అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తుల్లో తరచి చూస్తే ఆయనే మొదటగా కనిపిస్తారు. భౌతికశాస్త్రంలో విశేష ప్రావీణ్యం కలిగిన ఆయన.. అంతరిక్ష పరిశోధన వ్యవస్థను సైతం స్థాపించారు. తద్వారా భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలకు, విజయాలకు మూలమయ్యారు. భారతదేశపు తొలి ఉపగ్రహమైన ఆర్యభట్టను రష్యా సాయంతో రూపొందించడమే కాక మన దేశం నుంచే ప్రయోగించిన దిట్ట... ఆయనే డా. విక్రమ్ సారాభాయ్. అటువంటి శాస్త్రవేత్త జీవిత, పరిశోధన విశేషాల గురుంచి (డిసెంబరు 30న ఆయన వర్థంతి సందర్భంగా) ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం:
జననం, చదువు:-
1919 ఆగస్టు 12వ తేదీన గుజరాత్ కి చెందిన అహ్మదాబాద్ లో అంబాలాల్, సరళాదేవి దంపతులకు జన్మించారు విక్రమ్ సారాభాయ్. వీరిద్దరికి ఎనిమిదిమంది సంతానం. వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనటం వల్ల మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్లాల్ నెహ్రూ లాంటి ఎంతోమంది ప్రముఖులతో పరిచయాలు. ఉండటంతో తరచూ వీరింటికి వస్తూ పోయేవారు. దీంతో విక్రమ్ సారాభాయ్ వ్యక్తిగతంగా వారి ఆలోచనవిధానాలకు ప్రభావితులయ్యారు. తన ఎనిమిదిమంది పిల్లలను చదివించడానికి విక్రమ్ తల్లి మాంటిస్సోరీ లాంటి ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది.
పాఠశాల విద్య అనంతరం గుజరాత్ కళాశాలలో మెట్రిక్ విద్యను పూర్తి చేసుకున్నారు విక్రమ్. తర్వాత పై చదువుల కోసం ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్లారు.
1940వ సంవత్సరంలో నేచురల్ సైన్సెస్‌లో ఉత్తీర్ణులయ్యారు. అదే సమయంలో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభం కావటంతో ఆయన దేశానికి తిరిగి వచ్చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సర్ సి.వి.రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపై పరిశోధన మొదలుపెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి 1945వ సంవత్సరంలో తిరిగి కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్లారు. పీహెచ్‌డి పట్టాను సాధించుకుని 1947లో తిరిగి మళ్లీ భారత్ చేరుకున్నారు.
పరిశోధనా జీవితం…
◆ దేశానికి ఏదైనా మేలు చేయాలనే దృఢ నిశ్చయంతో… వారి కుటుంబ ట్రస్టు సాయంతో విక్రమ్ 1947 నవంబర్ 11న అహ్మదాబాద్‌లో ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ(పీఆర్ఎల్)ను ఏర్పాటు చేశారు. అప్పుడాయన వయసు కేవలం 28 ఏళ్లు.
అహ్మదాబాద్ లోని ఐఐఎం ఏర్పాటు కూడా ఆయన వల్లే సాధ్యపడింది.
◆ 1957లో రష్యా తన దేశం నుంచి మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్ ను ప్రయోగించింది. ఇది తెలిసి భారత్ భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ల అవసరం, ఆవశ్యకతలను గుర్తించి అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూకు వివరించారు విక్రమ్. అటువంటి శాటిలైట్ ను భారత్ లోనూ ఏర్పాటు చేద్దామని విక్రమ్ నెహ్రూను ఒప్పించారు.
◆ 1962లో హోమీ బాబా(భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడు) పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్(ఐఎన్సీఓఎఫ్ఎస్ఆర్) సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
◆ అదే తర్వాత 1969లో (ఇస్రో- ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)గా మారింది. నేటికీ గనతలంపై భారత్ విజయాలు సాధించడంలో ఎంతగానో తోడ్పడింది. ఆయన ఇస్రో అధినేతగా కూడా పనిచేసి దానిని మేటి సంస్థగా రూపొందించారు.
◆ అలాగే తొలి రాకెట్ లాంచింగ్ స్టేషన్‌ను కేరళలోని తిరువనంతపురంలో నెలకొల్పారు. 1963 నవంబరు నెలలో ఇక్కడ్నుంచి ఓ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.
◆ సాంకేతిక పరిజ్ఞానం వల్ల పొందే ఉపయోగాలను అతి సామాన్యులకు అందుబాటులోకి తీసుకుని రావాలని అనుకునేవారు. అప్పుడే దేశంలోని ఎన్నో సమస్యలను సాధ్యమైనంతమేర పరిష్కరించవచ్చని సారాభాయ్ తన తోటి శాస్త్రవేత్తలను ఆ దిశగా ప్రోత్సహించేవారు. గ్రామీణ ప్రజల కోసం ఉపగ్రహాలను రూపొందించాలానే అంశం సారాభాయ్ వ్యూహంలో ప్రధానంగా ఉండేది.
విశేష గుర్తింపు...
◆ ‘భారత అంతరిక్షరంగ పితామహుడు’గా కీర్తి సంపాదించుకున్న సారాభాయ్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన్ను 1962లో శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డుతో సత్కరించింది.
◆ 1966లో పద్మ భూషణ్ అవార్డుతో గౌరవించింది.
◆ మరణానంతం 1972లో పద్మ విభూషణ్ ప్రకటించి సారాభాయ్ సేవలను స్మరించుకుంది.
◆ భారతీయ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ సేవలను స్పెషల్ డూడుల్‌తో సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ అరుదైన గౌరవాన్ని ఇచ్చింది.
◆ ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ -2 ప్రయోగంలో భాగంగా 'విక్రమ్' అనే పేరుతో ఓ ల్యాండర్‌ను విక్రమ్ సారాభాయ్ గౌరవార్థంగా ప్రయోగించారు.
ఇతరాంశాలు...
◆ చిన్న, చిన్న రాకెట్ల నుంచి అతి పెద్ద రాకెట్ ప్రయోగ వాహననౌకలు, ఉపగ్రహాల వరకు భారత్ అంతరిక్షంలో ప్రయోగాలు చేసేంతలా ఎదిగిందంటే అందుకు మూలకారణం సారాభాయ్ నే.
◆ ఈ పరిశోధనల ఫలితంగా... దేశావసరాలైన విద్య, కమ్యూనికేషన్స్, భూగర్భ వనరులు, రక్షణ, వాతావరణ పరిశోధనలాంటి మేటైన రంగాలలో అద్భుత మార్పులు చోటు చేసుకున్నాయి.
★ చివరగా సారాభాయ్ 1971వ సంవత్సరంలో
డిసెంబరు 30న పరమపదించారు. ఆయన వర్ధంతి సందర్భంగా స్మరించుకునే ప్రయత్నమిది.