లెక్కలంటేనే మెదడుకు పదును పెట్టే టాస్క్... ఎన్నో సవాళ్లు దాటితేగానీ ఒక సమస్యకు సమాధానం దొరకదు. అలాంటి సమస్యకు సమాధానం కనిపెట్టింది మన తెలుగమ్మాయి ప్రొఫెసర్ నీనా గుప్తా. డెబ్భై ఏళ్లుగా ఎవరివల్ల సాధ్యంకాని సమస్యకు పరిష్కారాన్ని చూపి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకుగాను ఆమెకు ఈ ఏడాది మ్యాథమెటిక్స్‌లో అత్యున్నతమైన ‘రామానుజన్ అవార్డు’ లభించింది. ఈ అవార్డు అందుకున్న మూడో మహిళ ఈమె. కాబట్టి ఈ ప్రతిష్టాత్మక అవార్డు గ్రహీత నీనా గుప్తా జీవిత, గణిత శాస్త్రంలో చేసిన విశేష కృషి గురుంచి ఈరోజు మనం తెలుసుకుందాం:
నీనా గుప్తా కోల్‌కత్తాలో పుట్టి, పెరిగారు. ఆమె తన పాఠశాల విద్యను డన్లాప్లోని ఖల్సా హైస్కూల్లో పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె బెతున్ కాలేజీలో బీఎస్సీ మ్యాథ్స్ చదివింది.
ప్రస్తుతం ఆమె కోల్‌కత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్(ఐఎస్ఐ)లో ప్రొఫెసర్‌గా పని చేస్తుంది. ఆమె ఇదే కాలేజీలో మ్యాథ్స్‌లో పీజీ పూర్తి చేసింది. తర్వాత ఆల్జిబ్రాయిక్ జియోమెట్రీలో పీహెచ్డీ చేసి, ప్రొఫెసర్‌గా చేరింది.
2014లో ఆల్జిబ్రాయిక్ జియోమెట్రీలో ‘జరస్కీ క్యాన్సిలేషన్ కంజెక్చర్’ అనే చిక్కుప్రశ్నకి సమాధానం కనిపెట్టింది. దీంతో ఆ ఏడాది తనకు ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ యంగ్ సైంటిస్ట్ విభాగంలో మెడల్ బహుకరించారు.
దేశవ్యాప్తంగా గణిత శాస్త్రంలో జరిపిన విశేష కృషికి గుర్తింపుగా ప్రతి ఏటా యువ గణిత శాస్త్రవేత్తలకు ‘రామానుజన్ ప్రైజ్ ’ను బహుకరిస్తారు. ఈ ఏడాది ఈ ప్రైజ్ కు భారతీయ గణిత శాస్త్రవేత్త నీనాగుప్తా ఎంపిక కావడం విశేషం!
ఈ ప్రతిష్టాత్మక అవార్డు సాధించిన నాలుగో భారతీయ గణిత శాస్త్రవేత్త కూడా నీనానే! అలాగే ఈ అవార్డును సాధించిన మూడో మహిళగానూ నీనా గుప్తా గుర్తింపు సాధించారు. ఆమె కంటే ముందు భారత్ నుంచి ముగ్గురు గణిత శాస్త్రవేత్తలు రామదురై సుజాత (2006లో), అమలేందు కృష్ణ (2015లో), రీటాబత మన్షి(2018లో) ఈ అవార్డును సాధించారు. నీనా గుప్తా కంటే ముందు ఈ అవార్డును సాధించిన పై ముగ్గురు శాస్త్రవేత్తలకు కూడా కోల్‌కత్తాలోని ఐఎస్ఐతో అనుబంధం ఉండటం గమనార్హం.
అవార్డు తెచ్చిన అల్జీబ్రా...
అఫిన్ అల్జీబ్రిక్ జామిట్రీ, కమ్యుటేటివ్ అల్జీబ్రాలో చేసిన విశేష కృషికిగానూ ఆమెకు ఈ అవార్డు వరించినట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 2005 నుంచి ఈ అవార్డును ఇవ్వడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం 45 ఏళ్ల కంటే తక్కువ వయస్కులైన యువ గణితశాస్త్రవేత్తలకు ఈ అవార్డును ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. రామానుజన్ ప్రైజ్ కమిటీలో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ గణితశాస్త్రవేత్తలు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
అవార్డు గెలిచాక...
‘రామానుజన్ ప్రైజ్’ అవార్డును గెలుచుకోవడం చాలా గర్వంగా ఉంది. గణితశాస్త్రంలోని తన పరిశోధనలను మరింత లోతుగా కొనసాగించేందుకు ఈ అవార్డు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. కమ్యుటేటివ్ అల్జీబ్రాలో ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
గణితశాస్త్రంలో ఇప్పటివరకు సమాధానాలు లేని పలు ప్రశ్నలను పరిష్కరించాల్సిన ఆవశ్యకం రాబోయే రోజుల్లో ఉందని తెలిపారు.
చిన్నతనం నుంచే గణితశాస్త్రం అంటే ఆమెకు విపరీతమైన ఇష్టం. గణితశాస్త్రంలో తను కెరీర్ ను కొనసాగిస్తానని ఊహించలేదన్నారు. గణితంలో డిగ్రీ చదివేటప్పుడు... తన ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు తనను ఎంతగానో ప్రోత్సహించారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. గణితశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించే మహిళల సంఖ్య ఇప్పుడిప్పుడే క్రమంగా పెరుగుతున్నట్లు ఆమె వివరించారు.