BREAKING NEWS

తెరకు తెర పడినట్టేనా...

ఎంటర్టైన్మెంట్ అంటేనే సినిమా.. అలాంటిది సినిమాను చూడాలంటే టీవిలోనో, మొబైలు ఫోన్లో చూస్తేనో మనకు తనివి తీరదు. పెద్ద తెరపైన, చీకటి గదిలో చూస్తూ ఒక్కో దృశ్యం ఒక్కో అనుభూతిని కలిగిస్తుంది. ఫైట్స్, కామెడీ, డ్యాన్స్, థ్రిల్లర్, సైంటిఫిక్, హర్రర్.. ఇలా ఏ జోనర్ కి సంబందించిన చిత్రమైన సరే థియేటర్ లో చూస్తే ఆ సంతోషమే వేరు. తమ అభిమాన కథానాయకుడి కోసం ఎదురుచూస్తూ ఈలలు వేస్తూ, అరస్తూ అభిమానాన్ని చాటుకుంటారు. మరీ అలాంటి అనుభవం పొందడంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు కోర్టు ఇచ్చే తీర్పే ఎదురుచూపు అవుతుంది.   

ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు సోదాలు చేసి నిబంధనలను అతిక్రమించిన వారి థియేటర్లను సీజ్ చేశారు. అంతేకాదు థియేటర్ లో టిక్కెట్లకంటే తినుబండరాల ధరే ఎక్కువగా ఉందని ప్రేక్షకులు వాపోతున్నారు. మరికొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వతహాగా థియేటర్లను మూసివేస్తున్నారు. తక్కువ ధరకు టిక్కెట్లను అమ్మితే సినిమా బాగా ఆడిన థియేటర్ యజమానులకు మాత్రం బాగా నష్టాలవస్తున్నాయని బాధపడుతున్నారు.
 
అసలేం జరిగిందంటే .....

ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్ల యజమానులు టికెట్ ధరలను ఇష్టానుసారంగా పెంచుతూ పోవడంతో, దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గిస్తూ జీవో 35ను అమలు చేసింది. దానిని సవాలు చేస్తూ పలు థియేటర్ల ఓనర్లు హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై సింగల్ జడ్జి విచారించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను కొట్టిపారేసింది.  విచారణలో భాగంగా కోర్టుకు వచ్చిన థియేటర్ యజమానులకు మాత్రమే టికెట్ ధరలను పెంచుకునే అవకాశం ఉందని చెప్పారు.

దీంతో సింగల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తరఫు హోంశాక ముఖ్య కార్యదర్శి డివిజన్ బెంచ్ లో అప్లై చేసుకున్నారు.ఆ తర్వాత  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఆ విచారణలో భాగంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది చెబుతూ.. థియేటర్ యజమానులు టికెట్ ధరలను పెంచుతూపోతే అది సామాన్యుడిపై భారంగా మారుతుందని చెప్పారు.

ఇరువర్గాల వాదనలను విన్నారు. ఆ తర్వాత డివిజన్ బెంచ్ స్పందిస్తూ థియేటర్ యజమానులు టికెట్ ధరల ప్రతిపాదనను జాయింట్ కలెక్టర్(జేసీ)కి ఇవ్వాలని ఆదేశించింది. ఇక ఈ ధరల నియంత్రణ విషయంలో జేసీదే తుది నిర్ణయం అని చెప్పి, దాంతోపాటు ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు. అంతేకాదు కోర్టుకురాని మిగతా యాజమానుల థియేటర్ లల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్లు అమ్మాలని రాష్ట్ర హోంశాఖ ఆదేశాలను ఇచ్చింది. అయిన కూడా ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంద. దీనిపై జనవరి 4న తుది తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ఈ వివాదం కొనసాగుతుండగానే ప్రభుత్వం మరొక జీవోను ముందుకు తీసుకువచ్చింది. అది సినిమా టికెట్ల అమ్మకాలు కేవలం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరగాలని జీవో 142 ను జారీ చేసింది. దీని పూర్తి బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి అప్పగించింది. టికెట్ బుక్ చేసుకోవడానికి గానీ, థియేటర్ లో కొనడానికి గానీ లేని విధంగా దీనిని రూపొందిస్తున్నారు.

ఇతరాంశాలు :-
  •  ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను తగ్గించడం సరైనది కాదని అన్నారు. థియేటర్లో వచ్చే ఆదాయంకంటే పక్కనే ఉన్న కిరాణా దుకాణంలో వచ్చే డబ్బే ఎక్కవ” అని హీరో నాని అన్నారు.
  •  సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే టికెట్ల ధరలను తగ్గించామని బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతి వస్తువుకూ ఎంఆర్పీ ఉంటుందని ఇష్టం వచ్చినట్లు ధరను పెంచడం కాదని అందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఏదైనా సమస్యలు ఉంటే చెప్పాలని ప్రకటించారు.
  •  తెలుగు రాష్ట్రాలలో మొన్న బాలయ్య చిత్రం “అఖండ”, నిన్న అల్లుఅర్జున్ చిత్రం “పుష్ప”.. ఇలా ఇప్పటివరకు వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ధ పెద్ద హిట్ అయ్యాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెలంగాణలో కంటే తక్కువ వసూలను  రాబట్టింది.
  •  సంక్రాంతి పండగకు విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రాలు భారీ బడ్జెట్ తో వస్తున్నత్రిపుల్ ఆర్ (rrr), రాధేశ్యామ్ సినిమాలు..  ప్రభుత్వం చెప్పిన ధరకే టిక్కెట్లు అమ్ముడవుతే ఆ సినిమా కలెక్షన్ల పై భారీ ప్రభావం పడుతుంది. 
ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్ ధరలు ...

ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకూ అనేక ప్రాంతాల వారీగా సినిమా టికెట్ ధరను ప్రభుత్వమే నిర్ణయించింది. కొత్త ధరల ప్రకారం టికెట్ ధర 5రూపాయల నుంచి 250 వరకు పెరిగే అవకాశం ఉంది. అటువంటిది మున్సిపల్ నుంచి గ్రామ పంచాయితీ వరకు గల పలు థియేటర్ల టికెట్ ధరలు ఈ విధంగా ఉండనున్నాయి.

* మల్టీప్లెక్స్- ప్రీమియం 250 నుంచి 80 వరకు, డీలక్స్ అయితే 150 నుంచి 50 వరకు, ఎకానమీ 75 నుంచి 30 వరకు, 

ఏసీ – ప్రీమియం 100 నుంచి 20 వరకు, డీలక్స్ అయితే 60 నుంచి 15 వరకు, ఎకానమీ అయితే 40 నుంచి 10 వరకు,

నాన్ ఏసీ- ప్రీమియం 60 నుంచి 15 వరకు,  డీలక్స్ అయితే 40 నుంచి 10 వరకు, ఎకానమీ అయితే 20 నుంచి 5 రూపాయలుగా తీసుకొనున్నారు. .
  •  తెలంగాణలో సినిమా టికెట్‌ రేట్లను పెంచుకునేందుకు తాజాగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలా టికెట్ కు 50 నుంచి 150 వరకు పెంచింది. అదనంగా నిర్వహణ చార్జీల కింద 3 నుంచి 5 రూపాయల వరకు తీసుకుంటున్నారు.