కరోనా రెండో దశ తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజల మీదికి ఒమిక్రాన్ కలవర పెడుతోంది. దక్షిణాఫ్రికాలో మొదట వెలుగు చూసిన ఈ కరోనా కొత్త వేరియంట్.. రెండో దశలో వార్తలకెక్కిన డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తుంది.
దీనిలో కొన్ని ప్రమాదకర లక్షణాలు ఉన్నందున ఒమిక్రాన్‌ను ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). ఈ వైరస్ వల్ల పెద్దగా ప్రాణనష్టం లేకపోయినా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని మాత్రం వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది చిన్నపిల్లలను సైతం వదలడం లేదు. దక్షిణాఫ్రికాలో 5 ఏళ్లలోపు పిల్లలు ఎక్కువగా ఒమిక్రాన్ బారిన పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తల్లిదండ్రులకు ఇది ఆందోళన కలిగించే అంశమే.
కరోనా వైరస్‌లోని స్పైక్స్(కొమ్ములు) వైరస్ బారిన పడిన వారిని అనారోగ్యానికి గురిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రూపం మార్చుకుని వచ్చిన ఒమిక్రాన్‌లో స్పైక్స్ మరింత పెరిగి, ఇంకొంత శక్తివంతంగా మారాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో చెబుతున్నారు. డెల్టాతో పోల్చితే ఈ వేరియంట్లో 50కి పైగా మ్యుటేషన్స్ వచ్చాయి.
మీజిల్స్ కంటే కూడా ఒమిక్రాన్ వేరియంటే వేగంగా విస్తరిస్తుందని తెలుస్తుంది. అతి తక్కువ వ్యవధిలో ప్రపంచ నలుమూలలకు వ్యాపిస్తూ ఉండటమే ఇందుకు ఒక నిదర్శనం.
రోగ నిరోధక శక్తిని దాటుకుంటూ...
కొత్త వేరియంట్లో స్పైక్స్ సంఖ్య పెరగడం వల్ల ‘విరులెన్స్’(వ్యాధి ప్రమాద స్థాయి) కూడా పెరిగింది. అంటే, ఒమిక్రాన్ వేరియంట్లో ఇన్ఫెక్షన్ తీవ్రత కూడా ఎక్కువే అన్నమాట. ఇమ్యూనిటీని ఎదిరించే
అవకాశాలు లేకపోలేదు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారినీ సైతం ఇది వదలదు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వైరస్ ప్రభావం కాస్త తక్కువగానూ, తీసుకోని వారిలో కొంత ఎక్కువగానూ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వేరియంట్ స్వభావంపై పూర్తిస్థాయి స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుంది.
మందుల పనితీరు కష్టమే...
ఒమిక్రాన్ వేరియంట్‌కు రోగ నిరోధకశక్తిని దాటుకుని వ్యాపించే శక్తి ఉంది. దీంతో యాంటీ వైరల్ డ్రగ్స్ ప్రభావం కొంత తగ్గొచ్చు. వీటికి సంబంధించి మరింత స్పష్టత కోసం, ఇంకొంత కాలం నిరీక్షించాల్సిందే.
గత వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ లక్షణాలు కొంత వేరుగా ఉన్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ ప్రభావానికి గురైన 80శాతం మందిలో ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించడం లేదు. అంటే, వైరస్ సోకినవారు ఎసింప్టమాటిక్గా ఉంటున్నారు. ఇది కొంత విస్తుపోయే విషయమే! ఎందుకంటే, లక్షణాలు కనిపిస్తే ఎంతో కొంత జాగ్రత్త పడతాం. ఉపశమనం కలిగించే అంశమేంటంటే, ఈ వేరియంట్ గతంలో మాదిరిగా ఊపిరితిత్తులపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. దీంతో అత్యవసర ఆక్సిజన్ అవసరం లేకపోవచ్చన్నది అందిన సమాచారం. డెల్టా వేరియంట్ మాదిరిగా రుచి, వాసన కోల్పోయే పరిస్థితి లేదు. కానీ ఈ విషయంలో స్పష్టత రావాలంటే మరిన్ని కేసులను అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
థర్డ్‌వేవ్ అనుకోవచ్చు...
ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి, మరింత ఎక్కువమందికి సోకే ప్రమాదం ఉంది. ఈ విస్తరణ థర్డ్ వేవ్‌గా పరిణమించే అవకాశాలూ లేకపోలేదు. మరో విధంగా చూస్తే అంతర్జాతీయంగానూ మూడో దశ(థర్డ్‌వేవ్)గా పరిగణించవచ్చు. ఎందుకంటే ఈ వేరియంట్ ముందు ఒక దేశంలో మొదలై వెనువెంటనే 30 దేశాలకుపైగా వ్యాపించింది. ప్రభావిత దేశాల కేసులను గమనిస్తే.. వైరస్ తీవ్రత పెద్దగా కనిపించడం లేదు. కానీ రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో కచ్చితంగా చెప్పలేం. ముందు జాగ్రత్తలు పాటించడం తప్ప వేరే మార్గం లేదు.
పిల్లలు సైతం ప్రభావితులవుతున్నారు...
గత వేరియంట్స్ పిల్లలవరకు రాలేదు. కానీ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే.. ఒమిక్రాన్ పిల్లలపైనా ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తుంది. 5 ఏళ్లలోపు పిల్లలు, 15 - 19 ఏళ్ల వరకు బాలబాలికలు ఆసుపత్రిలో చికిత్స కోసం ఎక్కువగా చేరుతున్నట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ నిపుణులు వెల్లడించారు. అయితే, మన దేశానికి వచ్చేసరికి ఎలా ప్రభావం చూపిస్తుందో చూడాలి.
బూస్టర్ డోస్ అవసరమే...
ఏ వ్యాక్సిన్ అయినా సరే, కొంతకాలం తరువాత దానివల్ల ఉత్పత్తి అయిన యాంటీబాడీస్ తగ్గిపోతాయి. దీని ప్రకారం ప్రస్తుతం అందరికీ కరోనా బూస్టర్ డోస్ అవసరమే. రెండు డోసులు తీసుకున్న తరువాత కూడా బూస్టర్ డోస్ మంచిదే. వాస్తవానికి బూస్టర్ డోస్ పనితీరుపై స్పష్టత లేదు. రెండు డోసులు ఒకే రకమైన వ్యాక్సిన్ తీసుకున్న వారు, బూస్టర్ డోస్ కింద ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం రెండో డోసు తీసుకున్న 6 నెలల తరువాతే బూస్టర్ డోసు తీసుకోవడం మంచిది. ఈ అనివార్య పరిస్థితుల్లో పిల్లల టీకాలు ఎంత త్వరగా మార్కెట్లోకి వస్తే అంత మేలని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం.
తొలి ఒమిక్రాన్ మరణం...
యూకేలో ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇక్కడ రోజురోజుకూ అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా యూకేలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది.