుమతికి, సాహిత్యంలో అసవాది ప్రకాశ్ రావుకి,
తెలంగాణలో కళారంగంలో శ్రీకనకరాజుకి పద్మ శ్రీ అవార్డులు వచ్చాయి.
 
గుర్తింపులు:-

ఆంధ్రప్రదేశ్ కు చెందిన చెన్నుపాటి జగదీశ్ ‘ఆస్ట్రేలియన్ అకాడమీ అఫ్ సైన్స్’(ఎఎన్ యు) అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
విశాఖపట్నానికి చెందిన నీలి బెండపూడి ‘పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ’ అధ్యక్షురాలిగా ఎంపికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన అరవింద్ కృష్ణ ‘ఐబిఎమ్’ సంస్థకు సీఈవోగా బాధ్యతలను స్వీకరించారు.
రాజస్తాన్ లోని ఉదయపూర్ లో జరిగిన ‘మిస్ ఇండియా 2021’ అందాల పోటీలో విజయవాడకు చెందిన బిల్లుపాటి మల్లిక విజేతగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన శిరీష అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి తెలుగమ్మాయిగా చరిత్ర సృష్టించింది.
తెలుగమ్మాయి జాహ్నవి అమెరికాలోని అలబామాలో నాసా చేపట్టిన ‘ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం’లో చోటు సంపాదించింది.
తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన శంతన్ నారాయణ్ ‘అడోబ్’ కంపెనీకి సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు.
తెలుగువాడైన రాజాచారి అమెరికన్ అంతరిక్షంలోకి అడుగుపెట్టారు.
అజ్మీర్ కు చెందిన పరాగ్ అగర్వాల్ ‘ట్విట్టర్’ సంస్థకు సీఈవోగా నియమితులయ్యారు. 

ప్రపంచం మెచ్చినవాటిలో:- యునెస్కో వారసత్వ కట్టడంగా ‘రామప్ప’ దేవాలయాన్ని ఎంచుకున్నారు. బెస్ట్ టూరిస్ట్ విలేజీగా తెలంగాణాలోని ‘భూదాన్ పోచంపల్లి’ని ఎంపిక చేశారు.
 
మరణించిన కొందరు ప్రముఖులు:-

శివశంకర్ మాస్టర్(భారత నృత్య దర్శకుడు), సిరివెన్నల సీతారామశాస్త్రి (తెలుగు పాటల రచయిత), బిఎ రాజు(తెలుగు నిర్మాత), జయంతి(తెలుగు సీనియర్ నటి), జయప్రకాశ్ రెడ్డి(తెలుగు హాస్య నటుడు), కొణిజేటి రోశయ్య (రాజకీయ నాయకుడు), దిలీప్ కుమార్ (బాలీవుడ్ నటుడు), పునీత్ రాజ్ కుమార్(కన్నడ నటుడు), వివేక్ (తమిళ హాస్యనటుడు), కైతప్రమ్ విశ్వనాథన్ నంబూరి(మలయాళ సంగీత దర్శకుడు)...  మరికొంత మంది ప్రముఖులు ఉన్నారు.

కరోనా (ఒమిక్రాన్ వేరియంట్):- ఈ ఏడాది సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి కారణంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితోపాటు డెల్టా వేరియంట్ అని, ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో ప్రపంచదేశాలు దీని బారిన పడుతున్నారు.
 
2020 సంవత్సరంలో ఒమిక్రాన్ కేసులు తగ్గాలని కోరుకుంటూ, అందుకు మనవంతుగా వాక్సిన్ వేయించుకొని, పరిశుభ్రతను పాటిస్తూ మన బాధ్యతను మనం నిర్వర్తించుద్దాం...