భారత సైన్యాధ్యక్షుడిగా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా జనరల్ బిపిన్ రావత్ అత్యుత్తమ సేవలు అందించారు. తండ్రి స్ఫూర్తితో ఆయన విధులు నిర్వర్తించే బెటాలియన్‌లోనే చేరి, అంచెలంచెలుగా ఎదిగి త్రిదళాధిపతి స్థాయికి చేరారు. అదే సైన్యంలో దాదాపు 40 ఏళ్లు సేవలు అందించి, ఎన్నో శిఖరాలను అధిరోహించారు.
అటువంటి భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అయిన బిపిన్ రావత్ నిన్న తమిళనాడులో చోటుచేసుకున్న హెలికాప్టర్ ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. బిపిన్ తో సహా మరో 13 మంది చనిపోవడం దురదృష్టకరం! ప్రమాదం జరిగిన వెంటనే వీరిని సమీపంలోని వెల్లింగ్టన్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా, వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీస్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు బయలుదేరిన సమయంలోనే ప్రాణాలు కోల్పోవడాన్ని కాలేజీ సిబ్బంది, అధ్యాపకులు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఆయన అదే కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థి. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిన తర్వాత డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీలోనే బిపిన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తాజాగా వెల్లింగ్టన్ అధ్యాపకులు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించేందుకు వెళ్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన జరిగింది. ఆయన ఆర్మీలో చేరినప్పటినుంచి, చేసిన సేవలు, విశేష కృషి గురుంచి ఈరోజు మనం తెలుసుకుందాం:
బాల్యం, చదువు…
ఉత్తరాఖండ్‌లోని హిందూ గర్వాలీ రాజ్‌పుత్ కుటుంబంలో 1958 మార్చి 16న జన్మించారు బిపిన్ రావత్. బిపిన్ తండ్రి లక్ష్మణ్‌సింగ్ రావత్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ హోదాలో పని చేశారు. ఆయన తల్లి ఉత్తరకాశీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమార్తె. దెహ్రాదూన్‌లోని కాంబ్రియన్ హాల్, సెయింట్ ఎడ్వర్డ్స్ పాఠశాలలో రావత్ విద్యాభ్యాసం పూర్తి చేశారు. పాఠశాల విద్య తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. ఆపై తమిళనాడు నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్ కంటోన్మెంట్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ (డీఎస్ఎస్సి)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఆయన ప్రతిభకు ‘స్వార్డ్ ఆఫ్ ఆనర్’ అవార్డు లభించింది.
డిగ్రీ అయ్యాక అమెరికా కాన్సాస్‌లోని యూఎస్ ఆర్మీ కమాండ్, జనరల్ స్టాఫ్ కాలేజీలో హయ్యర్ కమాండ్ కోర్సు, దేవీ అహల్యా విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ పూర్తి చేశారు. మద్రాస్ యూనివర్సిటీ ఆయనకు రక్షణ రంగంలో ఎంఫిల్ అందించింది. మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్సెస్‌లోనూ రెండు డిప్లొమాలు కూడా ఉన్నాయి. మేరాఠ్‌లోని చౌధరి చరణ్‌సింగ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందారు.
ఆర్మీలోకి...
1978 డిసెంబరు 16న బిపిన్ రావత్ ఆర్మీలో చేరారు. తన తండ్రి పని చేసిన గోర్ఖా రైఫిల్స్ ఐదో బెటాలియన్‌లోనే రావత్ బాధ్యతలు చేపట్టారు. ఎత్తైన ప్రాంతాల్లో చేసే యుద్ధాల్లో రావత్‌కు తిరుగేలేదు. పదేళ్లపాటు తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్లను నిర్వహించారు. జమ్మూ కశ్మీర్‌లోని ఉరీలో మేజర్ హోదాలో పని చేశారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 2016 డిసెంబరు 31న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇద్దరు సీనియర్లను సైతం వెనక్కి నెట్టి ఆయన ఈ పదవి దక్కించుకున్నారంటే అతిశయోక్తి కాదు. గోర్ఖా బ్రిగేడ్ నుంచి ఆర్మీ చీఫ్‌గా ఎదిగిన ముగ్గురు అధికారుల్లో రావత్ ఒకరు. ఇదేకాక నేపాల్ ఆర్మీకి గౌరవాధ్యక్షులుగానూ ఉన్నారు.
రావత్ కీలక మిషన్లు...
1987లో చైనాతో జరిగిన ఘర్షణలో రావత్ బెటాలియన్ ముందుండి పోరాడింది. 1962 యుద్ధం తర్వాత మెక్‌మోహన్ రేఖ వద్ద జరిగిన తొలి సైనిక ఘర్షణ ఇదే. ఈ సమయంలో తన .బృందాన్ని ఆయన సమర్థంగా నడిపించారు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐరాస తరఫున నిర్వహించిన మిషన్ రావత్ విజయాల్లో గొప్పది. ఐరాస శాంతి దళాల తరఫున పోరాడిన బృందానికి రావత్ అధ్యక్షతన వహించారు. మిషన్‌లో పాల్గొన్న సైనికుల్లో సగంమంది రావత్ బృందంలో ఉన్నారు. ఈ ఆపరేషన్ దాదాపు నాలుగు నెలలు జరిగింది.
◆ 2015 జూన్‌లో మణిపుర్‌కు చెందిన యూఎన్‌ఎల్‌ఎఫ్‌డబ్ల్యూ తిరుగుబాటుదారులు భారత సైనికులపై దాడికి దిగబడి 18మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ సమయంలో దిమాపుర్ కేంద్రంగా పనిచేసే కోర్ 3 కమాండింగ్ అధికారిగా రావత్ వ్యవహరించారు. ఈ ఘటన తరువాత సీమాంతర దాడులతో భారతసైన్యం వారిపై విరుచుకుపడింది. 21వ బెటాలియన్‌కు చెందిన పారాషూట్ రెజిమెంట్, ఎన్ఎస్సీఎన్-కె తిరుగుబాటు సంస్థ స్థావరాన్ని ధ్వంసం చేసి, పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
◆ 2016 సెప్టెంబరు 29న పాక్ సరిహద్దుల్లోకి భారత సైన్యం వెళ్లి అత్యంత సాహసోపేతంగా అక్కడి ఉగ్ర స్థావరాలను కూకటివేళ్లతో పెకలించిన ఘటన తరచి చూస్తే గుర్తొచ్చే పేరు బిపిన్ రావత్. ఈయన భారత సైన్యానికి ఉపఅధిపతి అయిన నెలరోజుల్లోపే ఈ దాడి జరిగింది. ఉరీలోని సైనిక శిబిరం మీద, పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగం మీద జరిగిన దాడులకు ప్రతీకారంగా బిపిన్ రావత్ నేతృత్వంలో చేసిన ఈ సర్జికల్ స్ట్రైక్‌లో పలువురు ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు వాళ్ల శిబిరాలను సైతం ధ్వంసం చేశారు.
దౌత్య సేవలూ..
మిలిటరీతో పాటు దౌత్యపరంగానూ విశేష సేవలు అందించారు రావత్. అమెరికా, రష్యా, నేపాల్, శ్రీలంక, మయన్మార్, భూటాన్ తదితర దేశాల్లో పర్యటించారు. ఆయా దేశాధ్యక్షులు, సైనికాధికారులతో కీలక సమావేశాలు నిర్వహించారు. దేశాల మధ్య సైనిక సంబంధాలను బలోపేతం చేయడంలోనూ కృషి చేశారు.
పలు పతకాలు..
సుదీర్ఘ సేవాకాలంలో ఆయనకు ఉత్తమ యుద్ధసేవా మెడల్, అతివిశిష్ఠ సేవా మెడల్, యుద్ధసేవా మెడల్, సేవామెడల్, విశిష్ఠ సేవామెడల్ లాంటి పలు పతకాలు అందాయి. ఐక్యరాజ్యసమితిలో పని చేసే సమయంలో ఆయనకు ఫోర్స్ కమాండర్ నుంచి ప్రశంసలు దక్కాయి.
◆ జాతీయ భద్రత, నాయకత్వం లాంటి అంశాలపై వివిధ పత్రికల్లో ఆయన లెక్కలేనన్ని వ్యాసాలు రాశారు.
చివరిసారిగా మాట్లాడిన బిపిన్:
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జనరల్ బిపిన్ రావత్ కొద్దిసేపు ప్రాణాలతోనే ఉన్నారని.. చివరిసారిగా తనతో ఆయన మాట్లాడారని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది.
శివకుమార్ అనే ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. మధ్యాహ్నం మేం పనిచేస్తున్న చోట భారీ శబ్దం వినపడింది. దగ్గరకు వెళ్లి చూస్తే చెట్టుకొమ్మలపై ఓ హెలికాప్టర్ కాలుతూ కనిపించింది. ఆ చెట్టు పొదల్లో మాకు ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలతో కనిపించారు. వారిద్దరూ ఆ హెలికాప్టర్ నుంచే దూకేసి ఉంటారని, వారి వద్దకు వెళ్లి చూస్తే, వాళ్ల బట్టలు పూర్తిగా కాలిపోయి ఉన్నారు. వారిలో ఒకరు దాహంగా ఉంది, కొన్ని మంచినీళ్లు కావాలని అడిగారు. కానీ మేం ఆయనకు ఏం కాదని ధైర్యం చెప్పి.. తప్పక సాయం చేస్తామని చెప్పాం. ఒక బెడ్ షీట్ సహాయంతో పొదల్లో నుంచి వారిని బయటకు తీసుకొచ్చాం.
అప్పుడే రెస్క్యూ సిబ్బంది వచ్చి ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటివరకు కూడా నేను ఆయన్ను ఎవరో సాధారణ వ్యక్తి అనే అనుకున్నాను. కానీ నేను మాట్లాడిన వ్యక్తి సీడీఎస్ బిపిన్ రావత్ అని కొంతమంది చెప్పారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని నేను అప్పుడే తెలుసుకున్నానని ఘటన జరిగిన తీరును శివకుమార్ అనే వ్యక్తి వివరించాడు. ఈ దేశం కోసం అహర్నిశలు కష్టపడిన గొప్ప వ్యక్తి చివరి నిమిషంలో మంచినీళ్లు అడిగినా ఇవ్వలేకపోయానని బాధపడ్డాడు.